కుట్ర సిద్దాంతం పెద్ద కుట్ర...రేపు విజయవాడలో సభ‌


కుట్ర సిద్దాంతం పెద్ద కుట్ర...రేపు విజయవాడలో సభ‌

కుట్ర

*మోడీ హత్యాయత్న కధనం పేరిట విప్లవ మేధావుల అరెస్టులపై విజయవాడలో న్యూడెమోక్రసీ పార్టీ సభ* !

(31-8-2018 ఉదయం 10 గంటలకి VIJ ప్రెస్ క్లబ్ లో)
ప్రియమైన పౌరులారా, నాజీ పార్టీ నేతృత్వంలో మూక స్వామ్యం బలపడిన ఫలితంగా హిండెన్ బర్గ్ స్థానంలో హిట్లరే జర్మన్ ఛాన్సలర్ గా ఎన్నికవ్వడం తెలిసిందే! నాటి ప్రపంచ చరిత్ర గమనంలో అదో విధ్వంసకరమైన అడుగు! హిట్లర్ ఛాన్సలర్ గా ఎన్నికయిన వెంటనే మొట్ట మొదటి పెద్ద వ్యూహాత్మక రాజకీయ కుట్ర పార్లమెంటు భవనాన్ని దగ్ధం చేయడమే! జర్మన్ రాజ్యాంగాన్ని, దాని సాంప్రదాయ పరిపాలనా వ్యవస్థని మట్టు బెట్టకుండా నాజీయిజాన్ని (ఫాసిజం) అమలు చేయడం ఆచరణ లో అసాధ్యం! ఈ నిప్పు వంటి నిజం హిట్లర్ మూకకి తెలుసు! దానికి ఆర్ధిక వెన్నుదన్నుగా నిలిచిన ద్రవ్య పెట్టుబడిదారీ వర్గానికి మరింత బాగా తెలుసు. అందుకే వాటికి ప్రతీక (సింబల్) ఐన రీచ్ స్టాగ్ (పార్లమెంటు) భవనం వాస్తవానికి నాజీయిజానికి గిట్టని శత్రువు అవుతుంది. అట్టి తన శత్రుప్రతీక ఐన పార్లమెంటు భవనాన్ని అర్ధరాత్రి చాటు గా తన నాజీ మూకలతో తానే తగలపెట్టించి, తన ప్రత్యర్థి రాజకీయశక్తుల అణచివేత కి నాటి హిట్లర్ సర్కారు వ్యూహం పన్నింది. నిజానికి తగలబఢ్ఢ పార్లమెంటు భవనం ప్రాణం లేనిది. నాటికి ఎంతో కొంత ప్రాణం ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మరణ శాసనం రాయడం హిట్లర్ సర్కారు లక్ష్యం. ఒక వైపు అట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకి కార్యస్థానమైన నిర్జీవ పార్లమెంటు భవనాన్ని తగలపెట్టించి, మరోవైపు దానికీ, అది కేంద్రంగా సాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకూ తాను కాపలా దారున్ని అయినట్లూ హిట్లర్ సర్కార్ హిపోక్రటిక్ గా కార్పొరేట్ మీడియా సాయంతో భారీ ప్రచారం చేయించుకున్నది. కమ్మునిస్టులు(యూదులు కూడా) దాన్ని తగలబెట్టితే తాను దాని పరిరక్షకుడిని ఆన్నట్లుగా జర్మన్ జాతిలో చిత్రించుకున్నది. ఈవిధంగా ఒకవైపు పార్లమెంటు భవనం దగ్ధం చేశారనే కుట్ర కేసుల్లో తన రాజకీయ ప్రత్యర్థులని ఇరికించి, శత్రు శేషం లేని స్థితిని సృష్టించ జూసింది. మరోవైపు జర్మన్ జాతీయుల్లో తన వ్యక్తిగత రాజకీయ పేరు ప్రతిష్టలను పెంచుకోజూసింది. ఆనాడు ఈ విధంగా అధికారాన్ని జర్మన్ లో నాజీయిజం స్థిరపరుచుకో గలిగింది. అది తర్వాత ప్రపంచానికే పెద్ద రాజకీయ శాపంగా మారింది. ఇది చెరిగిపోని గత విషాదకర, విధ్వంసకర ప్రపంచ చరిత్ర! నేడు భారతదేశ చరిత్ర గమనం కూడా అదే