ఆర్ఎస్ఎస్ ఎన్నికల వ్యూహంలో కాశ్మీర్ సమిద కానున్నదా?


ఆర్ఎస్ఎస్ ఎన్నికల వ్యూహంలో కాశ్మీర్ సమిద కానున్నదా?

ఆర్ఎస్ఎస్

మబ్బులు లేకుండా వర్షం కురిసినట్లు కొన్ని విస్మయకరమైన సంఘటనలు రాజకీయాలలో జరుగుతాయి. ప్రకటిత ఆర్ఎస్ఎస్ విధానాలకి భిన్నంగా పీడీపీతో బీజేపీ నాటి పొత్తు అలాంటిదే. తిరిగి పీడీపీ సర్కారుతో నేటి ఆకస్మిక ఉపసంహరణా అలాంటిదే. దీని వెనక బీజేపీ రహస్య కుట్రల గూర్చి ఇప్పటికే విభిన్నకోణాల్లో విమర్శలు బహిర్గతమవుతున్నాయి. అవి స్థూలంగా సరిగ్గానే ఉన్నాయి. 2018లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. 2019లో (రాజస్థాన్,మధ్య ప్రదేశ్ ఆర్ఎస్ఎస్‌కి ప్రతిష్ఠాకర రాష్ట్రాలు) 2019 ఎన్నికలకి ముందు ఆర్ఎస్ఎస్‌కి పెద్ద సమస్య. ఎన్ని కొరతలు ఉన్నా యూపీలో యోగి సర్కార్ రైతు రుణ మాఫీని అమలు చేసింది. రేపటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలలో రుణమాఫీకి దిగకుండా జనం ముందుకి బీజేపీ రాలేని స్థితి ఉంది. అది పులిమీద స్వారీ. బడా కార్పొరేట్లకు మింగుడు పడని సమస్య. బ్యాంకులకు సుమారు పది లక్షల కోట్ల రూపాయల బడా కార్పొరేట్ల కుహనా నిరర్థక బాకీల ఎగవేత వ్యూహానికి రైతు రుణ మాఫీ ఆటంకమే మరి. అట్టి కార్పొరేట్ల మాట కాదని రాజస్థాన్, ఎంపీ ఎన్నికలలో రుణమాఫీకి పూనుకుంటే.. 2019లో జరగబోయే అసలు ఎన్నికలకి పార్టీ నిదులు తగ్గవచ్చు. ఒకే గుండుకి రెండు లేదా 3 మూడు పిట్టలన్నట్లు.. కాశ్మీర్ వ్యూహం ఆర్ఎస్ఎస్‌చే రూపొంది ఉండొచ్చు. ఎప్పటి నుండో విలువైన కుంకుమ, ఆపిల్ తోటలతో కూడిన ప్రకృతి అందచందాల కాశ్మీర్ లోయ కబ్జా కోసం బడా కార్పొరేట్ సంస్థలు ఎదురు చూస్తున్న సంగతి తెల్సిందే. ఆ బడా కార్పొరేట్ల రహస్య ఎజెండాప్రకారం నేడు పీడీపీ సర్కారుకు మద్దతుని బీజేపీ ఉపసంహరించి ఉండొచ్చు. ఆర్టికల్ 370 ఎప్పుడో గుజ్జు తీసిన అరటి తొక్కగా మారింది. 35A పరిస్థితీ అలాంటిదే. అవి నేడు దిష్టి బొమ్మలే! ఐతే అట్టి దిష్టి బొమ్మల ఆధారంగా కాశ్మీర్ జాతి జనులు తమ ప్రకృతి వనరులని, భూములనీ కబ్జా కాకుండా సమరశీల పోరు సాగిస్తోంది. లోయలో పునాది కోసం జమ్మూ ప్రజా పరిషత్ పేరుతో 1950వ దశాబ్దిలో జనసంఘ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విఫల కుట్రలు తెలిసిందే. పీడీపీతో పొత్తు వల్ల అయినా లోయలో పునాదికి ఆర్ఎస్ఎస్ నేడు ప్లాన్ వేసింది.

