ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?


ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?

ఇక్కడ

ఇక్కడ ఒక మాటే తీవ్రవాదం.. ఇక్కడ ఒక చూపే తీవ్రవాదం.. ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమే. రాజ్యానికి నచ్చని ఏదైనా తీవ్రవాదమే. అందుకే ఈ అక్రమ అరెస్టులు.. చిత్రహింసలు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కూడా గొప్ప భావుకుడైన విప్లవ కవిగా పరిచయం ఉన్న అరసవిల్లి కృష్ణకు ఆంధ్రా పోలీసులు నోటీసులు పంపారు. కేవలం కృష్ణకే కాదు విరసం కవి మేడక యుగంధర్, సభ్యుడు పెద్ది కృష్ణ, ప్రగతి శీల కార్మిక సంఘం నాయకుడు కొండారెడ్డి, తెలంగాణ ప్ర‌జాస్వామిక వేదిక క‌న్వీన‌ర్ దుర్గాప్ర‌సాద్‌, టీవీవీ పూర్వ స‌భ్యుడు అనిల్‌ల‌కు తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి.

చింతూరు పోలీసులు పంపిన నోటీసులలో ఆరోపించిన విషయం ఏంటంటే.. వీరందరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని. అందుకే UAPA కింద విచార‌ణ కోసం 15 రోజుల్లో పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. మోడీ హత్య, శాంతి భద్రతల పరిరక్షణ పేరిట పూణేలో మొదలైన ఈ అరెస్టుల పర్వం తెలంగాణ, ఏపీలో కూడా కొనసాగుతోంది. విరసం సీనియర్ నేత వరవరరావును కూడా అరెస్టు చేయాలనే ఆలోచనతో మోడీ హత్య నాటకంలో ఇరికించిన పోలీసులు ఆ తర్వాత తెలంగాణలోని పలువురు విద్యార్థి నాయకులు , ప్రజాస్వామ్య వాదులను అరెస్టు చేసింది. తాజాగా విరసం సభ్యులకు నోటీసులు పంపడంపై తీవ్ర ఆందోళన నెలకొంది.

అన్యాయంగా పంపిన ఈ నోటీసులను విరసం తీవ్రంగా ఖండించింది. ఇది ప్రభుత్వ బరితెగింపే అని.. ప్రజాస్వామికవాదులందరూ తప్పని సరిగా ఈ అక్రమ నోటీసులపై తమ నిరసన వ్యక్తం చేయాలని కోరుతోంది.

Keywords : virasam, varavararao, arasavilli krishna, ap police, notica, UPAP, విరసం, అరసవిల్లి కృష్ణ, అరెస్టులు, ఏపీ పోలీసు, చింతూరు, వరవరరావు
(2019-05-14 09:07:49)No. of visitors : 503

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


ఇక్కడ