ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!


ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!

ఇదో

మతోన్మాదం ఎంతటి ఘాతుకాన్నైనా చేయిస్తుంది. మోడీ అధికారంలోకి వచ్చాక ఒక వైపు చెడ్డీ గ్యాంగ్..మరో వైపు ఆదే భావజాలంతో ఊగిపోతున్న వ్యక్తులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలపై ఈ గ్యాంగ్‌లు చేస్తున్న దాడులు, హత్యలు, అరాచకాలను అడ్డుకునేవారే లేకుండా పోయారు. మతోన్మాదంతో, ఉగ్రకుల అహంకారంతో కుళ్ళిపోయినవారు ఈ డేశాన్ని మధ్యయుగాల నాటి అరాచక పాలనవైపు తీసుకెళ్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ దుర్మార్గపు ప్రచారాల వల్ల‌ కులం, మతం అనే అహంకారంతో కొందరు స్వంత పిల్లలలనే చంపుకొనిడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి యధార్థ సంఘటనే కేరళలో జరిగింది.

తన కులం వాడిని ప్రేమించి మనువాడితేనే కర్కోటకులుగా మారే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో వేరే మతం వాడిని ప్రేమించింది కేరళలోని త్రిస్సుర్‌కు చెందిన అంజలి. యవ్వనంలో ఉన్నప్పుడు ఉండే సహజమైన కోరికల్లాగే తనూ ఒక యువకుడిని ప్రేమించింది. అంజలికి ఎనిమిదేండ్ల క్రితమే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచే తల్లికితో ఉంటూ చదువుకుంది. అదే సమయంలో తన ఇంటి సమీపంలోనే ఉండే ఒక ముస్లిం యువకుడిని ఇష్టపడింది. ఆ యువకుడు కూడా ఏం ఆవారా కాదు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే చదువుకున్నాడు. అదే సమయంలో అంజలిని చూసి ఇష్టపడ్డాడు. ఇరుగుపొరుగున ఉంటున్నాం కనుక తమ ప్రేమకు ఎలాంటి ఆటంకం ఉండదని అనుకున్నారు. వివాహం చేసుకుందామని అనుకొని పెద్దలకు చెప్పారు. అదే వాళ్లిద్దరి పాలిట శాపమైంది. అంజలి తల్లి మాత్రం అందుకు ససేమిరా చెప్పింది. చివరకు అంజలి మామలు, అత్త సాయంతో ఆమెను బంధించి హింసించసాగింది.

అంజలిని హింసించారు.. మతోన్మాదులతో కలసి తల్లి ఏం చేసిందంటే..

అంజలి తల్లికి ఈ ప్రేమ వ్యవహారం నచ్చలేదు. కులం, మతం అంటూ అడ్డుపడింది. ఆమె తల్లికి మరికొంత మంది మతోన్మాదులు కలిశారు. ఇదంతా లవ్ జీహాదీ అన్నారు. నీ కూతురిని కావాలని వేరే మతంలోనికి మార్చేస్తున్నారంటూ తల్లికి లేనిపోనివి చెప్పారు. దీంతో అంజలి తల్లి ఆమెను ఇంట్లోనే బంధించింది. అక్కడ ఉంటే ఇద్దరికీ ప్రమాదమంటూ ఆ మతోన్మాదులు వేరే ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో అంజలిని చిత్రహింసలకు గురిచేశారు. వీళ్లకు తోడు అంజలి బంధువులు కూడా తోడయ్యారు. వీరందరూ కలసి అంజలిని ఒక మానసికి వ్యాదిగ్రస్తురాలిగా చిత్రీకరించారు.

డ్రగ్స్ ఎక్కించి.. చిత్ర హింసలు

ఒక ఆడపిల్ల అనే మానవత్వం మరచిపోయారు. వేరే మతం వాడిని ప్రేమించిందని ఏకంగా 45 రోజుల పాటు డ్రగ్స్ ఎక్కిస్తూ కరెంట్ షాక్స్ ఇచ్చారు. ఇవన్నీ తట్టుకోలేని అంజలి నడవలేని స్థితికి చేరుకుంది. అయినా సరే అంజలిని వదల్లేదు. 2016 అగస్టు 17న ప్రారంభమైన ఈ హింస ఏడాది పాటు కొనసాగింది. చివరాఖరికి మంగళూర్‌లోని ఓ వీహెచ్‌పీ నేత ఇంటికి ఆమెను తరలించి, అక్కడే ఆమెను బంధించారు. చివరాఖరికి ఓ పిల్లాడి ద్వారా ఫోన్‌ తెప్పించుకున్న ఆమె ఓ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఫేస్‌బుక్ రక్షించింది..

ఇన్ని చిత్రహింసలు అనుభవించిన అంజలిని రక్షించింది ఒక చిన్న పిల్లవాడు. బంధీగా ఉన్న సమయంలో అతను ఇచ్చిన ఒక ఫోన్ సహాయంతో తన స్నేహితునికి కాల్ చేసింది. ఆ తర్వాత తన దీన గాథను సోషల్ మీడియాలో పంచుకుంది. ఫేస్‌ బుక్ వీడియో వైరల్‌ కావటంతో మంగళూర్‌ మహిళా పోలీసు విభాగం రంగంలోకి దిగింది. మే 1 నుంచి 22 రోజులపాటు ఏకధాటిగా వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చివరాఖరికి ఆమెను రక్షించిన పోలీసులు విముక్తి కల్పించారు. కోర్టు ఆదేశాల మేరకు అంజలిని ఆమె అత్త ఇంటికి పంపించారు.

రాక్షసి తల్లిపై పిర్యాదు..

కనీసం కన్న కూతురు అనే ఇంగితం కూడా లేకుండా మతోన్మాదులతో కలసి అత్యంత కౄరంగా సొంత బిడ్డనే వేధించిన తల్లిపై కూతురు కూడా కనికరం చూపలేదు. తన తల్లిలాంటి వారు అసలు బతికే ఉండకూడదని అంజలి కోరుకుంది. ఈ ఘటనపై అంజలి కేరళ డీజీపీని కలసి పిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగాలంటే సీబీసీబీఐ దర్యాప్తు జరగాలని కోరుకుంది. అయితే కేరళ సీఎం పినరయ్ విజయ్ మాత్రం ఇంత వరకు ఈ ఘటనపై స్పందించలేదు.

దేశంలో లవ్ జీహాద్ అనే కాన్సెప్ట్‌ను కనిపెట్టి ఆడపిల్లల జీవితాలను నాశనం చేసేది కేవలం హిందూ మతోన్మాదవాదులే. కేవలం సంఘ్ పరివార్ అండతోనే ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయి. మరి వీరి ఆకృత్యాలకు అంతం ఎన్నడో.

Keywords : లవ్ జిహాద్, మతోన్మాదం,అంజలి, కేరళ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, love jihad, anjali, kerala,
(2018-07-20 09:31:15)No. of visitors : 170

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


ఇదో