నిజానికి ఈ "పొత్తు సర్కార్" పాలనే మొదటి సారి దక్షిణ కాశ్మీర్ లోయని ఆజాద్ పోరులో శిఖరాగ్ర స్థాయికి చేర్చింది. ఇప్పుడు ఆకస్మికంగా తెగ దెంపులు చేసుకొని లోయని ఓ మినీ పాకిస్తాన్‌గా నిరూపించే అనేక సాక్ష్యాలు ప్రజల బుర్రలకి ఎక్కిస్తుంది. ఇక కార్పొరేట్ మీడియా కట్టు కథలూ, కధనాల సృష్టి ఓ పరిశ్రమగా వర్ధిల్లుతుంది. మోదీ హత్యకు వరవరరావు సహా మేధావులు పధకం పన్నారన్న కట్టుకదలపై కార్పొరేట్ మీడియా కూడా నిట్టనిలువునా చీలింది. అలా చీలనివ్వని సరికొత్త కుట్రలకి బహుశా లోయని.. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసి ఉండొచ్చు. "లోయ కబ్జా కి గల నేటి రాజ్యాంగ ఆటంకాలని తొలగించి మున్ముందు మీ కార్పొరేట్లకి అప్పగిస్తాం" అనే రహస్య భరోసాతో ఆర్ఎస్ఎస్ వ్యూహం పన్ని ఉండొచ్చు. ఈకొత్త వ్యూహం సరిగ్గా అమలు జరగాలంటే ముందుగా లోయ మరింత నెత్తుటి మడుగు కావాలి. అంత కంటే ముందు లోయ ప్రజలని దేశ ద్రోహులుగా చిత్రించాలి. దాన్ని కబ్జా చేయ జూస్తున్న బడా పెట్టుబడిదారుల చెప్పు చేతుల్లోని మీడియా దేశ ప్రజల బుర్రలని అందుకు ఎలాగూ సిద్ధం చేస్తుంది. తద్వారా 2019 ఎన్నికలకి అసాధారణ స్థాయిలో పార్టీ నిధి సేకరణ జరుగుతుంది. ఈ సంక్లిష్ట సమయంలో మినీ పాకిస్తాన్(లోయ) గా ముద్రవేసి భారీ యుద్ధం చేస్తుండ వచ్చు.

కర్ణాటక ఎన్నికల తర్వాత నేడు ఐక్యమవుతున్న ప్రతి పక్షాలు కూడా ఆచరణలో పాలక పక్షాలే! లోయ ప్రజలపై రేపటి కృత్రిమ దేశభక్తియుత యుద్దాన్ని మేము బలపరుస్తామంటే మేము బలపరుస్తామంటూ ఈ పక్షాలన్నీ రేపు పోటీపడి గొంతులు చించుకుంటాయి. అప్పుడు రైతు రుణమాఫీకి దిగటం దేశ ద్రోహనేరం గా మారుతుంది. దేశం విదేశీ ముప్పులో ఉన్నప్పుడు రైతు రుణ మాఫీ ఏమిటని "దేశభక్తియుత కార్పొరేట్ మీడియా" దేశ రైతాంగంతో సహా ఇతర వర్గాల ప్రజలని చాలా గొప్పగా చైతన్య పరుస్తుంది. చివరి మాట! లోయ ప్రజల పట్ల దేశ ప్రజల వైఖరిని బట్టి మాత్రమే ఈ సరికొత్త కుట్రల భవిష్యత్తు ఉంటుంది.1911 సెన్సస్ ప్రకారం లోయ జనాభా 70 లక్షలు మాత్రమే! (మొత్తం J&K జనాభా ఒక కోటి 25 లక్షలు) ఈ 70 లక్షల మంది కోసం లోయలో నేడు ఏడు లక్షల సైన్యం మరో మూడు లక్షల ఇతర సాయుధ బలగాలు తిష్ట వేసాయి. ఈ సైనిక బలగాల ఖర్చుని మన దేశ ప్రజలు భరిస్తున్నారు. ప్రతి ఏడుగురు పౌరులకు ఒక సైనికుడు! వారిలో సగటున ఒకరు వృద్ధుడు, ఓ పసిపిల్ల కూడా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేటికీ ప్రధాన ధోరణిగా కొనసాగే లోయలో ప్రతి కుటుంబం ఏడూ లేదా ఎనిమిది మంది సభ్యులతోఉంటుంది.అంటే ప్రతి ఇంటికొక సాయుధ సైనికుడనమాట! తల్లి కడుపు నుండి బయట పడ్డ ప్రతి శిశువుకూ మొదట సైనికుడు కనిపిస్తాడు. పిల్లలు ఆదుకునే వీలు లేదు. పదిమందిలో స్వేచ్ఛగా తిరిగే వీలు లేదు. స్త్రీలు కూరగాయలకి కూడా మార్కెట్‌కి వెళ్లే వీలు లేదు. సినిమాలకి ఆలమగలు వెళ్లే వీలు లేదు. తమ స్వంత నేల మీద లోయ అంద చందాలు స్వేచ్ఛగా తిలకించే వీలులేదు. మిగిలిన దేశ, విదేశీ పర్యాటకులకు ఉన్న పరిమిత స్వేచ్ఛ కూడా ఆ నేలతల్లి బిడ్డలకు లేదు. తుపాకుల మధ్య పుట్టి, తుపాకుల మధ్య పెరిగి, టోపీకీ గుళ్ళకి బలి అయ్యే కన్నీటి బాధిత కాశ్మీరు జాతి కి అండగా నిలుద్దాం. ఇది కేవలం సంఘీభావం కాదు. ఆ యుద్ధం వల్ల రైతు రుణ మాఫీ ఎగనామ చర్య తెలిసిండే. ఇంకా యుద్ధ భారం మోసే ప్రజలుగా కూడా ఆ యుద్ధం మన దేశ ప్రజలందరి మీద చేసేదే!

