ఇంటి ముందు బైక్ నడిపాడని.. దళిత యువకుడిని చితకబాదిన అగ్రకుల సర్పంచ్


ఇంటి ముందు బైక్ నడిపాడని.. దళిత యువకుడిని చితకబాదిన అగ్రకుల సర్పంచ్

మొన్న గుజరాత్‌లో గుర్రంపై ఊరేగాడని ఒక దళిత పెండ్లి కొడుకుపై దాడి చేశారు.. నిన్న పొలమెందుకు ఆక్రమించుకున్నావని అడిగినందుకు ఒక దళితుడిని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు.. ఈ రోజు ఇంటి ముందు బైక్‌పై వెళుతున్నాడని తట్టుకోలేకి ఒక అగ్రవర్ణ సర్పంచ్ ఏకంగా బైక్‌పై నుంచి తోసేసి దారుణంగా గాయపరిచాడు.

దళితుడంటే తమ చెప్పు చేతల్లో ఉంటూ.. ప్రతీ రోజు వొంగి దండాలు పెట్టాలనుకునే అగ్రకుల అహంకారులు ఇంకా ఈ దేశంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. ఘనంగా పెండ్లిళ్లు చేసుకోవద్దు... సొంతగా పంటలు పండించుకోవద్దు.. కనీసం తమ ముందు పాక్కుంటూ పోవాలి కాని మోటార్ సైకిల్‌పై పోవద్దనే దురహంకారం ఇంకా అగ్రవర్ణ మొదళ్లలో నాటుకొని పోయింది.

మధ్యప్రదేశ్‌లోని తికంఘర్‌‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నాలుగు రోజుల క్రితం అహిర్వార్ అనే యువకుడు.. తన గ్రామానికి చెందిన సర్పంచ్ ఇంటి ముందు నుంచి బైక్‌పై వెళ్లాడు. ఇది చూసి తట్టుకోలేని గ్రామ సర్పంచ్ హేమంత్ కుర్మీ, అతని సోదరులు మరి కొంత మంది కలసి అతడిని బైక్‌పై నుంచి పడేసి దారుణంగా దాడి చేశారు. మా ఇంటి ముందు నుంచే వెళ్లడానికి నీకెంత ధైర్యం అంటూ నానా దుర్భాషలాడారు. దీంతో దయారం అహిర్వార్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు.

అయితే గత కొన్నాళ్ల క్రితమే ఆ ఊరిలోని దళితులకు తన ఇంటి ముందు నుంచి బైక్ నడుపుకుంటూ వెళ్లడాన్ని అతడు నిషేధించాడని.. తన ఇంటి ముందు కేవలం బైక్‌ను తోసుకుంటూ మాత్రమే వెళ్లాలని అతడి హెచ్చరించినట్లు బాధితుడు పోలీసులకు చెప్పాడు. ఇంత జరిగినా ఆ దళితుడి పక్షం వహించడానికి పోలీసులు కూడా జంకుతుండటం ఈ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో చెప్పకనే చెబుతోంది.

Video Source : The Quint (https://www.youtube.com/watch?v=_cROlfM9QXw)

Keywords : మధ్యప్రదేశ్, తికంఘర్, దళితుడు, బైక్, సర్పంచ్, దాడి, dalit, man, beaten, madhyapradesh, tikanghar,
(2018-07-18 05:15:45)No. of visitors : 631

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


ఇంటి