ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత


ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత

నువ్వు సరిహద్దులో ఉన్న వ్యక్తివి. నీపైన ఎవరు దాడి చేస్తారో తెలియదు. యద్దం తప్ప వేరే ఆలోచనే లేని శతృవు బాంబులు వేస్తుంటే నువ్వేం చేస్తావు..?

పారిపోతావా..? దాక్కుంటావా..? ఎదురు దాడి చేస్తావా..? ఆత్మాహుతి అవుతావా..? ఇన్ని ప్రశ్నల్లో మీ సమాధానం ఏమిటో తెలియదు కాని.. ఇజ్రాయేల్ సైన్యం అత్యంత కౄరంగా చేస్తున్న దాడులను ఎదుర్కుంటూ.. ఆ దాడుల్లో గాయపడుతూ.. ఆ బాంబులకు ప్రాణాలు వదులుతున్న పాలస్తీనీయులు ఏం చేస్తున్నారో తెలుసా..? డ్యాన్స్ చేస్తున్నారు.

అవును నిజమే.. ఇజ్రాయేలీ సైనికుల్లోని షార్ప్ షూటర్స్ పేల్చే తూటాలు.. సైనికులు వేసే స్మోక్ బాంబులకు కూడా లెక్కచేయకుండా.. పాలస్తీనా యువత సరికొత్త శాంతి సందేశాన్ని పంపిస్తోంది.

ఇజ్రాయెల్‌లోని తమ సొంత గూటికి చేరే హక్కును పాలస్తీనీయన్లకు కల్పించాలనే డిమాండ్‌తో పాలస్తీనా ఆందోళనకారులు ʹగ్రేట్‌ మార్చ్‌ ఆఫ్‌ రిటర్న్‌ʹ పేరుతో గత మార్చి 30వ తేదీన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ నిరసనకు మూడు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ శుక్రవారం నాడు ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో ఈ ʹదబ్కేʹ నత్యాన్ని ప్రదర్శించారు. దబ్కే అనేది అరబ్బుల సంప్రదాయ నత్యం. వేడుకల సందర్భంగా, ముఖ్యంగా పెళ్లిళ్లలో అరబ్బులు ఈ నత్యం చేస్తారు. పాలస్తీనా ఆందోళనకారులు ఈ మూడు నెలల నిరసన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి హింసకు పాల్పడకుండా వినూత్నంగానే నిరసన తెలిపారు.

ఒకవైపు భాష్పవాయు గోళాలు పడుతున్నా.. బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. పాలస్తీనా యువత మాత్రం వారి నిరసనను దబ్కే నృత్యం చేసి వెళ్లడించారు. ఇప్పుడు ఈ నృత్యం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా చేరిపోయాయి. పాలస్తీనీయుల ధైర్య సాహసాలు.. శాంతి సహగమనాన్ని కొనియాడుతున్నారు.

Keywords : దబ్కే,డ్యాన్స్,పాలస్తీనా,ఇజ్రాయేల్, dhabke, dance, palastine, israyel,
(2019-05-16 00:01:09)No. of visitors : 574

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


ఇజ్రాయేలీ