స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?


స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?

స్వచ్చమైన

వరవరరావు ఒక తెలుగు కవి.. హిందీ భాష గురించి పరిమిత జ్ఞానమున్న సాహిత్యకారుడు. అలాంటి వ్యక్తి హిందీలో రాశారన్న ఆరోపిత పత్రం ఒక కుట్ర మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలను తెలియజేస్తోంది. తెలుగు మాధ్యమంలో చదువుకొని, తెలుగు సాహిత్యంలో 35కు పైగా పుస్తకాలు రాసిన వామపక్ష రచయిత, కవి వరవరరావు జీవితంలో హిందీ భాషతో పరిచయం తక్కువ‌. 70వ దశాబ్దంలో ఆయన డైరెక్టర్ల ఆఫ్ అడ్వర్టైజమెంట్ ఆండ్ పబ్లిసిటీ(డీఏవీపీ)విభాగంలో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి పత్రాలను అనువాదం చేసే ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు హిందీతో పరిచయం.

కానీ కొన్ని రోజుల క్రితం పూణే జిల్లా కోర్టులో ఎల్గార్ పరిషత్‌కు సంబంధించిన కేసులో వరవరరావు సురేంధ్ర గాడ్గిల్ కు రాసినట్టు కోర్టు ముందు ఓ లెటర్ ను పెట్టారు. ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ పవార్ స్పష్టమైన హిందీ భాషలో రాసిన ఆ ఉత్తరాన్ని కోర్టుకు అనర్గళంగా చదివి వినిపించారు. సదరు ఉత్తరం సురేంద్ర గాడ్గిల్‌కి వరవరరావు రాశారని కోర్టుకు చెప్పారు. సురేంద్ర గాడ్గిల్‌ని కూడా పూణే పోలీసులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. కాని వరవరరావు రాశాడని చెబుతున్న ఆ ఉత్తరం చూసినవాళ్లు.. వరవరరావు గురించి తెలిసిన వాళ్లు ఒక విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే ఆ ఉత్తరంలో వరవరరావు వాడిన భాషే. అంతే కాదు ఆ భాషా ప్రయోగాన్ని చూసి వీవీ సన్నిహితులు నవ్వుతున్నారు.

వరవరరావు 1965-66 మధ్య ప్రభుత్వరంగానికి చెందిన డీపీవీపీలో పబ్లికేషన్ ఆఫీసర్‌గా ఉండే వారు. దాని తర్వాత ఎప్పుడు కూడా వారి పరిచయస్థులతో కానీ, విద్యార్థులతో కానీ, ఇతర వ్యక్తులతో కానీ, హిందీలో మాట్లాడిన దాఖలాలు లేవు. వీవీ గురించి తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వారికి హిందీ భాష పరిజ్ఞానం అంతంత మాత్రమే. ఆయన తన 78ఏళ్ల జీవితంలో ఎప్పుడు హిందీలో సంబాషించినట్టు కనిపించదు. హిందీ భాష ఎప్పుడు ఆయన ప్రాథమిక భాషగా లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆయన పని ఇంగ్లీష్ నుంచి తెలుగులొకీ పత్రాలను అనువాదం చేయడం తప్ప హిందీ భాషతో ఎటువంటి పని లేదు.

ప్రభుత్వ న్యాయవాది కోర్టులో ఉత్తరం చదవడం మొదలు పెట్టినప్పుడు అందులో మొదటగా ʹప్రియ సురేంద్రʹ అని సంబోధించారు. అంటే ఈ ఉత్తరం సురేంద్రకు వీవీ రాశాడని చెప్పుకొచ్చారు. ఇంకా ఆ ఉత్తరంలో సురేంద్రా.. నోట్ల రద్దు సమయంలో మీకు లక్షల రూపాయలు సమకూర్చాం. కానీ మీరు వాటిని సరైన విధంగా వాడుకోలేకపోయారని రాశారు. అంతే కాకుండా బస్తర్, గడ్చిరోలీలో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జరిగిన అవకతవకలు రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. జీఎన్ సాయిబాబాకు సంబంధించిన అనేక ప్రశ్నలు అభియోగ పత్రంలో లేవనెత్తారు.

