గోరక్షణపై సుప్రిం హెచ్చరికలను ఇప్పటికైనా పట్టించుకునే వాళ్లు ఉంటారా..?


గోరక్షణపై సుప్రిం హెచ్చరికలను ఇప్పటికైనా పట్టించుకునే వాళ్లు ఉంటారా..?

గోరక్షణపై

గోవు.. గోమాత పేరిటా గత కొన్నాళ్లుగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన గోవును తీసుకెళ్తున్న వాళ్లను కూడా పట్టుకొని దారుణంగా చంపేసిన ఘటనలు దేశంలో చోటు చేసుకున్నాయి. గోవుకు అపారమైన ఘనతలు ఆపాదిస్తూ... గోవుకు హానితలపెట్టడమే ఘోరమైన నేరమంటూ ఎంతో మందిని అకారణంగా బలితీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గోరక్షణ పేరిట చేసిన చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎంతో మంది హిందూ మతోన్మాదులు దళితులు, ముస్లింలపై దాడులు చేశారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఈ చట్టంపై మరో సారి వివరణ ఇచ్చింది. గోరక్షణ పేరిట చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకోవద్దని మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరించింది. గోరక్షణతో హింసాత్మక ఘటనలు చెలరేగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక గతేడాది నవంబర్‌లోనే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ అ‍త్యున్నత న్యాయస్థానం.. ఈ హింసకు చెక్‌ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని అప్పట్లో ఆదేశించింది. ఓ సీనియర్‌ పోలీసు అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా తేల్చిచెప్పింది.

సుప్రీం ఈ చట్టానికి సంబంధించి గతంలోనే ఎన్నో హెచ్చరికలు చేసింది. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన చూపించలేదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాక.. పలు చోట్లు వర్గాలు, మతాల వారీగా విడిపోయి ఘర్షణలకు దిగారు. గోరక్షణ తీర్పుకు రాజస్తాన్, హర్యానా, యూపీ రాష్ట్రాలు కట్టుబడి లేవని.. గాంధీ మనుమడు తుషార్ గాంధీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇది లా అండ్‌ ఆర్డర్‌ విషయమని, ప్రతి రాష్ట్రం బాధ్యతగా తీసుకోవాలని హెచ్చరించింది. గోరక్షణ పేరుతో దాడులు చేయడం హింసను ప్రేరిపించడమేనని, ఇది క్రైమ్‌ అని పిటిషనర్‌ తరపు వాదనలు విన్న ధర్మాసనం.. ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దని, ఈ విషయంలో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

దేశ సర్వతోముఖ న్యాయస్థానం అందించిన తీర్పుపై ఇప్పటికీ సరైన చర్యలు చేపట్టని రాష్ట్రాలు అన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. కావాలనే దళిత, మైనార్టీ వర్గాలను ఈ వివాదంలోనికి లాగి ఘర్షణలు సృష్టిస్తున్నా.. ప్రభుత్వాలకు చీమకుట్టనట్లైనా లేదు. మరి ఇకనైనా సుప్రీం తీర్పును పాటిస్తాయో లేదు కాలమే నిర్ణయించాలి.

Keywords : గోరక్షణ, చట్టం, సుప్రీం కోర్టు, gourakshak, supreme court, verdict
(2019-03-21 23:15:22)No. of visitors : 332

Suggested Posts


0 results

Search Engine

The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
more..


గోరక్షణపై