చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం


చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం

చిన్న

మన సమాజం రోజురోజుకు ముందుకు నడుస్తోందో వెనకకు వెళ్తుందో అర్దం కానిపరిస్థితి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని, అత్యద్భుతమైన రాజ్యంగం మనదని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ధోరణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మతం పేరుతో, కులంపేరుతో మధ్య యుగాలనాటి ఆటవిక‌ సంస్కృతికి ప్రాణం పోస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఉత్తర భారతంలో కాప్ పంచాయితీల అరాచకాలకు అంతూ పొంతూ ఉండటం లేదు.
రాజస్థాన్ లో ఓ చిన్నారి చేసిన చిన్న పొరపాటుకు ఓ కాప్ పంచాయితీ అమానుషమైన శిక్ష వేసింది.

రాజస్తాన్ లోని బండి జిల్లా హరిపుర గ్రామంలో ఓ ఐదేండ్ల బాలిక రెగర్‌ కమ్యూనిటీకి చెందిన వారు ʹపవిత్రంగా భావించేʹ టైటిహరి అనే పక్షి గుడ్డును పొరపాటున పగులకొట్టింది. ఈ పక్షి గుడ్డును పగులకొడితే.. వర్షాలు పడవని వారి నమ్మకమట. దాంతో ఆ బాలికపై ఆగ్రహించిన కాప్ పంచాయితీ గ్రామంలో పంచాయితీ నిర్వహించి ఆ చిన్నారి బాలికకు బహిష్కరణ శిక్ష విధించారు. ఆ చిన్నారి తన ఇంట్లోకి కూడా వెళ్ళ కూడదు. బయటనే ఉండాలి. కుటుంబసభ్యులు సహా గ్రామస్తులెవరు ఆమెను ముట్టుకోకూడదంటూ ఆ చిన్నారిపై పంచాయతీ దారుణ తీర్పునిచ్చింది.
ఈ నెల 2న పంచాయతీ తీర్పునివ్వగా.. అప్పటి నుంచీ ఆమె ఇంటికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. ఆ పాప ఉన్న ప్రదేశానికి వెళ్ళి.. దూరంగా నంచొని ఒక పాత్రల్లో భోజనం ఇచ్చి రావాలి. గత 11 రోజులుగా అయిదేండ్ల ఆ చిన్నారిని సమాజానికి, తన కుటుంబానికి దూరంగా ఉంచారు.
ఆలస్యంగా విషయం తెలిసి గ్రామానికి వచ్చిన పోలీసులు 10 మంది కాప్ పంచాయితీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. బాలికను ఇంట్లోకి పంపించారు.

Keywords : rajastan, haripura, bandi district, girl, kap panchayat
(2019-03-15 02:21:42)No. of visitors : 282

Suggested Posts


ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులు

దేశమంతా అసహ్యించుకునే ఓ హంతకుడిని వాళ్ళు దేవుడిలాగా రథంపై ఊరేగించారు. లవ్ జీహాదీ పేరుతో ఓ అమాయకుడిని హత్య చేసి జైల్లో ఉన్న వ్యక్తికి జై జైలు కొడుతూ అతనే మా రాముడంటూ ఊరంతా ఊరేగించారు....

నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !

పసివాళ్ళన్న జాలి...పిల్లలతో పని చేయించకూడదన్న ఇంగిత ఙానం లేని దుర్మార్గులు.... పసివాళ్ళపై అమానుషంగా ప్రవర్తించారు. బట్టలిప్పేసి కొట్టడమే కాకుండా రెండు కిలోమిటర్ల దూరం నగ్నంగా నడిపించారు. పైగా ఆ మొత్తం సంఘటనను వీడియో తీసి షాడిస్టుల్లా ప్రవర్తించారు

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


చిన్న