దళితులకు కటింగ్ చేశాడని.. బార్బర్‌ను చితకబాదిన అగ్రకుల ఉన్మాదులు..!


దళితులకు కటింగ్ చేశాడని.. బార్బర్‌ను చితకబాదిన అగ్రకుల ఉన్మాదులు..!

దళితులకు

ప్రతీ రోజు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అగ్రకుల అహంకారంతో.. తామే గొప్ప అనే భావదారిద్ర్యంలో ఉండే వ్యక్తులు ఇలాంటి దాడులకు తెగబడుతూ దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేవలం దళితులనే కాదు.. వారితో స్నేహం చేసినా, వారికి సహాయం చేసినా చంపేస్తామంటూ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

మెహ్‌సానా జిల్లా సత్లాస్నా తాలూకా పరిధిలోని ఉమ్రేఛా గ్రామంలో జిగర్ అనే యువకుడు బార్బర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 1800 మంది జనాభా కలిగిన ఆ గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు దళితులు. వీరి ఎక్కువగా జిగర్‌కు చెందిన బార్బర్ షాపులోనే కటింగ్ చేయించుకునే వాళ్లు. అంతే కాకుండా ఖాళీ సమయాల్లో కూడా జిగర్ షాపు వద్ద యువకులు చేరి సరదాగా సాయంకాలాలు గడిపేవారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం అగ్రకులానికి చెందిన గోవింద్ చౌదరి, నాన్‌జీ చౌదరీ, రాజేష్ చౌదరి, వసంత్ చౌదరి అనే నలుగురు వ్యక్తులు జిగర్ వద్దకు వచ్చి.. దళితులకు కటింగ్ చేయవద్దని.. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆ అగ్రవర్ణ యువకుల మాటలను జిగర్ పట్టించుకోలేదు. ఎప్పట్లాగే దళితులకు కూడా కటింగ్ చేస్తున్నాడు. అయితే తాము హెచ్చరించినా దళితులతో స్నేహం మానుకోవట్లేదని ఆగ్రహించిన ఆ నలుగురు సోమవారం నాడు జిగర్‌ను తీవ్రంగా కొట్టారు. మా మాటలే లెక్క చేయవా అంటూ దూర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ ఘటనపై జిగర్ తల్లి జసీబెన్ భగవాన్‌దాస్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది.

జిగర్‌పై నలుగురు వ్యక్తులు దాడి చేసిన మాట వాస్తవమేనని సత్లాస్నా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రతిలాక్ మక్‌వానా దృవీకరించారు. దళిత యువకులు బార్బర్ షాపులోనికి వెళ్లడం చూసి ఈ నలుగురు జిగర్‌పై దాడి చేశారని ఎస్ఐ రతిలాల్ చెప్పారు. గతంలో ఆ నలుగురు హెచ్చరించిన మాట కూడా వాస్తవమే అన్నారు.

అయితే అగ్రకులానికి చెందిన వాళ్లు మాకు ఆ బార్బర్ షాపునకు వెళ్లొద్దని ఏనాడు హెచ్చరించలేదని దళితులు అంటున్నారు. కులాల మధ్య ఘర్షణలు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చోటు చేసుకోకపోయినా ఈ మధ్య మాత్రం అలాంటి ఘటనలు నమోదు అవుతున్నాయి. ఇదే ప్రాంతంలో 13 ఏండల్ దళిత బాలుడు అగ్రవర్ణాలు ధరించే సాంప్రదాయ చెప్పులు ధరించాడని ఐదుగురు వ్యక్తులు ఆ బాలుడిపై దాడి చేశారు.

ఇలాంటి ఘటనలు దళితుల సాంఘీక అభివృద్ది కూడా అగ్రకులాల వారికి కంటగింపుగా మారిందనే విషయం స్పష్టం అవుతోంది. అంతే కాకుండా దళితులతో ఇతర కులస్థులు కలవడం కూడా అగ్రవర్ణాల వారికి పెద్దగా నట్టడం లేదనే విషయం తెలుస్తోంది.

Source : The Indian Express (https://indianexpress.com/article/india/gujarat-barber-beaten-up-for-cutting-hair-of-dalits-four-booked-5233465/)

Keywords : dalit, barber, attacked, upper caste men, gujarat, umrecha, దళితులు, కటింగ్, బార్బర్, అగ్రకులస్థులు, గుజరాత్, ఉమ్రేఛా
(2018-07-17 14:17:44)No. of visitors : 347

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


దళితులకు