నయీ పీష్వాయీ నహీ చలేగీ - వరవరరావు


నయీ పీష్వాయీ నహీ చలేగీ - వరవరరావు

నయీ

సాధారణ ప్రజాబాహుళ్యం నుంచి ఎదిగి, వాళ్ల గురించి గొంతు విప్పుతున్న మేధావులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులపై ఒక బీభత్స దాడికి రాజ్యంపూనుకున్నదనడానికి భీమా కోరేగావ్‌ కేసు ఒక తాజా ఉదాహరణ. న్యాయపోరాటాన్ని నేరచర్యగా చిత్రించే దుర్మార్గం. జనవరి నుంచి జూన్‌ దాకా ఈ దళిత- మావోయిస్టు సంబంధ నేరారోపణ వెనుక ఎంత ఫాసిస్టు కుట్ర ఉన్నదో ఊహించ వచ్చు. దీనిని సాగనిద్దామా.. ప్రతిఘటిద్దామా అని తేల్చుకోవలసిన తక్షణ సందర్భంలోకి దేశంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు రాజ్యంచే నెట్టబడ్డారు.

ఇపుడింక దళితులు టెర్రరిస్టులయ్యారు. నిషేధితులయ్యారు. 200 సంవత్సరాల క్రితం పీష్వాల పాలనను అంతం చేసి అమరులైన దళిత, బడుగు వర్గాల యోధులను స్మరిం చుకున్నందుకు వాళ్లు నేరస్థులయ్యారు. దళితులు, ఆదివాసులు, ముస్లిం మైనారిటీలు, శివాజీ వారసులు ఇంకా తదితర బడుగు వర్గాల ప్రజలు ʹఎల్గార్‌ పరిషత్‌ʹ ఏర్పాటు చేసుకుని పూణె శనివా రపు పేట వేదిక నుంచి 2017 డిసెంబర్‌ 31న ʹనయీ పీష్వాయీ నహీ చలేగీʹ అని వేలాది మంది సభలో నినదించినందుకు నేరస్థులయ్యారు. నాగపూర్‌ నుంచి, ముంబై నుంచి, పూణె నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దేశ బహుళత్వానికి చిహ్నంగా ఎన్నో జెండాలతో తరలివచ్చి బ్రాహ్మణీయ వివక్ష వ్యతిరేక జ్యోతిరావు ఫూలే సంప్రదాయాన్ని, డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కులనిర్మూలన పోరాటాన్ని భుజాలకెత్తుకున్నందుకు నేరస్థులయ్యారు. నలుపు, ఆకుపచ్చ వంటి ఎన్నో రంగుల పతాకాలలో కాషాయానికి కేవలం ఎరుపు కనిపించింది. ఏడురంగుల సింగిడిలోని ఐక్యత కాషాయానికి కంటగింపయింది.

