తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !


తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !

తెల‍ంగాణ

కత్తి మహెష్ ను హైదరాబాద్ నుండి బహిష్కరించడం పట్ల మేధావులు నిరస‌న వ్యక్తం చేస్తున్నారు. దళితుడైనందుకే కత్తి మహేష్ పై బహిష్కరణ అస్త్రం ప్రయోగించారని వారు ఆరోపించారు. ఈ మేరకు 26 మంది ఉద్యమకారులు, మేధావులు, అధ్యాపకులు తెలంగాణ డీజీపీకి ఓ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం...

డిజిపి గారికి నమస్కారం,

మా మనవి ఏమనగా,

మీరు హైద్రాబాద్ నగర శాంతి భద్రతల దృష్ట్యా కత్తి మహేష్ ని నగర బహిష్కరణ చేస్తున్నారు. పరిపూర్ణానంద మూడు రోజుల నుండి నానా యాగీ చేస్తూ, ఒక మతం వకాల్తా పుచ్చుకుని, ఛానెల్ లో అది భక్తి ఛానెలో లేదా భయం ఛానెలో కానీ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రజల మనో భావాల దెబ్బ తింటున్న దృష్ట్యా ఈ చర్య తీసుకుంటున్నట్టు చెపుతున్నారు. ఈ సందర్భంగా శాంతి, సహనం, ప్రజల మానవ హక్కులు సమానత్వం కోరుకునే, పని చేసే కార్యకర్తలుగా మాకు వస్తున్న సందేహాలను నివృత్తి చేయగలరు.

1. కత్తి మహేష్ రామాయణం, రాముడిని కించపరచలేదు. ఆయన పదే పదే చెపుతూ వస్తున్నాడు తాను రామాయణం ఒక కథ అనుకుంటున్నాడు అని అందులో ఒక పాత్ర గురించి విశ్లేషణ చేసాడు. ఒక పదం వాడాడు . రామాయణం మరియు ఇతర పురాణ ,ఇతిహాసాల మిద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ మొదటి వాడు కాదు , చివరి వాడు కూడా కాదు. అయితే , అతను దళితుడు కాబట్టే అతని మీద ఇంతగా దాడి జరుగుతుంది అని మెం స్పష్టంగా చెప్పదలిచాం. మీరు అనుమతి ఇస్తే ఇంతకు ముందు ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించారో కూడా వివరాలతో సహా చెపుతాం. అయినా అతను తప్పు చేస్తే చట్ట పరంగా శిక్ష వేయండి కానీ బహిష్కరణ , వెలివేతలు మాకు మా అంటరాని తనం ఆధారంగానే చేస్తున్నట్టు మేము ఈ దేశ మూల వాసులం మరియు మాతో పని చేసే ఇతర కార్యకర్తలు భావిస్తున్నారు. మా మనోభావాలని చెప్పుకోవడానికి సేనలు, బాబాలు, చానెళ్లు , పార్టీలు లేకపోవడం వలన మీకు ఈ సోషల్ మీడియా ఆధారంగా చెప్పుకుంటున్నాం.

2. హైదరాబాద్ అందరిదీ అన్ని ప్రాంతాల వారిది అంటారు.సబ్ కా షహర్ హమారా అని ప్రసిద్ధి. కత్తి మహేష్ చిత్తూరు జిల్లా వాసి కాబట్టి అక్కడికి పంపిస్తున్నారు మరి హైదరాబాద్ వాడు అయితే ఎక్కడికి పోయి ఉండేవాడ సర్. దోపిడీలు, మర్దర్లు, రేప్ లు చేసిన వారు ఇంకా హాయిగా తిరుగుతున్నారు.

3. గత కొన్ని రోజులుగా నోటికి వచ్చిన అబద్దాలు చెపుతూ, నేను ఎస్టీ అని లేదా ఎస్సి అని ఒక ʹపదంʹ అన్నందుకు అందరిని రెచ్చగొడుతున్న పరిపూర్ణానంద ఎక్కడి వాడు? అతడికి బహిష్కరణ లేదా ? అసలు బాబాలు, సన్యాసిలు రాజకీయంగా, హింసాపురితంగా మాట్లాడొచ్చా సర్.

4. ఒక ఛానెల్ పదే పదే కత్తి మహేష్ వ్యాఖ్యలు చూపించిందని చర్యలు తీసుకుంటున్నారు మరి భక్తి పేరుతో ,ఒక ఛానెల్ ని అడ్డుగా పెట్టుకుని నిత్యం ఎవరి మీదనో ఒకరి మీద ద్వేషం వెళ్లకక్కుతూ, ఒకప్పుడు నా మీద అసత్య ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియా లో హిందూత్వ వాదులు దారుణంగా దాడి చేయడానికి, భావ ప్రకటన స్వేచ్ఛ ని మాట్లాడుతున్న అనేక కార్యకర్తల మీద , ఇప్పుడు కత్తి మహేష్ మీద దాడికి ఉసిగొల్పుతున్న ఛానెల్ ని ఎందుకు బాన్ చేయరు? భక్తి ఛానెల్ అంటే భక్తిని కదా ప్రసారాలు చేయాలి. దేవుడు ఉంటే శాంతిని కదా కాంక్షించాలి. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే ప్రకటనలు, కార్యక్రమాలు చేయొచ్చా? వాటి పరిధి ఏంటి?

