ఆ అక్కాచెల్లెళ్ల‌ను రేప్ చేయండి...అగ్ర‌కుల పంచాయ‌తీ తీర్పు !


ఆ అక్కాచెల్లెళ్ల‌ను రేప్ చేయండి...అగ్ర‌కుల పంచాయ‌తీ తీర్పు !

బుస‌లు కొడుతున్న ఉగ్ర‌కుల ఉన్మాదం ద‌ళితులపై, స్త్రీలపై చేస్తున్న అమానుషాలు స‌భ్య‌స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా ఉన్నాయి. అగ్ర‌కుల అమ్మాయిని ద‌ళిత యువ‌కుడు ప్రేమించాడ‌న్న అక్రోశంతో ఆ యువ‌కుడి చెల్లెళ్ల‌ను రేప్ చేయాల‌ని తీర్పు ఇచ్చిన దుర్మార్గ‌పు పంచాయ‌తీ క‌థ ఇది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని భాగ్‌పేట్ సమీపంలో సంక్రోట్ అనే ఓ కుగ్రామం ఉంది. అక్క‌డ అగ్ర‌కులాలకు చెందిన జాట్ పెద్ద‌లు చెప్పిందే వేదం, చేసిందే శాస‌నం. ద‌ళితులు ఉన్న‌ది 250 మంది మాత్ర‌మే. అయితే ద‌ళిత వ‌ర్గానికి చెందిన ర‌వికుమార్, జాట్ కులానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జ‌రిగే ప‌రిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ర‌వికి ముందే తెలుసు. ఊళ్లో హింసాత్మ‌క గొడ‌వ‌ల‌కు తానెందుకు కార‌ణం అవ‌డం అంటూ త‌న ప్రేమ‌ను త్యాగం చేయాల‌నుకున్నాడు. భ‌విష్య‌త్‌లో జ‌రిగే ప‌రిణామాల‌ను ముందే ఊహించుకుని విష‌యాన్ని ఆ అమ్మాయికి చెప్పాడు. దాంతో మ‌న‌సు అంగీక‌రించ‌క‌పోయినా ఆ అమ్మాయి కుటుంబ‌స‌భ్యులు చూసిన త‌మ కులానికి చెందిన వ్య‌క్తినే పెళ్లి చేసుకుంది. కానీ మ‌న‌సులో ఉన్న రవికుమార్‌ను మ‌రిచిపోలేని ఆ అమ్మాయి...చేసుకున్న వాడిని కాద‌నుకుని చావైనా బ‌తుకైనా ప్రేమించిన వాడితోనే ఉండాల‌నుకుని తిరిగి వ‌చ్చింది. ర‌హ‌స్యంగా ర‌వికుమార్‌ను పెళ్లి చేసుకుంది. దాంతో విష‌యం తెలుసుకున్న ఉగ్ర‌కుల పెద్ద‌లు ర‌వికుమార్‌ను కొట్ట‌డ‌మే కాదు...లేనిపోని కేసులు బ‌నాయించి జైలుకు పంపారు.

అదే స‌మ‌యంలో ఊరి ఉగ్ర‌పెద్ద‌లు...పంచాయ‌తీ పెట్టి దారుణ‌మైన తీర్పు ఇచ్చారు. ర‌వికుమార్ చెల్లెళ్ల‌ను ఇద్ద‌రినీ రేప్ చేసి, ఊళ్లో న‌గ్నంగా ఊరేగించాల‌ని తీర్పు ఇచ్చారు. అయితే అదే స‌మ‌యంలో ర‌వికుమార్ కుటుంబ స‌భ్యులు ఢిల్లీలో ఓ పెళ్లి ఫంక్ష‌న్‌కు వెళ్ల‌డంతో దారుణం త‌ప్పింది. ఊళ్లో ఖాప్ తీర్పుపై గ్రామ‌స్తులు ఢిల్లీలో ఉన్న ర‌వికుమార్ కుటుంబ‌స‌భ్యుల‌కు చెప్పారు. దాంతో వాళ్లు దేశ‌రాజ‌ధానిలోనే ఉండిపోయారు. జ‌రిగిన దారుణంపై ప్ర‌ధాన‌మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి, మానవ హక్కుల కమిషన్, షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు లేఖలు రాశారు. ఎవ‌రిని నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో...ర‌వికుమార్ చెల్లెల‌యిన మీనాక్షి.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఢిల్లీలో కానిస్టేబుల్‌గా చేస్తున్న మీనాక్షి పెద్ద‌న్న సుమిత్‌కుమార్ ఇప్పుడు వీరికి అండ‌గా ఉన్నాడు. న్యాయం చేయ‌డంతో పాటు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌న్న వారి విన్న‌పాన్ని విన్న సుప్రీంకోర్టు ఖాప్ పంచాతీలు చెల్ల‌వ‌ని తేల్చిచెప్పింది. సుప్రీం తీర్పును ధిక్క‌రించిన పోలీసులు కూడా ఖాప్ పంచాయ‌తీకి అండ‌గా నిలిచారు. జైలు జీవితం అనుభ‌విస్తున్న ర‌వికుమార్‌కు బెయిల్ వ‌చ్చినా జాట్ కుల‌స్తులు చంపేస్తార‌న్న భ‌యంతో ఆయ‌న బ‌య‌ట‌కు రాకుండా జైల్లోనే మ‌గ్గుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ర‌వికుమార్ చెల్లెలు మీనాక్షి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రవికుమార్‌పై మోపిన అభియోగాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలన్నారు. అన్యాయంగా వ్యవహరించిన గ్రామ పెద్దలపై, యూపీ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని ఆమె కోరారు. దేశంలోని న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సుప్రీం కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానన్నారు.

అయితే...ఈ వివాదం పెద్ద‌ది కావ‌డంతో ఖాప్ పంచాయ‌తీ పెద్ద‌లు మాట మార్చారు. రేప్ చేయాల‌నే తీర్పు తాము ఇవ్వ‌నేలేద‌ని బుకాయిస్తున్నారు.

Keywords : rape, khap panchayat, uttarpradesh, delhi, supreme court, police
(2020-08-09 20:38:45)No. of visitors : 7961

Suggested Posts


మహాత్ముడైన రేప్ నిందితుడు - పాఠం భోధిస్తున్న టీచర్లు

అక్కడ పిల్లలకు స్కూళ్ళలో మహాత్ముల గురించి భోధిస్తారు.... అందులో తప్పేం ఉంది ? రామకృష్ణపరమహంస, వివేకానంద, మహాత్మా గాంధీ, మదర్ తెరిసాల గురించి భోధిస్తారు... వీళ్ళగురించి చెప్పకూడదా ? వీళ్ళతో పాటు.....

సంస్కృతి రక్షకులమనే ఫోజు - అమ్మాయి పై రేప్ ప్రయత్నం

తాము నీతి మంతులమని, సంస్కృతి రక్షకులమని ఫోజులు కొడుతూ ఓ అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించిన ఓగుంపు దుర్మార్గమిది.....

100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ

100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 కి డయల్ చెయ్యలేదు కనుక అమెకిలా జరిగింది. ఆమె అలాంటి బట్టలు వేసుకుంది కనుక అలా జరిగింది. ఆమె ఆ టైమ్ లో బయటికి వెళ్ళింది కనుక అలా జరిగింది అనటానికి దీనికి తేడా ఏమిటి?

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


ఆ