include 'men';
?>
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
దేశంలోని ప్రతీ పౌరుడికి వాక్ స్వాతంత్ర్యం ఉంది. అది అతని ప్రాథమిక హక్కు. అలాగే భావప్రకటనా స్వేచ్చ కూడా ఉంది. అయితే ఇటీవల తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే.. ఇక్కడ రాజ్యాంగం అమలులో ఉందా లేదా అనే అనుమానం కలుగక మానదు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో కత్తి మహేష్ అనే సామాజిక కార్యకర్తను హైదరాబాద్ నగరం నుంచి ఏక పక్షంగా బహిష్కరించారు. కనీసం అతను అన్న వ్యాఖ్యలపై వివరణ కూడా తీసుకోలేదు. దీనిపై ఎంతో మంది ప్రజా సంఘ నాయకులు, హక్కుల కార్యకర్తలు, సామాన్య ప్రజానికం తమ అభిప్రాయాలు తెలిపారు. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ʹకత్తి మహేష్ నగర బహిష్కరణʹపై ఒక ఫేస్బుక్ పోస్టు పెట్టారు. ఈ చర్య ఎంత చట్ట వ్యతిరేకమో.. అక్రమమో ఆయన చెప్పారు. ఆ పోస్టు యధాతథంగా కింద చదువవచ్చు.
-------------------------------------
కత్తి మహేశ్‌పై హైదరాబాద్ నగర పోలీసుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య భావప్రకటనా స్వేచ్ఛ మీద అక్రమమైన దాడి. ఆయన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదించేవాళ్లు కూడ ఆయనకు ఆ అభిప్రాయాలు ప్రకటించే హక్కు ఉందని గుర్తించవలసి ఉంది. ఆ అభిప్రాయాలను వ్యతిరేకించేవారు అంతే తీవ్రంగా తమ భిన్నాభిప్రాయాలను ప్రకటించవచ్చు. ʹనువ్వు చెప్పే అభిప్రాయంతో నాకు ఏకీభావం లేదు. కాని నీ అభిప్రాయం చెప్పడానికి నీకున్న హక్కును కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తానుʹ అని వోల్టేర్ అన్న మాట ప్రజాస్వామ్య స్ఫూర్తికి చిహ్నం.
పైగా కత్తి మహేశ్ మీద ఇవాళ ఏ అభిప్రాయాల కోసం చర్య తీసుకున్నారో ఆ అభిప్రాయాలు చరిత్రలో వందలాది మంది రాశారు, మాట్లాడారు. డా. బి ఆర్ అంబేడ్కర్ వంటి వారి వ్యాఖ్యానాలు తెలుగులోకి వచ్చాయి. తెలుగులోనే త్రిపురనేని రామస్వామి చౌదరి, నార్ల వెంకటేశ్వర రావు, చలం, రంగనాయకమ్మ, డా. విజయభారతి, కత్తి పద్మారావు వంటి ఎందరో రాశారు. ఆ వరుసలో మహేశ్ మొదటి వారూ కాదు, చివరి వారూ కాదు. వాల్మీకి రామాయణంలోనే అటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి, వ్యాఖ్యానాలు చేయడానికి ఎన్నో ఆధారాలున్నాయి. రావణుడిని చంపిన తర్వాత, సీతతో రాముడు ఎంత అవమానకరంగా మాట్లాడాడో పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసిన వాల్మీకి రామాయణములోని యుద్ధకాండము, పే. 380-81లో చదివి రాముడి మీద ఏ అభిప్రాయం ఏర్పరచుకోవాలో మీకు మీరే నిర్ణయించుకోండి! అందువల్ల ఆ అభిప్రాయాల కోసం మహేశ్‌పై చర్య తీసుకుంటున్నామనడం అతార్కికం, అక్రమం.
అంతేకాదు, ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ ఆంటీ సోషల్ అండ్ హజార్డస్ ఆక్టివిటీస్ ఆక్ట్, 1980 ప్రకారం ఈ చర్య తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు గాని ఆ చట్ట నిబంధనలను కూడ సక్రమంగా ఉపయోగించకుండా చట్టవ్యతిరేక చర్యకు దిగారు. ఈ చట్టం మొదట ది ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ ఆంటీ సోషల్ అండ్ హజార్డస్ ఆక్టివిటీస్ ఆక్ట్, 1980 అని ఉనికిలోకి వచ్చింది. దాన్ని 2016లో జి ఒ ఎం ఎస్ నం 45 అనే ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా అనువర్తింపజేసుకుంది. దానిలో సెక్షన్ 3 ప్రకారం పోలీస్ కమిషనర్ గాని జిల్లా మెజిస్ట్రేట్ గాని ఒక వ్యక్తిని ʹగూండాʹగా ప్రకటించి ʹఆరునెలలు నగర బహిష్కారంʹ చేసే అధికారం ఉంది. కాని ఆ వ్యక్తిని పోలీసులు తలచుకున్న వెంటనే నగరం నుంచి బహిష్కరించి, బైటికి తీసుకువెళ్లి వదిలిపెట్టే హక్కు లేదు. ఆ వ్యక్తికి తన మీద పోలీసులు చేసిన లిఖితపూర్వక ఆరోపణలకు జవాబు (వివరణ – సంజాయిషీ) చెప్పుకునే సముచితమైన అవకాశం ఇవ్వాలి. ఆ వ్యక్తికి తన ఇష్టం వచ్చిన న్యాయవాదిని పెట్టుకుని తన వాదన వినిపించుకునే హక్కు ఉంది. తన తరఫున మరెవరినైనా విచారించమని, తనకు వ్యతిరేక ఆరోపణల పత్రాన్ని పరీక్షిస్తానని న్యాయవాది ద్వారా అడిగే హక్కు ఉంది. అలా ఆ చట్టంలోనే ఆ చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేయడానికి వీలు లేని నిబంధనలు ఉన్నాయి. కాని తెలంగాణ పోలీసులు ఆ నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కి, తామే ఆరోపకులు, తామే తీర్పరులు, తామే అమలు చేసేవారుగా మారిపోయారు. ఇదీ బంగారు తెలంగాణ!!
-ఎన్.వేణు గోపాల్
-ఎన్.వేణు గోపాల్
Source : https://www.facebook.com/nvenugopal.rao/posts/10155470925766700
Keywords : కత్తి మహేష్, నగర బహిష్కరణ, హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం, kathi mahesh, hyderabad police, telangana government
(2024-03-22 04:48:07)
No. of visitors : 2019
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..