ప్రశ్నించడమే ఈ విద్యార్థిని చేసిన నేరమైంది..!


ప్రశ్నించడమే ఈ విద్యార్థిని చేసిన నేరమైంది..!

ప్రశ్నించడమే

ప్రశ్నించే గొంతుకను నొక్కేయడమే రాజ్యం చేసే పని. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాన్ని నిలదీయడమే అతి పెద్ద నేరం. ఉద్యమాలను నడిపించే వారిపై ద్రోహులుగా చిత్రీకరించి కటకటాల పాలు చేయడం ఏనాటి నుంచో ఉన్నదే. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ అదే జరుగుతోంది.

పదుల ప్రాణాలు కోల్పోయినా బెదరకుండా తమకు నష్టం చేస్తున్న స్టెరిలైట్ కంపెనీని మూయించిన ఘనత తమిళనాడు ప్రజల సొంతం. ఇప్పుడు అలాంటి ఉపద్రవమే మరొకటి పుట్టుకొని వచ్చింది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పేరుతో వేల ఎకరాల సాగు భూమి, ఇండ్లు, గ్రామాలను నాశనం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దపడ్డాయి. చెన్నై నుంచి సేలం వరకు నిర్మించి 277 కిలోమీటర్ల రహదారి కోసం ఆరు జిల్లాల్లోని ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి భూమిని నమ్మి బతుకుతున్న రైతులు తమ హక్కును కోల్పోబోతున్నారు. పచ్చని తూర్పు కనుమలు తమ అందాన్ని కోల్పోవడమే కాక సహజత్వానికి దూరం కాబోతున్నాయి. ఇన్ని నష్టాలు ఉన్నా ప్రభుత్వం ఆ ఎక్స్‌ప్రెస్ వే కోసం పనులు వేగవంతం చేయడంతో స్థానికులు ఉద్యమిస్తున్నారు.

చెన్నై-సేలం గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను వ్యతిరేకిస్తూ గత జనవరి నుంచి స్థానికులు, హక్కుల కార్యకర్తలు ఉద్యమం చేస్తున్నారు. అలాంటి వారిలో జర్నలిజం విద్యార్థిని, హక్కుల కార్యకర్త అయిన ఎస్. వలర్మతి ఒకరు. తన మాటలతో ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా.. స్థానికులు, రైతులకు ఈ ప్రాజెక్టు వలన కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వం పలు విమర్శలు కూడా చేశారు. గత జనవరిలో వడపలనిలోని ఆర్‌కేవీ స్టుడియో వద్ద ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు రాజద్రోహం కిందకు వస్తాయని.. కొన్ని వర్గాల మధ్య శతృత్వం పెంచేలా మాట్లాడిందంటూ చెన్నై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె రెచ్చగొట్టే ప్రసంగం చేసిందని సెక్షన్ 153 కింద తప్పుడు కేసును బనాయించారు. పోలీసులపై దాడి చేయాలని ఆమె ప్రజలకు చెప్పిందంటూ ఆ కేసులో పేర్కొన్నారు.

సేలం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే సంబంధించి జిల్లా అధికారులు ఇటీవల అచంకుట్టపట్టిలో నిర్వహించిన సమావేశాన్ని ప్రజలతో కలసి వలర్మతి బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అక్కడే అరెస్టు చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్లలో అరెస్టయిన రెండో వ్యక్తి వలర్మతి. అంతకు మునుపు పర్యవరణ కార్యకర్త పీయుష్ మనూష్ గత జూన్ 18న అరెస్టు చేశారు. అతడి మీద కూడా సెక్షన్ 153ఏ, 505(1)బీ కింద కేసులు నమోదు చేశారు. ఇతని అరెస్టుకు ముందు నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా అరెస్టైనా.. సేలం కోర్టులో బెయిల్ పొందాడు.

ఇలా అభివృద్ది పేరిట పర్యావరణానికి స్వయంగా ప్రభుత్వాలే తూట్లు పొడుస్తుంటే దానిని వ్యతిరేకించడం రాజద్రోహమంటూ కేసులు బనాయించడంపై స్థానికులే కాక పలు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలన నిరసిస్తూ ఇటీవల ఒక కుటుంబంలోని నలుగురు ఆత్మాహుతి చేసుకోవడానికి జిల్లా అధికారుల ముందు ప్రయత్నించారు. ఇలా ఎన్నో వైపులు నుంచి ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ప్రతిపక్షాలు కానీ నోరు మెదపకపోవడం అన్యాయం.

Keywords : valarmathi, chennai salem expressway, arrested, journalism student, activist, tamilnadu, వలర్మతి, చెన్నై సేలం ఎక్స్‌ప్రెస్ వే, అరెస్టు, జర్నలిజం స్టుడెంట్, కార్యకర్త, తమిళనాడు
(2019-04-19 11:04:07)No. of visitors : 742

Suggested Posts


0 results

Search Engine

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం
పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
అతడు ఓటేయలేదు..!
ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
more..


ప్రశ్నించడమే