మిత్రులారా, ఇప్పుడువాళ్ళ భూములూ, ఆపిల్ తోటలూ, ఖరీదైన కుంకుమ పూదోటలూ, సుందర ఉద్యాన వనాలూ కబ్జా కి గురయ్యే ముందు రక్త సిక్తం కాబోతున్నాయి. అవి ఆ భూమి పుత్రులవి. అంబానీ ఆదానీ వంటి సంపన్నులకు లోయ వనరుల అప్పగింత కోసం జరిగే ఈ అధర్మ యుద్ధంలో మొదట సత్యం సమాధి కాబోతోంది. ఒక వైపు రుణమాఫీకి సమాధి! మరోవైపు లోయ ప్రజలకి పరాయూకరణ! ఈ రెండూ ఒకే యుద్ధ నాణేనికి బొమ్మా, బొరుసు వంటివి. ఒక వైపు భారత దేశ ప్రజల ప్రయోజనాలనీ, మరోవైపు కాశ్మీరు బాధిత జాతి జనుల ప్రయోజనాల నీ బలిపెట్టే యుద్ధ క్రీడలో ఇది భాగం కావచ్చు. గాన కుహనా దేశభక్తియుత, ప్రజాతంత్ర, లౌకిక పక్షాలపై ఆధార పడకుండా నిజమైన దేశభక్తియుత,ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఈ సరికొత్త ఫాసిస్టు తరహా కుట్రలపై ప్రజలని చైతన్య పరచాల్సి ఉంది. ఈ సందర్బంగా కాశ్మీరు నేపధ్య చరిత్రని మరోసారి అధ్యయనం చేద్దాం. "లోయ రైతుదీ, దేశ రైతుదీ ఒకే సమస్య, దేశ పౌరులదీ, లోయ పౌరులదీ ఒకే బాధ, తుత్తుకుడిదీ, లోయదీ ఒకే తరహా కన్నీటి ఘోష" అని సరళ భాషలో అనుసంధానించి ప్రజలని చైతన్యవంతం చేద్దాము.

పి ప్రసాద్, ఐ ఎఫ్ టి యూ

Keywords : kashmir, valley, rss, bjp, pdp, corporates, కశ్మీర్, లోయ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, పీడీపీ, కార్పొరేట్లు
(2018-07-18 11:03:24)No. of visitors : 418

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


ఆర్ఎస్ఎస్