ప్రభుత్వ న్యాయవాది పత్రంలో ఉన్న విషయాలు చదివి వినిపిస్తున్నప్పుడు ఉత్తరం రాసిన వారికి హిందీ భాష మీద చాల పరిజ్ఞానం ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే వరవరరావుకు హిందీ మాట్లాడం కష్టమైన పని. ప్రాసిక్యూషన్ న్యాయవాది రోషన్ నాహార్ చెప్పిన విధంగా వీవీ సాధారణంగా కొన్ని నిమిషాల కంటే ఎక్కువ హిందీలో మాట్లాడలేరు. అందుకే హిందీలో ఉత్తరం రాయడం అంత సులువైన విషయం కాదు.

వరవరరావు జన్మించింది ఉమ్మడి ఆంధ్రప్రేదశ్‌లోని వరంగల్ జిల్లా చిన్నపెండ్యాల గ్రామంలో. తన పాఠశాల విద్యాభ్యాసం తెలుగులోనే సాగింది. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రి పట్టా పొందారు. తెలుగు కవిత్వంలో పీహెచ్ డీ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు కానీ మధ్యలో విడిచిపెట్టి సిద్దిపేటలోని ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చేరారు. అక్కడ ఆరు నెలలు పని చేసిన తర్వాత ఢిల్లీ వచ్చి డీపీవీపీలో సంవత్సరం పాటు పనిచేశారు. దాని తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని కళాశాలలో తెలుగు లెక్చరర్ పోస్టులో కొనసాగారు. 1968 వరకు పని చేసి అక్కడి నుంచి వరంగల్ తిరిగి వచ్చేశారు. అక్కడ చందా కాంతయ్య మెమోరియల్ (CKM) కాలేజ్ లో చేరారు. ఆ తర్వాత కూడా తన 30ఏళ్ల జీవితం తెలుగులోనే గడిచిపోయింది.

హైదరాబాద్‌లో సీనియర్ పాత్రికేయుడు, వరవరరావు మేనల్లుడు ఎన్. వేణుగోపాల్ చెప్పిన దాని ప్రకారం వరవరరావు హిందీ అర్థం చేసుకోవడంతో పాటు ఏదో కొద్దిగా మాట్లాడుతుంటారు. కానీ ఆయనకు హిందీ రాయడం చాల కష్టమైన పని. అలా రాయాలని ఎప్పుడు ప్రయత్నించలేదు కూడా... అందువల్ల వరవరరావు సురేంద్ర గాడ్గిల్ కు హిందీలో రాసినట్టు పోలీసులు చూపిస్తున్న ఉత్తరం పోలీసుల కల్పన మాత్రమే.

1984లో వరవరరావు రామ్‌నగర్ కుట్ర‌ కేసులో జైల్లో ఉన్నారు. ఇంగ్లీష్ పత్రికలు ఇండియన్ ఎక్సప్రెస్ తాత్కాలిక సంపాదకుడు అరుణ్ శౌరీ చెప్పిన దాని ప్రకారం వీవీ ఆంధ్రప్రభ కోసం కాలమ్ రాసే వారు. ఆయన వ్రాసిన తెలుగు కాలమ్స్‌ను అనువాదం చేసి ఇండియన్ ఎక్సప్రెస్ పత్రికలో ప్రచురించారు.

ఈ ఉత్తరం గురించి వీవీ స్నేహితుడు తెలంగాణ హైకోర్టు ప్రముఖ న్యాయవాదీ రవీంద్రనాథ్ భల్ల మాట్లాడుతూ నాకు తెలసినంత వరకు వరవరరావు హిందీలో ఎప్పుడు మాట్లాడలేదు. తెలుగు, ఇంగ్లీష్ లో వీవీకి మంచి పరిజ్ఞానం ఉంది. హిందీలో వీవీ ఉత్తరం రాసారు అనేది అబద్దమని చెప్పారు.

వరవరరావు తన చేతులతో హిందీలో ఉత్తరం వ్రాసారా అని ఈ కేసును విచారిస్తున్నఅసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ను అడిగినప్పుడు.... వరవరరావుకు హిందీ రాయడం రాకపోవచ్చు కానీ హిందీ రాయడం కోసం ఎవరి సాయమైన తీసుకోవచ్చన్నారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
(Source: https://www.newslaundry.com/2018/09/10/varvara-rao-urban-naxal-pune-police-hindi)

Keywords : వరవరరావు, లేఖ, హిందీ, సంస్కృతం, పూణే పోలీసులు, అభియోగ పత్రం
(2019-01-16 02:41:38)



No. of visitors : 1175

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
more..


స్వచ్చమైన