సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !

సీపీఎం

మతం అనేది ఒక మత్తు మందు అని కార్ల్ మార్క్స్ అన్నారు. కాని ఆయన సిద్దాంతాలతో పుట్టిన పార్టీ సీపీఎం మాత్రం మతమే మనకు రక్ష అంటోంది. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీ తదుపరి ఎన్నికల్లో గెలవడానికి మతన్నే మార్గంగా ఎంచుకుంది. ఒక వైపు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని గగ్గోలు పెడుతున్న ఈ లెఫ్ట్ పార్టీ .. ఇప్పుడు హిందూ మతాన్ని తమ భుజాలపైకి ఎత్తుకోవడం సాక్ష్యాత్తూ కమ్యూనిస్టులు కూడా జీర్ణం చేసుకోలేక పోతున్నారు.

ఇప్పటికే శ్రీకృష్ణ జయంతిని విజయవంతంగా నిర్వహించిన సీపీఎం పార్టీ ఇక ఇప్పుడు రామాయణాన్ని తమ భుజస్కంధాలపై ఎత్తుకుంది. కేరళలోని మలయాళం క్యాలెండర్ ప్రకారం కర్కిదక్కమ్ నెలను రాయాయణానికి అంకితం ఇచ్చి భక్తి శ్రద్దలతో పాటిస్తుంటారు. ఇప్పుడు సీపీఎం పార్టీ జులై 17 నుంచి అగస్టు 16 మధ్య వచ్చే ఈ నెలలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. మలయాళంలో చివరి నెలైన కర్కిదక్కమ్‌ నాటికి రుతుపవనాలు చివరి దశకు చేరకుంటాయి. అంతే కాకుండా ప్రజల రోగనిరోదక శక్తి ఈ కాలంలో తక్కువగా ఉంటుందని భావిస్తారు. అందుకే సాయంత్రం వేళల్లో ఇంట్లో గాని గుడిలో కాని రామాయణ పారాయణం చేస్తుంటారు. ఇదే నెలలో ప్రజలు ఆయుర్వేద చికిత్స తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల తమ శరీరం, మనస్సు నూతనోత్తేజం పొందుతాయని భావిస్తారు.

అయితే ఇప్పుడు ఇదే కార్యక్రమాలను సీపీఎం పార్టీ కూడా ప్రారంభించింది. ఈ నెలలో పార్టీ శ్రేణులకు సంస్కృత పండితులు, గురువులతో రామాయణం విశిష్టతను బోధించాలని నిర్ణయించింది. ఈ నెల 25న రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించబోతోంది.

ఇలా రామాయణాన్ని తమకు ఓన్ చేసుకొని రాష్ట్రంలోని హిందూ మెజార్టీ కమ్యూనిటీలో తమకు ఒక స్థానం ఉండేలా చూసుకోవాలని, తద్వారా బీజేపీని ప్రజలకు దూరం చేయవచ్చని సీపీఎం భావిస్తోంది. ఈ కార్యక్రమాలన్నింటినీ సంస్కృత సంఘం అనే సంస్థ సీపీఎం పార్టీ తరపున నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వి. సదాశివన్‌కు ఈ కార్యక్రమాలన్నింటినీ అప్పగించారు.

Keywords : ramayana, kerala, cpm, government, celebrations, రామాయణం, కేరళ, సీపీఎం, గవర్నమెంట్, సెలబ్రేషన్స్, కార్యక్రమాలు
(2024-03-12 13:14:30)



No. of visitors : 1483

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సీపీఎం