తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు


తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు

తలపాగా

మారదు. లోకం మారదు. లోకం తీరు మారదు. సుప్రీంకోర్టు దళితుడు అనే పదం వాడొద్దు అనే తీర్పు ఇస్తుంది. కాని దళితులపై అనరాని మాటలు అనడం మాత్రం ఆగదు. ఆ ఒక్క మాట అనకపోతేనేం.. అగ్రకులస్థులు చేయాల్సిన దారుణాలన్నీ చేస్తున్నారు. ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ దళితులపై దమనకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.

ఒక దళితుడు నీలం రంగు తలపాగా ధరించడం పెద్ద నేరంగా మారింది. అందుకు అగ్రవర్ణ ఉన్మాదులు వేసిన శిక్ష చర్మం వొలిచేయడం. అవును వారు అతనికి వేసిన శిక్ష తల చర్మాన్ని ఒలిచేయడం. వినడానికే ఎంతో గగుర్పాటును కలిగిస్తున్న ఈ చర్య నిజంగా ఒక దళితుడిపై జరిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో చోటు చేసుకుంది. కులం వివక్ష ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో ఈ సంఘటన తెలియజేస్తోంది.

శివ్‌పురిలోని మొహోబా గ్రామం, ఎస్సీ వర్గానికి చెందిన బీఎస్పీ నేత సర్దార్‌ సింగ్‌ జాదవ్‌ ఎప్పుడూ తన తలపై నీలం రంగు తలపాగా చుట్టుకుంటాడు. ఈ నెల 3న సర్దార్‌ సింగ్‌ను ఓ విషయంపై మాట్లాడాలని అదే గ్రామానికి చెందిన ముగ్గురు గుజ్జర్‌ యువకులు పిలిచారు. నిందితుల్లో ఒకరైన సురేంద్ర గుజ్జర్ ఇంటికి వెళ్ళాడు సర్దార్ సింగ్ జాదవ్. అక్కడికి వెళ్ళగానే నిందితులు ముగ్గురూ జాదవ్‌ను అసభ్య పదజాలంతో ధూషించడం మొదలు పెట్టారు.

అనంతరం నిందితులు జాదవ్‌పై కత్తితో దాడి చేసి అతని తలపై చర్మాన్ని ఒలిచేశారు. తీవ్ర రక్త స్రావమైన సర్దార్‌ జాదవ్ గాయాలతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇంకా నిందితులను, పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాడిలో తీవ్రంగా గాయపడిన సర్దార్‌ను గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. జాదవ్‌ రోజూ నీలం రంగు తలపాగా ధరించడాన్ని ముగ్గురు నిందితులు సహించక పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దయాశంకర్‌ గౌతమ్‌ ఆరోపించారు.

Keywords : మధ్యప్రదేశ్, శివ్‌పురి, దళితుడు, తల ఒలిచివేత, skin, head, madhyapradesh, shivpuri
(2019-03-15 20:51:49)No. of visitors : 306

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


తలపాగా