1948నాటికే భారత పాలకవర్గాన్నించి ఆజాదీ కోరిన కశ్మీరీలు, స్వయం నిర్ణయాధికారాన్ని కోరిన ఈశాన్య తెగల ప్రజలు దేశద్రోహులయ్యారు. టెర్రరిస్టులయ్యారు. జాతులుగా బ్రాహ్మణీయ హిందూజాతి శత్రువులయ్యారు. లౌకిక ప్రజాస్వామ్యమని రాసుకున్నప్పటికీ దేశ విభజన కాలం నుంచే ముస్లింలు ఈ దేశంలో ఉండదగనివారయ్యారు. యువకులయితే ఐఎస్‌ఐ ఏజెంట్లు, దేశద్రోహులు, టెర్రరిస్టులయ్యారు. నక్సల్బరీ రైతాంగపోరాట కాలంనుంచి ఆదివాసులు నక్సలైట్లయ్యారు. సాంఘికంగా అంటరానివారిగా వెలివేతకు, వివక్షకు గురి అవుతూ నిత్యం దాడులు, అత్యాచారాలు, హత్యాచారాలకు గురవుతున్న దళితులు ఇపుడు రాజ్యం దృష్టిలో దేశద్రోహులుగా, టెర్రరిస్టులుగా మారిపోయారు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నవారుగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ స్థితి మరీముఖ్యంగా నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక రాజకీయ ఆచరణగా మారి, భీమా కోరేగావ్‌లో బీభత్స రూపాన్ని తీసుకున్నది. 2017 డిసెంబర్‌ 31 ప్రదర్శన తర్వాత 2018 జనవరి 1న వేలాదిగా తరలివచ్చిన దళితులపై దాడి,దౌర్జన్యం, హింస జరిగింది. అందులో ముగ్గురు దళితులు అమరులయ్యారు. ఈ దృశ్యానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక దళిత మహిళ పోలీసుల వేధింపులు భరించలేక ఆరునెలలు పోయినాక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హింసా దౌర్జన్యాలను ప్రేరేపించినవాళ్లు ఇద్దరు ఆరెస్సెస్‌ కార్యకర్తలు. ఒకరు శంభాజీ భీడే. ఈయనను స్వయంగా మోదీ ʹగురూజీʹ అంటాడు. ఆయనకు పద్మశ్రీ బిరుదు ఇప్పించే ప్రయత్నం కూడా చేశాడు. మరొరు మిలింద్‌ ఎక్బోటే. ఈ ఇద్దరిపై ప్రాథమిక నేరారోపణ కోర్టులో నమోదైంది. వాళ్లు ముందస్తు బెయిలు కొరకు సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్లారు. కానీ బెయిల్‌ లభించలేదు.

మరోవైపు జనవరి 14వ తేదీన ముంబయిలో రిలయన్స్‌ కంపెనీలో పనిచేసే ఏడుగురు దళిత కార్మికులను వాళ్ల వాళ్ల ఇళ్లల్లో అరెస్టు చేశారు. వీళ్లు ప్రదర్శనలో పాల్గొని, హింసా దౌర్జన్యాలు రెచ్చగొట్టారని, చిత్రహింసలు పెట్టి వారం పది రోజులు పోలీసు లాకప్‌లో పెట్టుకుని యుఎపిఎ కింద కోర్టులో హాజరుపరిచి పూణె జైలుకు పంపించారు. ఈ ఏడుగురు తెలంగాణకు చెందినవారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి క్రియాశీలంగా ముంబై నుంచి మద్దతు పలికినవాళ్లు. వీళ్లనే కాదు, సుప్రసిద్ధ రచయిత మచ్చ ప్రభాకర్‌ను కూడా ఈ నేరారోపణపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ (ఎటిఎస్‌) చిత్రహింసలు పెట్టి వేధించినందున ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆరు నెలల కాలం గడిచిపోయింది. వీళ్లపై చార్జిషీటు కూడా వేశారు. మహారాష్ట్ర, పూణె సరిహద్దుల్లో నిర్మాణం అవుతున్న గోల్డెన్‌ కారిడార్‌ను ప్రతిఘటించడానికి మావోయిస్టులు దళాలను పంపించారని, వాళ్లతో సంబంధాలు పెట్టు కుని సహకరిస్తున్న వీళ్లు భీమా కోరేగావ్‌ ప్రదర్శనలో చేరి హింసా దౌర్జన్యాలు పురికొల్పారన్నది ఆరోపణ. అసలు బాధ్యులైన ఆరెస్సెస్‌ కార్యకర్తలిద్దరిని ఎందుకు అరెస్టు చేయరని మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి, పూణె నగరాల్లో ప్రజల నుంచి డిమాండ్‌ పెరగడంతో పాలకులు కొత్త పథకాన్ని రచించారు. ఏప్రిల్‌ నెలలో ఢిల్లీలోని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రజా సంబంధాల కార్యదర్శి రోనా విల్సన్‌ ఇంటిపై దాడి చేసి ల్యాప్‌టాప్‌, ఫోన్‌, ఇతర పరికరాలు ఎత్తుకెళ్లారు. అలాగే నాగపూర్‌లో సుప్రసిద్ధ న్యాయవాది, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్‌ (ఐఎపిఎల్‌) సెక్రెటరీ జనరల్‌ సురేంద్ర గాడ్లింగ్‌ ఇంటిపై దాడి చేసి ఆయన వద్దనున్న ఎలక్ట్రానిక్‌ సామగ్రినంతా ఎత్తుకెళ్లారు. ఈలోగా ఎస్‌.సి.,ఎస్‌.టి అట్రాసిటీ ప్రివెంటివ్‌ యాక్ట్‌ను నీరుగారుస్తూ సుప్రీంకోర్టు మార్చ్‌20న తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా దళితులు, ప్రజాస్వామ్యవాదులు లక్షలాదిమంది సుప్రీంకోర్టు తీర్పుపై నిరసన తెలిపి ఏప్రిల్‌ 2న బంద్‌ పాటించారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఈ ప్రదర్శనలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది దళితులు అమరులయ్యారు.

