వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం

వరవరరావుపై

మోడీపై హత్యకు కుట్ర పేరిత నాటకానికి తెరతీసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు దళిత, ఆదివాసీ హక్కులకై పోరాడుతున్న ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలను నిర్విర్యం చేసే కుట్ర చేస్తోందని విరసం ఆరోపించింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కుట్రకు సంబంధించి విరసం కార్యదర్శి పాణి, సీనియర్ సభ్యుడు కళ్యాణరావు, కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి, కాశిం, రాంకీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం భీమా కోరేగావ్ హింసకు కారకులంటూ ఐదుగురిని అక్రమంగా అరెస్టు చేసి.. తిరిగి విరసం నేత వరవరరావును అదుపులోనికి తీసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భీమా కోరేగావ్ హింసకు ముఖ్య కారకులైన సంఘ్ పరివార్ నాయకులను వదిలేసి.. దళిత, హక్కుల సంఘాల నాయకులను అరెస్టు చేయడం రాజ్యం చేస్తున్న కుట్రని వారు అన్నారు. నాగ్‌పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇలాంటి దుర్మార్గమైన కుట్రలు పన్ని అమలు చేస్తోందని.. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఒకటి జరిగిందని వారు గుర్తు చేశారు. దేశంలోని ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు.. ప్రశ్నించే గొంతులను, ఉద్యమించే శక్తులను అణిచివేయడానికి పాలకులు పోలీసు శాఖను ఉపయోగించుకుంటారని వారు తెలిపారు. అసలు కుట్ర మోడీ రాజ్యం చేస్తుండగా.. దాన్ని ప్రజాసంఘాల కుట్రగా దారి మళ్లించి మరింత అప్రదిష్ట మూటగట్టుకున్నదన్నారు. కార్పొరేట్లకు అమ్ముడుపోయిన మోడీ ప్రభుత్వం మతం, సంస్కృతి పేరుతో చేస్తున్న వికృత పోకడలు ప్రజలు గమనిస్తున్నారని.. దాని నుంచి దారి మళ్లించడానికి మోడీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు అమలు చేస్తోందని వారు చెప్పారు. నాగ్‌పూర్ నుంచి భీమా కోరేగావ్ మీదుగా హైదరాబాద్ వరకు ప్రభుత్వం పన్నిన కుట్రను ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు తిప్పి కొట్టాలని విరసం విజ్ఞప్తి చేసింది.

Keywords : virasam, varavararao, modi, bhima koregoan, rss, విరసం, వరవరరావు, భీమా కోరేగావ్, ఆర్ఎస్ఎస్,
(2024-03-30 00:53:37)



No. of visitors : 2140

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వరవరరావుపై