దళిత మహిళలను చితకబాదిన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్‌కు చెందిన అగ్రకులస్థులు

దళితులపై అగ్రకులస్థుల దాడులు ఏ రోజూ ఆగడం లేదు. అకారణంగా గొడవలు పెట్టుకొని దళితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజస్థాన్‌లోని మంగళ్‌పురలోని దళితులకు బుధవారం పీడకలగా మారింది. పొలం దగ్గర జరిగిన చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకొని మహిళలు అని చూడకుండా కర్రలతో చితకబాదారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కౌన్సిల్ పరిధిలోని మంగళ్‌పుర గ్రామంలో జాట్ కులస్థులతో పాటు ఇతర కులాలకు చెందిన వాళ్లు కూడా జీవిస్తున్నాయి. ఈ గ్రామంలోని జాట్ కుల యువకులు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, శివసేనలకు చెందిన వారే. ఆయా సంస్థల్లో ఈ యువకులంతా కార్యకర్తలుగా పని చేస్తున్నారు. అయితే ఇటీవల దళితులు పంటలు వేయడానికి నారుమడులు సిద్దం చేస్తున్నారు. అయితే మా పొలాల గట్లు తవ్వేస్తున్నారంటూ జాట్ కులస్థులు వీరిపై అభాండాలు వేశారు. మా పొలంలోకి ఎందుకు ప్రవేశించారంటూ హెచ్చరించారు. అయితే మేము మా పొలాల్లోనే వ్యవసాయం చేస్తున్నాము తప్ప.. మీ పొలాల్లోకి రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో జాట్ కులస్థుల కోపం మరింతగా పెరిగిపోయింది.

ఈ చిన్న విషయాన్ని ఆధారం చేసుకొని బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో శివరాం జాట్, శంకర్ లాల్ జాట్, గోపాల్ జాట్, రాధేశ్యామ్ జాట్, రాజూ జాట్ అనే యువకులు కర్రలు చేతబడ్డి దళితుల ఇండ్లలోనికి ప్రవేశించి దొరికిన వారిని దొరికి నట్లు చితకబాదారు. ఈ ఘటనలో గాయపడిన సైరా బాలీ అనే దళిత మహిళ వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. తాము ఎవరి పొలాలు దున్నలేదని.. కేవలం తమ వ్యవసాయ పొలంలోనే పంటకు సిద్దం చేస్తున్నామని సైరాబాలీ చెబుతోంది. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడింది పలు సంస్థలకు చెందిన అగ్రకుల యువకులు కావడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాని తమకు ఇక్కడ సరైన రక్షణ లేదని.. మా పొలాల్లో మేము పంట పండించు కోవడం కూడా నేరంగా చూస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Keywords : దళితులు, రాజస్థాన్, మంగళ్‌పూర్, సైరా బాలీ, జాట్ కులస్థులు, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, dalits, saira bali, mangalpur,rajastan, jat, vhp, bhajarang dal,
(2024-04-24 20:19:13)



No. of visitors : 2004

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


దళిత