సుప్రీంకోర్టు తీర్పు అవకాశంగా తీసుకుని రోహిత్‌ వేముల (ఆత్మ)హత్య కాలం నుంచి న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులు పృథ్వి రాజ్‌, చందన్‌ మిశ్రాలను విజయవాడ నుంచి మార్చ్‌ ఆఖరున కిడ్నాప్‌ చేసి సెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ పొదిలి అప్పారావు హత్యాప్రయత్నం కేసులో యుఎపిఎ, ప్రజాభద్రతా చట్టం, పేలుడు పదార్థాల చట్టం, కుట్ర మొదలైన సెక్షన్‌ల కింద జైలులో పెట్టారు. పృథ్విరాజ్‌ కృష్ణా జిల్లా విరసం సభ్యుడు కనుక కృష్ణా జిల్లా విరసం సభ్యులు అరసవెల్లి కృష్ణ, పెద్ది కృష్ణ, మేడక యుగంధర్‌, ఇతర ప్రజాసంఘాల నాయకులు బండి దుర్గా ప్రసాద్‌ (అప్పటికే యుఎపిఎ, ప్రజాభద్రతా చట్టం, పేలుడు పదార్థాల చట్టం కుట్ర మొదలైన నేరారోపణలపై డి.ఎస్‌.యు నాయకులు బద్రి, రంజిత్‌, సుధీర్‌లతోపాటు ఖమ్మం జైలులో ఉన్నాడు) కొండా రెడ్డి మొదలైన వారికి ఇప్పుడు సమన్లు పంపారు.

దళితుల పట్ల రాజ్యం ఒక రాజకీయ వ్యతిరేక వైఖరిని తీసుకుని వారిని టెర్రరిస్టులుగా చిత్రించి ʹఉపాʹ వంటి కేసుల్లో ఇరికించడం మాత్రమేకాదు, మావోయిస్టులతో సంబంధాలున్నాయనే పేరుతో దీర్ఘకాలం జైలులోపెట్టడం, చంపివేయడం కూడా రాజ్యం ప్రారంభించిందని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో భీమ్‌ సేన నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ను కోర్టు విడుదల చేసిన తర్వాత కూడా వెంటనే అరెస్టు చేసి ఏడాదిపైగా జైలులో ఉంచారు.

ఈ నేపథ్యంలో చూడవలసి ఉంటుంది రోనా విల్సన్‌, సురేంద్ర గాడ్లింగ్‌లతో పాటు సుధీర్‌ ధావలే, షోమాసేన్‌, మహేష్‌ రౌత్‌లనుకూడా అరెస్టు చేసి భీమా కోరేగావ్‌ కేసులో యుఎపిఎ కింద ముద్దాయిలుగా చూపడం. సుధీర్‌ ధావలే మూడు దశాబ్దాలుగా సాంస్కృతిక కార్యకర్త, రిపబ్లికన్‌ పాంథర్స్‌ నాయకుడు. షోమా సేన్‌ నాగపూర్‌ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ డిపార్ట్‌మెంట్‌, విమెన్స్‌ స్టడీస్‌ హెడ్‌. మహేష్‌ రౌత్‌ బి.డి. శర్మ స్థాపించిన భారత్‌ జన్‌ ఆందోళన్‌ నాయకుడు, ప్రధాన మంత్రి ఫెలోషిప్‌పై, ఆదివాసి సమస్యలపై టాటా ఇనిస్టిట్యూట్‌లో పరిశోధన చేసినవాడు. గడ్చిరోలి ప్రాంతానికి చెందినవాడు. వీళ్లందరిని మావోయిస్టు పార్టీ అర్బన్‌ కనెక్ట్‌ అనే పేరుతో పూణె కోర్టులో హాజరుపరిచి జూన్‌ 14వరకు పోలీసు కస్టడీకి తీసుకున్నారు.

