ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్


ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్

ఒక

అతనో ఎమ్మెల్యే.. అందులో దేశంలోనే అత్యంత సున్నిత రాష్ట్రమైన కశ్మీర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే. కాని అతని ప్రవర్తన ఇప్పుడు మీడియాలో చర్చనియాంశం అయ్యింది.

ఒకవైపు రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంటే.. అదే రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. అంతే కాదు.. ఆ యువతిని మాయ మాటలతో లొంగదీసుకొని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఆ బీజేపీ ఎమ్మెల్యే అరాచకాలను చూడలేక అతని భార్య మీడియా ముందుకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కశ్మీర్ రాష్ట్రంలోని ఆర్‌ఎస్‌ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్‌.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్‌ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని ఆరోపిస్తూ మోనికా శుక్రవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ʹనా భర్త మంచోడు కాదు. గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అఫైర్‌ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయా. ఇప్పుడు ఈ ఆధారాలతో(ఫోటోలు) మీ ముందుకు వచ్చా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండిʹ అని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

అయితే ఇప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షడు అమితో షా కాని.. కశ్మీర్ రాష్ట్ర బీజేపీ ప్రతినిధులు కాని స్పందించ లేదు. కాని గగన్ ఈ విషయంపై స్పందిస్తూ.. ʹమా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమె విడాకులు కోరింది. పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా వద్దని వారించా. ప్రస్తుతం కౌన్సిలింగ్‌ జరుగుతోంది. అందుకే ఈ ఆరోపణలుʹ అని చెప్పాడు.

ఇదిలా ఉండగా గగన్ మామ వేరే రకంగా స్పందించాడు. మాజీ సైనిక అధికారి అయిన ఆయన మాట్లాడుతూ.. తన కూతురిని గగన్ అనే వ్యక్తి అపహరించాడని పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మోనికా శర్మను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. తన భర్త మంచి వ్యక్తి అని ఆమె మీడియా ముందు చెప్పింది.

అయితే ఇంత జరిగినా ఆ బాధితురాలికి బీజేపీ నాయకులు ఎవ్వరూ అండగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మోడీ, అమిత్ షా లకు పిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆ ఎమ్మెల్యే మరింతగా బాధితురాలిపై ఒత్తిడి తెస్తుండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

Keywords : kashmir, mla, gagan, కశ్మీర్, గగన్, ఎమ్మెల్యే
(2018-12-14 12:42:55)No. of visitors : 350

Suggested Posts


0 results

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


ఒక