పూణే పోలీసుల అరాచకం.. హైదరాబాద్‌లో వరవరరావు అక్రమ అరెస్టు.. జర్నలిస్టు ఇండ్లపై దాడులు


పూణే పోలీసుల అరాచకం.. హైదరాబాద్‌లో వరవరరావు అక్రమ అరెస్టు.. జర్నలిస్టు ఇండ్లపై దాడులు

పూణే


ప్రజల తరపున మాట్లాడే గొంతులను రాజ్యం నొక్కేయడం ఈ రోజు కొత్తేమీ కాదు. పోలీసులను చేతిలో పెట్టుకొని.. లేని కుట్రను సృష్టించి గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులు హైదరాబాద్ వరకు వచ్చాయి. విరసం వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత వరవరరావును ప్రధాని మోడీకి మావోయిస్టులు చేస్తున్న కుట్రకు సహకరించాడనే నెపంతో మంగళవారం అరెస్టు చేశారు. ఉదయం 6 గంటల నుంచి వరవరరావు అరెస్టు వరకు పూణే పోలీసులు అత్యంత అన్యాయంగా, చట్టానికి తూట్లు పొడుస్తు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం వరవరరావు ఇంట్లోనే కాకుండా ఆయన కూతుర్ల ఇండ్లలో కూడా సోదాలు చేశారు. ఆ సమయంలో వారి అల్లుళ్లను కూడా గృహనిర్భంధం చేయడం గమనార్హం. ఇక విరసం సభ్యుడు, జర్నలిస్టు క్రాంతి టేకుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు.

వారంటు లేని అక్రమ పంచనామా..
భీమా కోరేగావ్ ఘటన నేపథ్యంలో మూడు నెలల క్రితం పూణే పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఆ సమయంలో అరెస్టు చేసిన హక్కుల నేత రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో ఒక లేఖ లభించిందని.. అందులో మోడీని మావోయిస్టులు హత్య చేయాలనే పథకం రచించారనే విషయం ఉందని పోలీసులు ఆరోపించారు. అంతే కాకుండా హత్యకు అవసరమైన డబ్బును వరవరరావు సమకూరుస్తారని కూడా ఉందనే విషయాన్ని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు వరవరరావుపై కుట్ర కేసు నమోదు చేశారు. అదే కేసును అడ్డం పెట్టుకొని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని నాలుగు ఇండ్లపై పూణే పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో దాడి చేశారు.

పొద్దున్నే గాంధీనగర్‌లోని వరవరరావు ఫ్లాట్‌లోనికి ప్రవేశించిన పూణే పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు మొదలు పెట్టారు. ముందుగా ఇంట్లో ఉన్న వరవరరావు, ఆయన భార్య హేమలత ఫోన్లను లాగేసుకున్నారు. అదే సమయంలో వరవరరావు కూతుళ్ల ఇండ్లలో కూడా పోలీసులు చొరబడి సోదాలు ప్రారంభించారు. వరవరరావు అల్లుడు, జర్నలిస్టు కూర్మనాథ్.. మరో అల్లుడు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణల ఇండ్లలో ఫోన్లు లాక్కొని, వారిని గృహ నిర్భంధం చేసి సోదాలు చేశారు. మరో వైపు నాగోలులో ఉండే జర్నలిస్టు, విరసం సభ్యుడు క్రాంతి టేకుల ఇంటికి చేరిన పోలీసులు అతడిని గృహ నిర్భంధం చేశారు. అసలు ఎలాంటి వారెంట్లు లేకుండానే.. ఇంటిలోని ప్రతీ అంగులం వెతికారు. ఆ నాలుగు ఇండ్లలో నుంచి ఏ ఒక్కరినీ బయటికి పోకుండా నిర్భంధించారు. అలాగే విషయం తెలుసుకున్న సన్నిహితులు, ప్రజా సంఘాలు అక్కడికి చేరుకున్నా.. పోలీసులు ఎవరినీ లోపలికి పోనియ్యలేదు.

మరాఠీలో రాసిన చీటీ
దాదాపు ఎనిమిది గంటల సేపు సోదాలు చేసిన పోలీసులు వరవరరావును అరెస్టు చేశారు. ఆ సమయంలో మరాఠీలో రాసిన పంచనామా చీటీని వరవరరావు భార్య హేమలతకు ఇచ్చారు. చట్టప్రకారం సోదాలు జరిపిన ఇంటి యజమానికి వారికి అర్థమయ్యే భాషలో పంచనామా రిపోర్టును ఇవ్వాల్సి ఉన్నా.. వారికి తెలియని భాషలో ఇవ్వడం పోలీసుల దురాగతానికి అద్దం పడుతోంది.

పూణేకు తరలింపు
వరవరరావును అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వరవరరావును సోమవారం సాయంత్రం 5 గంటల లోపు పూణే కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. వరవరరావును పోలీసులు రోడ్డు మార్గంలో పూణేకు తీసుకొని వెళ్లారు.

పిల్లల వస్తువులను కూడా వదల్లేదు..
అక్రమ సోదాలు చేసిన పోలీసులు అందరి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్ చేశారు. విరసం ఎడిటర్ క్రాంతి టేకుల ఇంటి నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లు కూడా తీసుకొని వెళ్లారు. పిల్లల ఆట వస్తువులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం పోలీసుల తీరును తెలియజేస్తోంది.

Keywords : వరవరరావు, పూణే పోలీసులు, మోడీ హత్య కుట్ర, అరెస్టు, జర్నలిస్టులు, ఇండ్ల సోదాలు, varavararao, arrest, pune police
(2019-04-18 06:31:48)No. of visitors : 803

Suggested Posts


0 results

Search Engine

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం
పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
అతడు ఓటేయలేదు..!
ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
more..


పూణే