సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!


సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!

సినిమాల్లో

సమాజంలో స్త్రీ అంటేనే ఎంతో వివక్ష. ఇక సినిమాల్లో స్త్రీ పాత్రను మలిచే తీరు చూస్తే కోపం రాక మానదు. కేవలం స్కిన్ షో కోసమే కోట్లు వెచ్చించి ఎక్కడి నుంచో తారలను తీసుకొని వస్తారు. వాళ్లకంటూ ఒక అభిప్రాయం ఉండని పాత్రల్లో అలా వచ్చి నాలుగు పాట్లో నర్తించి వెళ్తుంటారు. అయితే ఈ మధ్య కొన్ని సినిమాల్లో స్త్రీ పాత్రలను మలిచే తీరు చూస్తే కాస్త మార్పు కనిపిస్తోంది. అందులోనూ ఇటీవల చర్చనీయాంశంగా మారిన ʹకాలాʹ సినిమాలో స్త్రీ పాత్రల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం గురించి ʹరమా సుందరిʹ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక పోస్టు పెట్టారు. అది యధాతథంగా..
--------------------------------------------------
తమిళ సినిమాలలో ఈ మధ్య వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి మిత్రుల ద్వారా విన్నాను. ʹకాలాʹ సినిమా గురించి జరుగుతున్న చర్చలు చదివాను. చల్లపల్లి స్వరూపరాణి నుండి వచ్చిన అభిప్రాయం చదివాక సినిమా చూడాలని అనిపించింది. ʹఎక్కువ రోజులు ఉండదు. వెంటనే వెళ్లండి.ʹ సన్నిహితుల సలహా మేరకు సినిమాకు టికెట్ బుక్ చేసుకొన్నాను. 6:25కు షో అయితే 6 వరకు నాకు పని తెమలలేదు. కాలేజ్ నుండే డైరెక్ట్ గా సినిమా హాలుకు వెళ్లాను. గుంటూరు జె ఎల్ ఈ లో ఏ స్క్రీన్ లో ఉందో ఎవరు సరిగ్గా చెప్పలేదు. కొద్ది సేపటి తరువాత ఒక అబ్బాయి వచ్చి ఏ సినిమాకు అని అడిగి, ఒక స్క్రీన్ వైపు పంపాడు. థియేటర్ లోకి వెళితే నేను ఒక్క దాన్నే ఉన్నాను. సినిమాలో మునిగి పోయిన అరగంట తరువాత చూస్తే ఇంకో ఆరుగురు కనబడ్డారు. సినిమా అయిపోయాక చివరిలో వచ్చే సాంగ్ లో చూపిస్తున్న మురికివాడ ఉద్యమాలను పరవశించి చూస్తుంటే ఎవరో ʹమేడమ్ʹ అని పిలుస్తున్నారు. తిరిగి చూస్తే ప్రేక్షకులు అందరూ అప్పటికే ఖాళీ చేశారు. హాలు శుభ్రం చేసేవాళ్లలో ఒకామె నన్ను బయటకు వెళ్లమని అడుగుతున్నది. ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాను. నా పరవసత్వానికి ఆమె ముచ్చట పడినట్లు ఉంది, ఆమె కూడా నవ్వింది. ఇంతకూ ఆమె ఆ సినిమా చూసిందో లేదో. అలాంటి ఆమెలే ఆ సినిమా నిండా పాత్రలు.

ʹకాలా సినిమాను ఎందుకు ప్రజలు చూడటం లేదు?ʹ అని ఒక ఫ్రెండ్ అడిగింది. హిందుత్వ మనువాదులకు, అగ్రవర్ణ - వర్గ మనస్తత్వం ఉన్నవాళ్లకు ఆ సినిమా నచ్చదు. చూడరు. మరి డైరక్టర్ ఎవరి భుజాల మీద చేతులు వేసి ఈ సినిమా తీశాడో వాళ్లెందుకు ఈ సినిమా చూడటం లేదు? ʹఉద్యమాలను పరిష్కారంగా చూపించటం వారికి అర్థం కాలేదేమో?ʹ అన్నాను. ʹఆ నలుగురుʹ సినిమా ప్రతిపాదించిన సమాజ సేవను అంగీకరించి ఆ సినిమాను ఆదరించిన ప్రజలు, ఉద్యమ పరిష్కారాలను చెప్పిన ఈ సినిమాకు యిచ్చిన నిరాదరణ బాదించింది. ఉమ్మడి ఉద్యమ పరిష్కారాలు అంతగా అలవాటు పడని వారికి ఈ సినిమా గొప్పగా అనిపించదేమో అని గొణుక్కొగలిగాను, కాని అది పూర్తి కారణం కాదని తెలుసు. మన వర్గాల ప్రజలు పూర్తిగా కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డారు. ఎన్నికలలో ప్రజా వ్యతిరేక పార్టీలను గెలిపిస్తున్నట్లే, ప్రజా హానికర సినిమాలను కూడా గెలిపిస్తున్నారు.

