అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు

అమరుల

విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని అటవీ ప్రాంతంలో బుధ వారం అమరవీరుల వారోత్స వాలను వేలాదిమంది ఆదివాసులు భారీ ఎత్తున జరుపుకున్నారు. ఎత్తయిన కొండపై నిర్మించిన 30 అడుగుల అమరల‌ స్తూపాన్ని ఈ సందర్భంగా సీపీఐ మావో యిస్టు పార్టీ నాయకులు ఆవిష్కరించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం భారత విప్లవ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరులకు, రెండేళ్ల క్రితం రామ్గూడ ఎన్ కౌంటర్లో మృతిచెందిన 33 మంది అమరులకు ఈ స్తూపం వద్ద నివాళులర్పిం చారు. వారి త్యాగాలను కీర్తిస్తూ కళాకారులు పాటలు పాడారు. అమరవీరులకు జోహర్లంటూ పెద్ద ఎత్తున | నినాదాలు చేశారు. రామ్గుడ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు నాయకులు శాంతి, ప్రసాద్, దయా, కిరణ్, గంగాధరకు అమరవీరుల స్తూపాన్ని అంకితమిస్తున్నామని మావోయిస్టు నేతలు ప్రకటించారు. ఈ వారోత్సవాల్ని భగ్నం చేసేందుకు పోలీసులు అడవిని, పల్లె పల్లెను జల్లెడ పడుతుండగానే.. ప్రజలు తమ నాయకులను స్మరించుకుంటూ భారీ బహిరంగ సభ విజయ వంతంగా నిర్వహించడం విశేషం. వేలాది మంది ఆదివాసులు హాజరయిన ఈ బహిరంగసభలో మావోయిస్టు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు, బహుళ జాతి కంపెనీలు కుమ్మక్కై దేశవ్యాప్తంగా ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నాలను మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాలతో అడ్డుకుంటుందని హెచ్చరించా రు. పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్బంధ పరిస్థితులు సృష్టించినప్పటికీ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నా మని పేర్కొన్నారు. గిరిజనుల ఖనిజ సంపదను దోచుకోవడం పాలకుల తరం కాదని, ప్రజలతో కలసి గిరిజన సంపదను కాపాడుకునేందుకు మావోయిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ప్రకటించారు. సమసమాజ స్తాపన కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయ్యేదాకా విప్లవ పోరాటం ఆగబోదని మావోయిస్టులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆప్రాంతమంతా ఎర్రజండాలతో, బ్యానర్లతో అడవి ఎర్రబారింది.

Keywords : maoists, martyrs, aob, vsp, meeting, adivasi
(2024-04-24 20:09:04)



No. of visitors : 1939

Suggested Posts


ఎర్ర బారిన మన్యం... ర్యాలీలు, సభలతో అమరులకు నివాళులు అర్పించిన జనం

భారత విప్లవ నేత చారు మజుందార్ వర్ధంతి రోజైన జూలై 28 నుండి ఆగస్ట్ 3వ తేదీవరకు సీపీఐ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ వారాన్ని ప్రజలు విప్లవోత్సాహంతో జరుపుకుంటున్నారు.

రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. పల్లె పల్లెనా మోహరించిన పోలీసు బలగాలు

ఈ దేశ విముక్తి కోసం తమ ప్రాణాలను ధారబోసిన అమరులను సంస్మరించుకుంటూ రేపటి(జూలై 28) నుండి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల సంస్మరణ వారాన్ని ఈ దేశ పీడిత ప్రజానీకం నిర్వహించుకుంటోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ వారం రోజులపాటు బహిరంగ సభలు, సమావేశాలు జరుగుతాయి.

Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri

Despite of tight security by security forces in the tribal-dominated region, the rebels successfully organised camps at a few places today to observe the Maoists martyrsʹ week.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అమరుల