ఆడపిల్లను అనాథను చేయాలనకుంటున్న మతోన్మాదం..!


ఆడపిల్లను అనాథను చేయాలనకుంటున్న మతోన్మాదం..!

ఆడపిల్లను

మతోన్మాదానికి మానవత్వం ఉండదు. మతోన్మాదానికి పేగు బంధం అవసరం లేదు. ఆడవారిని గౌరవించే దేశమంటూ సూక్తులు పలుకుతూ మరోవైపు ఆడపిల్లను అనాథగా మార్చడానికి కూడా వెనకాడని మనుషులున్న దేశం ఇది. ఆ మతోన్మాదం హిందుత్వం అయితేనేమి.. ముస్లిం మతం అయితే ఏంటి..? అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఒక ఆడపిల్ల బతుకును రోడ్డున పడేయడమే వారి లక్ష్యమా..? పూర్తి వివరాల్లోకి వెళితే..

పాపాలాల్, జయశ్రీ అనే దంపతులు హైదరాబాద్‌లో నివసించే వారు. పాపాలాల్ పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెండ్లయి ఎన్నేండ్లు గడిచినా ఈ దంపతులకు సంతానం లేదు. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే పాపాలాల్ తన పెయింటింగ్ పనికి వెళ్లాడు. ఆరోజు 25 అగస్టు 2007. కోఠిలోని నరసింహస్వామి దేవాలయానికి పెయింటింగ్ వేస్తున్నాడు. అదే సమయంలో సమీపంలోని గోకుల్ ఛాట్‌లో భారీ శబ్ధం వినిపించింది. వెంటనే అక్కడకు పరుగు పరుగున వెళ్లాడు. అటూ ఇటూ పరుగులు తీస్తున్న జనం మధ్యలో ఏడుస్తున్న మూడేళ్ల పాపను చూశాడు. చిన్నారిని ఎత్తుకొని బాలిక తల్లిదండ్రుల కోసం వెతికాడు. ఎవరూ కనిపించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిండ్రులెవరని బాలికను అడిగితే.. తల్లి పేరు ఫాతిమాబేగం అని, తండ్రి పేరు బషీర్‌ అని వచ్చీరాని మాటలతో చెప్పింది. పాపారావు బాలికను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు. వారేమో అనాథాశ్రమం నిర్వాహకులకు కబురు పెట్టారు. వారు వచ్చి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పాపాలాల్‌ను చేతిని ఆ చిన్నారి ఎంతకీ వదలిపెట్టలేదు. దీంతో కరిగి కన్నీరైన పాపాలాల్‌.. బాలికను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. చిన్నారిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికి పెళ్లయి ఆరేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో భార్య జయశ్రీ కూడా పాపాలాల్‌ ఆలోచనకు మద్దతు పలికింది. తమ ఇంటికి చిన్నారి రావడంతో ఆ దంపతులు ఎంతో సంతోషించారు. ఆ పాపకు అంజలి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచారు.

అసలు కథ ఇక్కడే మొదలైంది...
ఆ పాప దొరికినప్పుడు చెప్పిన వివరాల ప్రకారం ఆమె తల్లి దండ్రులు ముస్లింలు. అయినా సరే వీళ్లు అంజలి అని పేరు పెట్టి పిలుచుకున్నారు. అంజలి వచ్చాక ఆ దంపతులకు మరో ఆడపిల్ల జన్మించడంతో వీరి ఆనందం మరింత రెట్టింపైంది. అంజలిని స్థానిక పాఠశాలలో చేర్పించారు. అయితే అంజలికి బొట్టుపెట్టడం.. హిందూ పద్దతిలో పెంచడం స్థానిక ముస్లింలకు నచ్చలేదు. అంజలి బొట్టుపెట్టుకున్న ఫొటోలు స్థానికి మత పెద్దలకు చేరడంతో పాపాలాల్‌ను హెచ్చరించారు. ముస్లిం బాలికను హిందూ పద్దతిలో ఎందుకు పెంచుతావని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో ముస్లిం బాలికను హిందూ కుటుంబంలో ఎందుకు పెంచుతున్నావంటూ హిందూ వర్గీయుల నుంచి కూడా బెదిరింపులు ప్రారంభం అయ్యాయి. దీంతో పాపాలాల్ హెచ్ఆర్సీని మొరపెట్టుకున్నాడు. మానవత్వంతో ఒక ఆడపిల్లను సాకడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించాడు. పాపాలాల్ మానవత్వాన్ని, ఆదర్శాన్ని మెచ్చుకుంటూనే.. ఆ పాపకు ʹ
సోనియాʹ అని పేరు పెట్టింది హెచ్ఆర్సీ. ఇప్పుడు ఆ పాప 9వ తరగతి చదువుతోంది.

పాపాలాప్‌పై హత్యాయత్నం..
ఇటీవల పాపాలాల్‌పై హత్యాయత్నం జరిగింది. దీనిపై మీడియా పాపాలాల్‌ను ప్రశ్నించగా ఇలా చెప్పాడు. ʹʹపాపను పెంచుకుంటున్నందుకు 11ఏళ్ల నుంచి మాకు వేధింపులు తప్పడం లేదు. మా బస్తీలో నివసించే బాలు, భజరంగ్‌, యోగేశ్‌, చోటు, జీతు, రాహుల్‌, షంకీ జైశ్వాల్‌, మనోజ్‌జైశ్వాల్‌, సంజయ్‌ తదితరులు మా కూతురు చదువుకుంటున్న పాఠశాలకు వెళ్లి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమను అంగీకరించకుంటే చంపుతామని బెదిరిస్తున్నారు. విషయం తెలిసిన పాఠశాల యాజమాన్యం మా కూతురుకు టీసీ ఇచ్చి పంపించి వేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో మరో పాఠశాలలో చేర్పించాం. కుమార్తెను వేధిస్తున్న యువకులను నిలదీసినందుకు నాపై కక్ష పెంచుకొని దాడి చేశారు. దేవుడి దయవల్లే బతికాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని మానవత్వాన్ని బతికించాలిʹʹ అంటున్నాడు పాపలాల్.

మతం ఇదే చెబుతోందా..
మానవత్వం గురించి ప్రతీ రోజు ఎన్నో సూక్తులు, బోధనలు చేసే మత ప్రచారకులు, మత గురువులు ఈ విషయంపై ఎందుకు స్పందించట్లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక అనాథను మతాలకు అతీతంగా అనాథను కాకుండా పెంచినందుకు ఆ దంపతులు గత 11 ఏండ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు. చివరకు చావు వరకు వెళ్లి వచ్చిన పాపాలాల్‌కు ఇరు వర్గాల నుంచి బెదిరింపులే తప్ప భుజం తట్టి ఆదరించినవాడే లేకపోవడం శోచనీయం.

Keywords : papalal, sonia, anjali, gokul chat, bomb blasts, hrc, hindu, muslims, పాపాలాల్, అంజలి, సోనియా, గోకుల్ ఛాట్, బాంబు పేలుళ్లు, హెచ్ఆర్సీ, హిందూ, ముస్లిం
(2019-04-18 00:21:39)No. of visitors : 371

Suggested Posts


0 results

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
more..


ఆడపిల్లను