బాటలో సాగుతున్నది. అదే దిశలో నేటి మోడీ సర్కారు అడుగులు పడుతున్నాయి. ఇవి ఆ స్థాయికి ఇంకా చేరక పోవచ్చు. వీటిని వాటితో పోల్చే స్థాయి కాక పోవచ్చు. కానీ ఏ దిశలో ఈ పయనం సాగుతున్నదనేది ముఖ్యం! హిట్లరు సర్కారు తాను చంపదలిచిన పార్లమెంటరీ వ్యవస్థకి కార్యస్థానమైన నిర్జీవ భవనాన్ని తగల బెట్టించి ప్రత్యర్థులపై కుట్ర కేసు పెట్టింది. కానీ మోడీ సర్కారు ఏకంగా తమ ప్రధాన మంత్రి(మోడీ)ని చంపే పధకం పన్నినట్లు ప్రత్యర్థులపై కుట్ర కేసును మోపింది. దేశంలో వివిధ రాష్ట్రాలకి చెందిన అనేక మంది విప్లవ మేధావులని అందులో ఇరికించారు. మన తెలుగుసీమ నుండి ఏడున్నర పదుల వయసు దాటిన వృద్ద విప్లవ కవి వరవరరావుని కూడా ఆ కుట్ర కేసులో ఇరికించింది. ఇది కేవలం ప్రజాతంత్ర, విప్లవ మేధావులకు పరిమితమైన నిర్బంధ కాండ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది భిన్నత్వం, బహుళత్వం, వైవిధ్య భరిత సామాజిక, రాజకీయ వ్యవస్థపై వ్యవస్తీకృత దాడి! ఇది ఇప్పటికే గత నాలుగేళ్ళ మోడీ పాలన రుచి చూపించింది. ఆ చేదు అనుభవాల వెలుగులో రేపటి ఎన్నికలలో దేశ ప్రజలలో ఎదురవుతున్న వ్యతిరేక పరిస్థితులని అధిగమించే పెద్ద కుట్ర ఇది.
ఇప్పుడు మౌనం కూడా నేరమే! దుష్టులకు దూరంగా ఉండాలన్న నైతిక సూత్రాలు ఆచరణలో దుష్టత్వానికే బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు కూడా గొంతు విప్పకపోతే సమాజ మనుగడకి ముప్పుతప్పదు అన్ని వర్గాలని అంతం చేసే వరకు మౌనం వహించిన చివరి జర్మన్ పౌరులకీ చరిత్రలో ఏ గతి పట్టిందో ఓ జర్మన్ కవి చెప్పినవాక్యాలు తెలిసిందే! అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే మనం గొంతు విప్పుదాం. "జీనా హైతో మర్నా సీకో-కదం కదం పర్ లడ్ నా సీకో" (బ్రతకాలంటే చావడం నేర్చుకో- అడుగడుగునా పోరాటం నేర్చుకో) అనే పోరాట నినాద స్పూర్తితో అడుగులు వేద్దాం!
వరవరరావు తదితర విప్లవ మేధావులని, ప్రజాతంత్ర మేధావులని కుట్ర కేసుల్లో ఇరికిస్తున్న RSS సర్కారు ఫాసిస్టు విధానానికి నిరసనగా విజయవాడలో CPI ML న్యూ డెమోక్రసి పార్టీ AP రాష్ట్ర కమిటీ 31-8-2018 న సభ నిర్వహిస్తున్నది. VIJ ప్రెస్ క్లబ్ లో ఉదయం 10గంటలకి జరిగే ఈ సభకి హాజరు కావల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

వై. సాంబశివరావు, పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి,
29-8-2018; విజయవాడ

Keywords : maoists, prime minister, varavararao, arrests, police, new democracy
(2019-01-16 02:41:37)No. of visitors : 527

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
more..


కుట్ర