ఆయన వెటకారంపై జనాల కసి...విప్లవానికి దారికి తీసింది


ఆయన వెటకారంపై జనాల కసి...విప్లవానికి దారికి తీసింది

ఆయన

దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, పౌర హక్కుల, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై మహారాష్ట్ర పోలీసులు చేస్తున్న దాడుల నేపథ్యంలో ʹఅర్బన్ నక్సలైట్ʹ అనే పదం చర్చనీయాంశం అయ్యింది. బాలివుడ్‌ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత వివేక్‌ అగ్నిహోత్రి ʹఅర్బన్‌ నక్సల్‌ʹ శీర్షికతో స్వరాజ్య పత్రికలో 2017, మే నెలలో ఓ వ్యాసం రాశారు. ʹఅర్బన్‌ నక్సలైట్లంటే పట్టణాల్లో ఉండే మేధావులు. ప్రభావశీలురు. ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలు, వారు భారత దేశానికి కనిపించని శత్రువులు. రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారుʹ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వీరిని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ ʹహాఫ్‌ మావోయిస్ట్స్‌ʹగా వర్ణించారు. రహస్య కేటగిరీకి చెందిన వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా ఆయన ట్వీట్‌ కూడా చేశారు.

అయితే నిన్న అదే వివేక్ అగ్నిహోత్రి వెటకారంగా మీరు కూడా అర్భన్ నక్సలైట్ అయితే మీ లిస్టు చెప్పండంటూ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టాడు. అయితే అతని వెటకారమే సోషల్ మీడియాలో విప్లవంలా మారింది. అన్యాయానికి, అక్రమాలకు వ్యతిరేకంగా నా గళం వినిపించినప్పుడు నన్ను నీవు అర్బన్ నక్సల్ అనుకుంటే నేను కూడా అర్బన్ నక్సల్‌నే అంటూ (#MeTooUrbanNaxal) పోస్టులు పెట్టారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులు, సోదాల నేపథ్యంలో ఈ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది. లక్షల సంఖ్యలో నెటిజన్లు నేనూ అర్బన్ నక్సల్‌నే అంటూ ట్వీట్లు చేస్తూ ప్రభుత్వం చేయిస్తున్న అరెస్టులను నిరసిస్తున్నారు. ఇలా వెటకారంగా పెట్టిన హ్యాష్ టాగ్ ఇంతింతై అన్నట్లుగా నేడు దేశంలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది.

Keywords : vivek agnihotri, urban naxal,metoourbannaxal, varavararao, వివేక్ అగ్నిహోత్రి, అర్బన్ నక్సల్, మీ టూ అర్బన్ నక్సల్, వరవరరావు, ట్విట్టర్, ట్రెండింగ్
(2018-09-25 08:11:23)No. of visitors : 367

Suggested Posts


0 results

Search Engine

అంటరాని ప్రేమ
వీవీ ఇంటిని చుట్టుముట్టిన ఏబీవీపీ.. అడ్డుకున్న స్థానికులు
ప్రజా కోర్టులో తేలిన నిజం.. బాక్సైట్ తవ్వకాలు, భూకబ్జాలే ఎమ్మెల్యే హత్యకు కారణం
అమృతకు క్షమాపణలతో..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
more..


ఆయన