ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ


ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ

ʹమతం

పత్రికా ప్రకటన
మతం, మనోభావాల పేరుతో హింసను రెచ్చగొడుతున్న బిజెపీ శక్తుల వైఖరిని ఖండిస్తున్నాం.
.. ప్రజాసంఘాలు, ప్రొద్దుటూరు

దేశంలో మతం, మనోభావాల పేరుతో రోజురోజుకి దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని హేతువాది బాబు గోగినేని. కత్తిమహేష్ లపై అక్రమ కేసులు బనాయించారు. కత్తి మహేష్ ని శాంతి భద్రతల పేరుతో నగర బహిష్కరణ చేశారు. ఈబ్రాహ్మణీయ వెలివేత చర్యపై దళితులు ఆగ్రహించడంతో వివాదానికి కారకుడైన పరిపూర్ణానంద ను కూడా నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. వెలివేతలు బ్రహ్మణీయ ఆదిపత్య సంస్కృతికి, రాజ్య నిరంకుశత్వానికి ప్రతీకలు. ఇలాంటి పరిష్కారాన్ని చూపడం ద్వారా తెలంగాణా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.
బాబు గోగినేని, కత్తి మహేష్ లు రాముడనే ఒక పురాణ పాత్రను విమర్శించారు. అంబేద్కర్ దగ్గర నుండి ఎంతో మంది సామాజిక కార్యకర్తలు, రచయితలు, హేతువాదులు రామాయణం గురించి విమర్శనాత్మకంగా ఎంతో రాశారు. ఇటీవలి కాలంలోనే ఇవి వివాదాలుగా మారుతున్నాయి కానీ భారతదేశ చరిత్రలో సనాతన ధర్మం ఎంత ప్రాచీనమైనదో, హేతువాదం కూడా అంతే ప్రాచీనమైనదే. వాదన, చర్చ, భావాల సంఘర్షణ ద్వారానే జ్ఞానం, సామాజిక చైతన్యం వికసిస్తుంది. ప్రజల్ని అమాయకత్వంలో ముంచి తమ పబ్బం గడుపుకోవాలను కొన్ని స్వార్థపరశక్తులు మాత్రమే వివాదాలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నాయి. మనోబావాలు ఎవరి మనసుకు తగినట్లుగా వారికి ఉంటాయి. అందరి మనోభావాలు ఒకటి కాదు. మనోభావాల చర్చ బిజేపి శక్తులు అధికారంలోకి వచ్చాకనే జరుగుతోంది. ప్రభుత్వ అసమర్థతను, ప్రజలపై విధించే కోత్త కొత్త పన్నుల భారాన్ని, ధరల పెంపును అవినీతిని, స్త్రీలపై దళితులపై హింసను వీటన్నిటినుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి స్వాముల పేరుతో, హిందూ సంస్థల పేరుతో తమ బలగాలను జనం మీదికి ఎగదోస్తున్నారు. వీళ్ళకు వత్తాసు పలుకుతూ పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రలో భాగం. ఈవిధంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వ పోకడల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కత్తి మహేష్, బాబూ గోగినేనిలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.

-వరలక్ష్మి (విరసం),
పల్లవోలు రమణ (నాస్తిక సమాజం),
తవ్వా సురేష్ (జనవిజ్ఞాన వేదిక),
ఆరవేటి చంద్రశేఖర్ (జనవిజ్ఞాన వేదిక),
పద్మ , సర్తాజ్ (చైతన్య మహిళా సంఘం),
భాస్కర్ (రాయలసీమ విద్యార్థి వేదిక)

Keywords : katti mahesh, babu gogineni, religion, hindutva
(2019-06-15 17:58:59)



No. of visitors : 749

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
more..


ʹమతం