ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ

ʹదుర్గాప్రసాద్‌ను

తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక కో-కన్వినర్ దుర్గా ప్రసాద్ అరెస్టుపై నిన్నటి నుంచి ప్రజా, హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు గత వారం అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థుల చేత బలవంతంగా దుర్గాప్రసాద్ పేరు చెప్పించి.. అతడిని అరెస్టు చేసినట్లు పౌర హక్కుల సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. అయితే దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఇంత వరకు కోర్టులో హాజరుపర్చక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని భావించి పలు ప్రజా సంఘాల నాయకులు సోమవారం తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు, తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు కలసి దుర్గా ప్రసాద్‌ను వెంటనే కోర్టులో హాజరుపరచాలని కోరారు. ఈ రోజు మధ్యాహ్నంలోపు ఆయనను కోర్టులో హాజరుపరిచేలా చర్యలు తీసుకుంటానని హోం మంత్రి హామీ ఇచ్చారు. హోం మంత్రిని కలసిన వారిలో చిక్కుడు ప్రభాకర్, నలమాస కృష్ణ, నారాయణరావు, సదానందం, సందీప్ తదితరులు ఉన్నారు.

అసలేం జరిగింది..
ఈ నెల 6న డెమోక్రటిక్ స్టుడెంట్స్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు కంచర్ల బద్రి, కార్యనిర్వాహక సభ్యుడు సుధీర్, ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ సభ్యుడు రంజిత్‌ను సివిల్ డ్రెస్‌లో వచ్చిన కొంత మంది కిడ్నాప్ చేశారు. అయితే వాళ్లను పోలీసులే కిడ్నాప్ చేశారని, ఎక్కడ ఉన్నారో తెలియజేయాలంటూ డీఎస్‌యూతో సహా పలు సంఘాలు డిమాండ్ చేశాయి. కాని వారి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. డిప్యుటీ సీఎం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి డీఎస్‌యూ కార్యకర్తలు ఫోన్ కాల్స్ చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురి ఆచూకీ కోరుతూ హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం వీరిని అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ పలు సంఘాలు నిరసనలు కూడా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈ ముగ్గురిపై పలు కేసులు నమోదు చేస్తూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వరంగల్‌లో మిస్ అయిన వీళ్లు అక్కడకు ఎలా వెళ్తారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులే కిడ్నాప్ చేసి వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో చిత్ర హింసలకు గురిచేసి వారి చేత బలవంతంగా పలువురి పేర్లు చెప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆ ముగ్గురు విద్యార్థి నాయకులు చెప్పారంటూ తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం కో-కన్వినర్ దుర్గాప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇంత వరకు అతడిని కోర్టులో హాజరుపరచలేదు. అసలు ఏ జిల్లా పోలీసులు అరెస్టు చేశారో కూడా తెలియని పరిస్థితి. దుర్గాప్రసాద్‌కు హాని తలపెట్టాలనే లక్ష్యంతోనే ఈ అరెస్టుల జరుగుతున్నాయని పలువురు ప్రజా సంఘ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Keywords : telangana democratic forum, durga prasad, arrest, varavararao, nayini narsimha reddy, తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక, నాయిని నర్సింహారెడ్డి, హోం మంత్రి, దుర్గా ప్రసాద్, అక్రమ అరెస్టు, కోర్టు, వరవరరావు, ప్రజా సంఘాలు
(2024-04-24 20:23:09)



No. of visitors : 1698

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹదుర్గాప్రసాద్‌ను