ఈ హత్యలకు అంతే లేదా..?

ఈ

దళితులులపై జరిగే దారుణాలకు, హత్యాకాండకు అంతే లేకుండా పోతోంది. అగ్రవర్ణాలే కాకుండా తోడుండాల్సిన బహుజన కులాలు కూడా వేరు చేసి దారుణంగా హింసిస్తున్నాయి. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగిన ఈ సంఘటనే దీనికి నిదర్శనం. తన సాగుభూమిలోనికి ప్రవేశించడమే నేరమై ఎల్లయ్య, శేఖర్‌లు దారుణంగా హత్య చేయబడ్డారు. గొడ్డళ్లు, కొడవళ్లతో నిర్ధాక్షిణ్యంగా చంపేయబడ్డారు. అక్కడ జరిగిన ఘోర సంఘటనపై విరసం తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన యధాతథంగా..

విప్లవ రచయితల సంఘం
పత్రికా ప్రకటన

కందికట్కూరు దళితుల దారుణహత్యను నిరసిద్దాం.
ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీనపరిచే యత్నాలను తిప్పికొడదాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరుకు చెందిన సావనపల్లి ఎల్లయ్య, ఆయన కొడుకు శేఖర్‌లను 12వ తేదీన పక్కనే ఉన్న కిష్టారావుపల్లెకు చెందిన ముదిరాజు కులస్థులు గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఈ రెండు గ్రామాల సరిహద్దుల్లో సావనపల్లె ఎల్లయ్యకు 39 కుంటల పొలం ఉంది. అదే ఆ కుటుంబానికి జీవనాధారం. ఆ పొలాన్ని కిష్టారావు పల్లెకు చెందిన బీసీ కులం మామిళ్ల దేవయ్య, స్వామి, వెంకటేశ్‌ అనే అన్నదమ్ములు కబ్జా చేసుకోదలిచారు. ఈ వివాదం చాలా కాలంగా నడుస్తోంది. ఎల్లయ్య ఈ విషయంపై కోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు నడుస్తోంది.

గత రెండు రోజులుగా తొలకరి వానలు కురుస్తుండటంతో ఎల్లయ్య కుటుంబీకులు సాగు కోసం భూమిలోకి వెళ్లారు. మంగళవారం ఎల్లయ్య, ఆయన భార్య ఎల్లమ్య, కొడుకులు అనిల్‌, శేఖర్‌ ట్రాక్టర్‌ తీసుకొని పొలంలోకి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక డీజిల్‌ తెస్తానని అనిల్‌ ఊళ్లోకి వెళ్లాడు. ఎల్లమ్మ దూరంగా ఉంది. ఆ సమయంలో ముదిరాజు దేవయ్య అన్నదమ్ములు ముగ్గురు, వాళ్ల తల్లి కలిసి వెళ్లి ఎల్లయ్య, శేఖర్‌ కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ హత్యాకాండ జరుగుతుండగా దూరం నుంచి వస్తూ అనిల్‌ చూశాడు. దాంతో ఆయన మతి స్థిమితం తప్పిపోయింది.

ఈ తొలకరి దళితుల నెత్తురుతో నేల తడిసిపోయింది. భూమిని కాపాడుకోడానికి ఎల్లయ్య, శేఖర్‌ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మన సమాజంలో దళితులకు, బీసీ కులస్థులకు సహితం కుల వ్యవస్థ వల్ల తలెత్తిన సాంఘిక, ఆర్థిక వైరుధ్యానికి ఇది గుర్తు. ఈ ఘటన పత్రికల ద్వారా ప్రచారమైనా ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎస్టీ ఎస్టీ రక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ సుప్రీంకోర్టు మోదిత్వ తీర్పు ఇచ్చిన ఈ సందర్భంలో ఇది మనకు తెలిసిన ఘటన. గ్రామాల్లో దళితులు 39 గుంటల భూమి కాపాడుకోడానికి ఇద్దరు ప్రాణాలు బలిపెట్టాల్సి వచ్చింది. ఇక ఆత్మగౌరవ పరిరక్షణకు ఎక్కడ చోటు ఉంటుందో ఊహించవచ్చు. నేల మీది వాస్తవం ఇదైతే సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందని దాని వెన్ను విరిచి పడేస్తుంది.

ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయాలని విరసం డిమాండ్‌ చేస్తోంది. బీసీ కులాలకు చెందిన ప్రజాస్వామికవాదులు కూడా ముందుకు వచ్చి బలహీనవర్గాలకు, దళితులకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన తరుణం ఇది. పీడిత కులాలు కలిసి అగ్రకుల భావజాలానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని ప్రచారం చేయాల్సి ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీనపరచకుండా దళితుల జీవించే హక్కుకు, ఆత్మగౌరవానికి చట్టం, న్యాయవ్యవస్థ హామీ పడాలి.

-విప్లవ రచయితల సంఘం
పాణి(కార్యదర్శి)
సి. కాశీం, జగన్‌, బాసిత్‌, గీతాంజలి, అరసవెల్లి క్రిష్ణ, వరలక్ష్మి (కార్యవర్గ సభ్యులు)
వరవరరావు (విరసం వ్యవస్థాపక సభ్యుడు)

Keywords : illantakunta, nandikotkur, dalits, murderd, land, ఇల్లంతకుంట,దళితులు, హత్య, బీసీ, ఎస్సీ ఎస్టీ,
(2024-03-09 03:43:53)



No. of visitors : 968

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఈ