ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే


ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే

తెలంగాణ ప్రభుత్వాధినేతలు, పోలీసు బాసులు పదేపదే వల్లించే మాట ʹఫ్రెండ్లీ పోలీస్ʹ. అంటే సాటి మనుషులను తమ సొంత స్నేహితులను పలకరించినట్లు పలకరించాలి. వారిని అక్కున చేర్చుకొని నష్టమొచ్చినా కష్టమొచ్చినా తగిన సహాయం చేయాలి. అంతే తప్ప దురుసుగా ప్రవర్తించవద్దు. అయితే ఈ ఫ్రెండ్లీ పోలీసులు కాగితాల మీదే కనిపిస్తారు. వాస్తవంగా వాళ్లు తెలంగాణలోనే కాదు.. దేశంలో ఉన్నారో లేదో తెలియనే తెలియదు. కనపడిన వాడిని ఈడ్చి లోపలేసుడే.. లేకుంటే కొట్టుడే వీళ్లకు తెలిసిన ఫ్రెండ్లీ పోలీసింగ్. కనీసం వయసుకు.. చదువుకు గౌరవం ఇవ్వడమనే ఆలోచనే ఉండదు.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఈ రోజు హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున జరిగిన ఘోరమైన, అన్యాయమైన సంఘటనే కారణం. విద్యాహక్కును అడిగిన నేరానికి విద్యావేత్తలను, ప్రొఫెసర్లను కూడా ఈడ్చి పడేశారు. పీకలు నొక్కుతూ.. ఆడవాళ్లను అసభ్యంగా తాకుతూ పోలీసులు ఒక రణరంగమే సృష్టించారు. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ʹప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను కాపాడుకుందాంʹ అనే నినాదంతో తెలంగాణ విద్యా పోరాట, పరిరక్షణ కమిటీ 100 రోజుల విద్యా విజ్ఞాన పోరాట యాత్రను శుక్రవారం ప్రారంభించింది. గన్ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో హరగోపాల్, చుక్కా రామయ్యలతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, మద్దతుదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిరసనకారులు గన్‌పార్క్ వద్ద ర్యాలీగా బయలుదేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్యను అదుపులోకి తీసుకున్నారు. పెద్దా చిన్నా అని చూడకుండా వారిని పోలీసు వాహనాల్లోకి ఈడ్చి పడేశారు. దీంతో ఆందోళనకారుడు పోలీసులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Keywords : telangana, police, friendly police, chukka ramaiah, haragopal, gun park, హరగోపాల్, చుక్కా రామయ్య, గన్ పార్క్, తెలంగాణ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్
(2019-03-21 02:59:44)No. of visitors : 432

Suggested Posts


0 results

Search Engine

The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
more..


ఫ్రెండ్లీ