రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. పల్లె పల్లెనా మోహరించిన పోలీసు బలగాలు

రేపటి

ఈ దేశ విముక్తి కోసం తమ ప్రాణాలను ధారబోసిన అమరులను సంస్మరించుకుంటూ రేపటి(జూలై 28) నుండి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల సంస్మరణ వారాన్ని ఈ దేశ పీడిత ప్రజానీకం నిర్వహించుకుంటోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ వారం రోజులపాటు బహిరంగ సభలు, సమావేశాలు జరుగుతాయి. భారత విప్లవ వేగుచుక్క చారుమజుందార్ అమరుడైన జూలై 28 వ తేదీ నుండి ఆగస్టు3 వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారాన్ని జరపాలని మావోయిస్టు పార్టీ ఈ మేరకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి , విశాఖపట్నం, విజయనగరం, ఒరిస్సాలోని మల్కన్ గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర లోని గడ్చిరోలి, చత్తీస్ గడ్ లోని, బస్తర్, భీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలలో, బీహార్, జార్ఖండ్ లలో మవోయిస్టు పోస్టర్లు, కరపత్రాలు గోడలకు అంటించింది. అనేక చోట్ల బ్యానర్లను కట్టారు. ʹʹనరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండి దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చడానికి, ప్రజలను మత ప్రాతిపదికన చీల్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. హిందూ ఫాసిస్టు పాలనను కొనసాగిస్తూ దేస సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాదానికి తాకట్టు పెడుతున్నది...ʹʹ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ తన కరపత్రంలో పేర్కొన్నది.
ʹʹనీళ్ళు , నిధులు, ఉద్యోగాలు, భూముల కోసం ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణాలో నేడు కనీస ప్రజాస్వామిక హక్కులు కూడా కరువయ్యాయి...ʹʹ అని మావోయిస్టు పార్టీ మండిపడింది.
అందుబాటులో అన్ని సాధనాలను ఉపయోగించుకొని గ్రామాల్లో, బస్తీల్లో అమరుల సంస్మరణ వారాన్ని విజయవంత చేయాలని ఆ పార్టీ ప్రజలకు పిలునిచ్చింది.

మరో వైపు ప్రజలు తమ కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకుంటూ నిర్వహించే సభలను సమావేశాలను భగ్నం చేయడానికి పాలకులు అన్ని రకాల దుర్మార్గ ప్రయత్నాలు ప్రారంభించారు. ఒడిశా, విశాఖ, విజయనగరం జిల్లాల పోలీసు యంత్రాంగం వ్యూహత్మకంగానే వ్యవహ రిస్తోంది. విశాఖ ఏజెన్సీలోని అన్ని పోలీసుస్టే షన్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విశాఖ ఏజెన్సీలోని మారుమూల,ఒడిశా సరిహద్దు, క టాఫ్ ఏరియాలో గాలింపు చర్యలకు పోలీసు యంత్రాంగం సిద్ధమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అన్ని పోలీసు స్టేషన్లలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. ఒడిశాలోని అవుట్ పోస్టులలోను ప్రత్యేక పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. బలిమెల రిజర్వాయర్లో లాంచీల ప్రయాణాలపైన పోలీసు బలగాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. విశాఖ ఏజెన్సీకి సంబంధించి కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి,జి.మాడుగు ల, పెదబయలు, ముంచంగిపుట్ మండలాల్లోని మారుమూల గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందడంతో ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలోని పోలీసు బృందాలతో పాటు జర్రెల, రాళ్లగెడ్డ, రూడకోట అవుట్ పోస్టులకు చెందిన ప్రత్యేక పోలీసు బల గాలు కూడా అప్రమత్తమయ్యాయి.
అంతే కాక తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి , విశాఖపట్నం, విజయనగరం, ఒరిస్సాలోని మల్కన్ గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర లోని గడ్చిరోలి, చత్తీస్ గడ్ లోని, బస్తర్, భీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలలో, బీహార్, జార్ఖండ్ లలో పోలీసులు హై అలర్ట్ ను ప్రకటించారు.

పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా పల్లె పల్లెనా అమరుల సంస్మరణ సభలు వుజయవంత చేయడానికి పోరాట ప్రజానీకం సిద్దమవుతున్నారు.

Keywords : maoists , martyrs, telangana, andhrapradesh, maharashtra, chattisgarh, bihar, jarkhand, police
(2024-03-09 13:11:45)



No. of visitors : 2543

Suggested Posts


ఎర్ర బారిన మన్యం... ర్యాలీలు, సభలతో అమరులకు నివాళులు అర్పించిన జనం

భారత విప్లవ నేత చారు మజుందార్ వర్ధంతి రోజైన జూలై 28 నుండి ఆగస్ట్ 3వ తేదీవరకు సీపీఐ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ వారాన్ని ప్రజలు విప్లవోత్సాహంతో జరుపుకుంటున్నారు.

Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri

Despite of tight security by security forces in the tribal-dominated region, the rebels successfully organised camps at a few places today to observe the Maoists martyrsʹ week.

అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు

విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని అటవీ ప్రాంతంలో బుధ వారం అమరవీరుల వారోత్స వాలను వేలాదిమంది ఆదివాసులు భారీ ఎత్తున జరుపుకున్నారు. ఎత్తయిన కొండపై నిర్మించిన 30 అడుగుల అమరల‌ స్తూపాన్ని ఈ సందర్భంగా సీపీఐ మావో యిస్టు పార్టీ నాయకులు ఆవిష్కరించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రేపటి