ʹసినిమాలో రజనీ కాంత్ ను అక్కడక్కడ హీరోయిక్ గా చూపించారు, ఆయనకు పెద్ద ఇల్లు ఉన్నట్లు చూపించారు.ʹ ఇలాంటి విమర్శలు (కొన్ని నిజాలు కూడా) అన్నీ ఈ సినిమా ముందు దూదిపింజలలాగా తేలిపోయాయి. సినిమా మొత్తం కంటెంట్ తో పోలిస్తే ఈ లోపాలు పెద్దగా అనిపించవు. శ్రామిక దళిత, బహుజనుల సినిమా ఇది. ఆ కులాలలో, ఆ సమూహాలలో ఉండే సహజ కుటుంబ, సామాజిక సంబంధాలను ఎత్తిపట్టారు. ఒక కంపేరిటివ్ స్టేట్మెంట్ వేసి చూపించినట్లుగా ధనిక అగ్రకుల - పేద దిగువ మధ్య తరగతుల మధ్య ఉండే తేడాలను బహిర్గతం చేశారు. ఒక వైపు తెల్లటి సోఫాలు, ధవళ వస్త్రాలు, తెల్లటి చర్మాలు ... తెల్లటి తెలుపు, శుభ్రమయమైన ప్రపంచం. అన్ని సినిమాల్లో కనిపించే ఇలాంటి అరమందం మేకప్పుల సౌందర్యాలను చూపిస్తూనే... పక్కనే మురికి, యిరుకువాడల్లో ఉండే సమిష్టితత్వం కలిగిన కాయకష్టం చేసుకొనే వారి వెలుగు చిరునవ్వుల అందంతో పోల్చి వాటి కృత్రిమత్వాన్ని ఎద్దేవా చేశాడు డైరెక్టర్. ఒక పక్క సంతాప సభలు- ఇంకో పక్క పూజలు, భజనలు. ఆడవాళ్ల పరదాల మాటు ఒక వైపు, కుటుంబ చర్చల్లో ఆడవాళ్ల ప్రాముఖ్యత ఇంకో వైపు.

నగరాలను శుభ్రత పేరుతో స్లమ్ ల నిర్మూలన కార్యక్రమం ఎంత కుట్రపూరితంగా జరుగుతుందో ఈ సినిమా దృశ్య రూపంలో వేసిన ముద్ర ప్రజలందరికి అర్థం అయితే ఎంత బాగుంటుంది! ఎన్ జీవోల హ్రస్వ స్వార్ధ దృష్టిని కడిగి పారేసిన సినిమా ఇది. స్లమ్స్ లో ఆడే ఆటలు క్రికెట్, కబడీలు అయితే, గోల్ఫ్ కోర్టుల కడతామనే పేరుతో ఎకరాలు కబ్జాను ప్రశ్నించిన యువరక్తం మనల్ని ఉర్రూతలాడిస్తుంది.
ఈ సినిమాలో ప్రతి పాత్ర తమ అస్తిత్వం నుండే మాట్లాడతాయి, ప్రవర్తిస్తాయి, ప్రతిస్పందిస్తాయి. అభివృద్ధి పేరుతో హరికి మద్దతునిచ్చిన ముస్లిం మహిళ జరినా; తన కాళ్లను మొక్కమన్నట్లుగా హరి అడిగినపుడు అతని పక్కనే ఉన్నరాముడి విగ్రహాన్ని చూసి బయటకు వచ్చేస్తుంది. జరినాను గతంలో ఎంతో ప్రేమించి కాలా ʹనేను ప్రేమించింది అప్పటి జరినానుʹ అనే స్పష్టతతో ఉంటాడు. ఆమె రెండో రాకడతో ఎంతో ఎక్సైట్ అయినా ఆమె ఎన్ జీ వో మనస్తత్వం పట్ల క్రిటికల్ గానే ఉంటాడు. భూమిలో పాదాలు నిక్కబొడిచి ప్రతి పాత్రా ప్రవర్తిస్తాయి.

తమిళ సినిమాలలో స్త్రీల పాత్రలు మెరుగవుతున్నాయి. గొప్ప స్త్రీ పాత్రలను డైరక్టర్ ఈ సినిమాలో సృష్టించాడు.

Keywords : kaala, pa ranjith, women characterisation , rajnikanth, కాలా, పా రంజిత్, స్త్రీ పాత్రలు, రజనీకాంత్
(2018-07-19 16:59:41)No. of visitors : 277

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


సినిమాల్లో