5. ఈ నెల నాలుగో తారీఖున వరంగల్ కాసి బుగ్గలో భద్రకాళి ఫైర్ వర్క్స్ అండ్ బాంబుల తయారీ కంపెనీలో 11మంది పేద దళిత ,బిసి కులాల బిడ్డలు, రోజు వారి కూలీలు ఒక ఆరెస్సెస్ కుమార్ అను వ్యక్తి దన దాహానికి బలి అయ్యారు. ఒక బాంబుల తయారీ ,జనావాసాల మధ్య నడపడానికి అనుమతులు ఇచ్చిన అధికారులు, వ్యవస్థ మీద చర్యలు తీసుకున్నారా? కనీసం ఇళ్లు కూలిపోయిన వారికి ఏమైనా సహాయం కూడా చేయలేదు. మా రక్తం మారుగుతోంది సార్. మాకు తీవ్రంగా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి.

6. ఎక్కడ బడితే అక్కడ పరిమితులు లేకుండా కోతి బొమ్మలు పెడుతూ, కాషాయ జెండాలు పట్టుకుని గ్రామ గ్రామాన శాఖ లు, మతోన్మాదం ప్రేరేపించే సంస్థలు నడుపుతున్న కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చాయా సార్. దళితులు, చర్చి ల మీద దాడులు, బీఫ్ తింటున్నారని ముస్లింల మిద దాడులు, పసిపిల్లల ని కూడా వదలకుండా పిల్లలు , స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు చూడలేక న్యాయం కోసం పోయి అడిగిన వారి మీద కూడా కేసులు పెడుతున్నారు సార్. ఎక్కడ చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ఇక్కడ కోర్టులు,పోలీస్ స్టేషన్ లు ఉన్నా కూడా కొన్ని సంస్థలు, వ్యక్తులు, పార్టీల మనోభావాలే మెజారిటీ ప్రజల మనోభావాలుగా భావించడం ఈ దేశ మెజారిటీ ప్రజలు అయిన ఎస్టీ,బిసి,మైనారిటీల,మహిళల మనోభావాలు ఎవరికి పట్టకపోవడం అసలు మనుషులుగా గుర్తించక పోవడం ,మాకు ఏ సంస్థ భరోసా ఇవ్వక పోవడం ఒక వాస్తవం సార్.

మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడిది సార్, ఏ స్వేచ్చా లేకుండా తర తరాలుగా వెలివాడల్లోనే బ్రతుకుతున్నాం, ఈ రోజు మీరు కొత్తగా (అ)పరిపూర్ణ ఆనందంʹ కోసంʹ వెలివేసేది ఏమీలేదు. బలవంతంగా ఒక మతం మా మీద రుద్ది కులం పేరుతో ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ,రాజకీయంగా అణచివేస్తూ ,మమ్ములని చంపుతూ, హింసిస్తూ, మా మీద అత్యాచారాలను చేస్తున్న మతం పై మాకు ప్రేమ ఉండాలని మీరు బలవంత పెట్టడమే మాకు శిక్ష, మనువాదం. భక్తి పేరుతో, బాబాల పేరుతో, భావజాలం పేరుతో నిత్యం మా మీద దాడి , ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న వారిని బహిష్కరించండి ప్లీస్..అందరికి పోలీసు వ్యవస్థను అందుబాటులో ఉంచండి.

లేఖ మీద సంతకం చేసిన వారు

-డా.సూరేపల్లి సుజాత, ప్రొఫెసర్ రమా మేల్కోటే, డాక్టర్ కె లలిత, ఉ. సాంబశివరావు, గుంటూరు లక్ష్మినరసయ్య, డా. పసునూరి రవీందర్,ప్రొ. పద్మజా షా,దేవి, సజయ, సంధ్య, డా. సునీత, వసుధా నాగరాజ్, సుమిత్రా, సత్యవతి, విజయా భండారు, గోగు శ్యామల,డేవిడ్, స్కైలాబ్ బాబు, హిమబిందు, తేజస్విని, ఝాన్సి, ప్రొ. వీణా శత్రుఘ్న, ప్రొ.సుశీ థారు.

Keywords : katti mahesh, paripoornananda, telagana, dgp
(2018-09-17 10:16:50)



No. of visitors : 1222

Suggested Posts


0 results

Search Engine

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
Punjab:Dalit bodies protest arrest of 5 human rights activists
Why are the Indian authorities afraid of a ʹhalf-Maoistʹ?
ʹప్రధాని హత్యకు కుట్రʹ కేసు ఓ కుట్ర..మేదావుల అరెస్టు దుర్మార్గం..మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె
more..


తెల‍ంగాణ