ఇది చాలదన్నట్లు రోనా విల్సన్‌ ల్యాప్‌టాప్‌లో ప్రధానిని హత్య చేసేందుకు మావోయిస్టు పార్టీ పన్నిన కుట్రకు సంబంధించిన లేఖలు దొరికాయని తీవ్ర నేరారోపణలు చేశారు.ఈ లేఖల్లోని అసంబద్ధత ఎలాఉన్నా,మోడీ, ఫడ్నవీస్‌ల రాజ్యం.. డా.అంబేద్కర్‌ మనుమలు ప్రకాశ్‌ అంబేద్కర్‌, ఆనంద్‌ తేల్‌తుంబ్డేలతో పాటు జిగ్నేష్‌ మేవానీ మొదలుకొని ఎందరో దళితఉద్యమ నాయకులను, మేధావులను కూడా మావోయిస్టులుగా పేర్కొని వాళ్లపై నిషేధ రాజకీయాలు అమలు చేసి ప్రజా స్వామిక స్వరాన్ని వినిపించకుండా చేయదలుచుకున్నదనేది స్పష్టం. నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ప్రొ. జి.ఎన్‌. సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆయనను మావోయిస్టు పార్టీ అర్బన్‌ కనెక్ట్‌ అన్నారు.

ఆయనను, ఆయన సహచరులను ఆరుగురిని యావజ్జీవ శిక్ష వేసి జైలుకు పంపారు. ఇప్పుడు వాళ్ళ అరెస్టు నాటి నుంచి కేసు వాదించిన సురేంద్ర గాడ్లింగ్‌ను తీవ్ర నేరారోపణలతో జైలుకు పంపారు. వీళ్లంతా దశాబ్దాలతరబడి దళితులు, ఆదివాసులు, ముస్లింమైనారిటీలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థులు మొదలైన పీడిత ప్రజల, శ్రమజీవుల హక్కుల గురించి మాట్లాడుతున్నవారు. సాధారణ ప్రజాబాహుళ్యం నుంచి ఎదిగి, వాళ్ల గురించి గొంతు విప్పుతున్న మేధావులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులపై ఒక బీభత్స దాడికి రాజ్యంపూనుకున్నదనడానికి భీమా కోరేగావ్‌ కేసు ఒక తాజా ఉదాహరణ. న్యాయపోరాటాన్ని నేరచర్యగా చిత్రించే దుర్మార్గం. జనవరి నుంచి జూన్‌ దాకా ఈ దళిత- మావోయిస్టు సంబంధ నేరారోపణ వెనుక ఎంత ఫాసిస్టు కుట్ర ఉన్నదో ఊహించ వచ్చు. దీనిని సాగనిద్దామా.. ప్రతిఘటిద్దామా అని తేల్చుకోవలసిన తక్షణ సందర్భంలోకి దేశంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు రాజ్యంచే నెట్టబడ్డారు.
-వరవరరావు

Keywords : maoist, maharashtra, dalit, bhima koregav
(2018-09-14 01:40:14)



No. of visitors : 632

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

Search Engine

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
Punjab:Dalit bodies protest arrest of 5 human rights activists
Why are the Indian authorities afraid of a ʹhalf-Maoistʹ?
ʹప్రధాని హత్యకు కుట్రʹ కేసు ఓ కుట్ర..మేదావుల అరెస్టు దుర్మార్గం..మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె
more..


నయీ