ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ


ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ

ఉద్యమ

చె గువేరా అంటే ఏం చెప్పాలి..?
అగ్రరాజ్యాలు, పెట్టుబడిదారీ వ్యవస్థలు తలచుకోవడానికే భయపడిన ఒక డాక్టర్, ఒక ఫొటోగ్రాఫర్, ఒక రివల్యూషనర్..
ఈ రోజు ఎంతో మంది యువతకు రోల్ మోడల్‌గా ఉన్నాడని సంతోషించాలా.. ?
ʹచేʹ గురించి తెలియకుండానే.. అతడి స్పూర్తి మనసులో లేకుండానే.. గుడ్డిగా ఆరాధిస్తున్న నేటి యువతను చూసి బాధపడాలా..?

ʹచేʹ చనిపోతే జయంతి అనొచ్చు.. కాని ʹచేʹ బతికే ఉన్నాడే..!
ఈనాటి ఉద్యమ స్పూర్తిని రగిలించేది అతడే కదా..
ఈనాటి యువత గుండెల్లో కాస్తైనా పోరాటాన్ని మిగిల్చింది అతడే కదా..

అందుకే.. చే గువేరా
నీవు ఎప్పటికీ మావాడివే..!
-------------------------------------------

నిస్తేజం మది నిండా
నిరాశ చీకట్లను వెదజల్లుతుంటే
నిన్ను ఆవాహన చేసుకుంటే చాలు
ఉత్తేజం ప్రవహించి
వెయ్యి ఓల్టుల విద్యుత్ ప్రసరణ నర నరాల్లో !
.
నిస్సత్తువ నిలువెల్లా పాకి
మృతప్రాయంగా మేం పడుంటే
నీ చురకత్తుల చూపు చాలు
దిగ్గున లేచి చైతన్యం పొందడానికి !
.
నిరాశ నిస్పృహలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
నీ నెత్తిన మెరిసే అరుణతార చాలు
అసువులొడ్డిన అమరుల
ఆశయాల జెండా అందుకోవడానికి !
.
గమ్యం గమనం తెలియని ఆవేశానికి
నీ ఆలివ్ గ్రీన్ యూనిఫాం చాలు
దారి చూపే దీప శిఖగా నిలవడానికి !
.
విశ్వ మానవుడా
చే...!
ఎందెందు వెదికినా కనిపించే
నీ రూపు చాలు
మనిషిగా మిగిలేందుకు
మరణంలో జీవించేందుకు
(క్రాంతి పద్మ)
----------------------------------------
మనం మరిచిపోయినా...
పెట్టుబడిదారులు గుర్తు చేస్తూనే ఉంటారు...
టీ షర్టులపై, టోపీలపై, కాఫీ కప్పులపై...
విచిత్రం ఏంటంటే...
చంపినోళ్లే బతికించుకుంటున్నారు.
ప్రపంచ విప్లవ స్వాప్నికుడికి రెడ్ సెల్యూట్
(రఘు భువనగిరి)

Keywords : చే గువేరా, జయంతి, పుట్టిన రోజు, che guvera, birth anniversary,
(2018-07-21 12:23:31)No. of visitors : 376

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


ఉద్యమ