అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది


అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది

అమృత

కుల దురహంకారాన్ని నరనరాన నింపుకున్న వాడు అతడు. డబ్బుతో ఏమైనా చెయ్యెచ్చనే పొగరు తలకెక్కిన మృగం అతడు. తాను అంగీకరించని అల్లుడి తలను తెగనరికిన హంతకుడు అతడు. ఆ కత్తి పట్టింది అతను కాదేమో కాని ఆ కత్తి మాత్రం అతడే. అల్లుడి రక్తాన్ని అంటించుకొని అగ్రకులమనే కసిని చల్లార్చుకున్నాడు. అతడే తిరుగనరి మారుతీరావు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనకు ఇష్టమైన వాడితో జీవిస్తోంది అనే ఆలోచనే అతడిని నిలువెల్లా కాల్చేసింది. కూతురు కడుపులో పెరుగుతున్న పిండాన్ని కూడా నలిపేయాలని చూసి.. వీలుకాక పట్టపగలే అల్లుడిని అతి దారుణంగా చంపించిన మారుతీరావు గురించి మిర్యాలగూడలో తెలియనివారుండరూ. చాలా మంది అతడి బాధితులే. ఈ రోజు వందల కోట్ల రూపాయల ఆస్తి తను కూడబెట్టినా.. అతడి జీవితం మొదలైని మాత్రం ప్రణయ్ కుటుంబం చేసిన సాయంతోనే అంటే మీరు నమ్మగలరా..? కాని ఇది సత్యం. అసలు ఆ మారుతీరావు చేసిన అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు చెబితే.. ఈ ప్రణయ్ హత్య వీడికి చాలా చిన్నది అనిపించకమానదు.

మిర్యాలగూడకు చెందిన మారుతీరావు జీవితం ఒక రేషన్ షాపుతో మొదలైంది. అమృత ప్రేమించి పెండ్లి చేసుకున్న ప్రణయ్ బంధువుకు చెందిన రేషన్ షాపునే ఈ మారుతీరావు తీసుకొని నడిపించాడు. ప్రణయ్ బంధువు చనిపోవడంతో ఆ షాపు మారుతీరావు చేతికి వచ్చింది. ఇక రేషన్ షాపు నడుపుతూనే పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఉద్యోగులు, పోలీసులను పరిచయం చేసుకున్నాడు. అప్పుడే అభివృద్ది చెందున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అతడి కన్నుపడింది. కాని పెట్టుబడి ఎలా..? దీంతో ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు. రెవెన్యూ ఉద్యోగుల దగ్గరకు అమ్మాయిలను పంపేవాడు. వాళ్లు సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలు తీసి తర్వాత అదే రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఖాళీగా ఉండే ప్రభుత్వ భూములను తన పేరిట రాయించుకునేవాడు. పోలీసుల్లో కూడా చాలా మంది ఇతని కనుసన్నల్లో పని చేసేవాళ్లే. ఇలా తన పేరిట భారీగా భూములు రాయించుకున్నాడు. అంతే కాకుండా ప్రైవేటు భూములను కూడా కబ్జా చేసి అసలు భూయజమానులను బెదిరింపులకు గురి చేసేవాడు. పొరపాటున ఎవరైనా కేసు పెడదామని స్టేషన్‌కు వెళ్లినా అక్కడ వారికి ఎలాంటి సాయం అందేది కాదు. ఎందుకంటే పోలీసులకు మారుతీరావు బెస్ట్ ఫ్రెండ్.

ఇలా కేవలం భూకబ్జాలు, రియల్ దందాలు మాత్రమే కాదు.. పోర్న్ సినిమాలు కూడా తీసి అమ్ముకునేవాడని మిర్యాలగూడలో చాలా మంది చెబుతుంటారు. సన్నిహితుల దగ్గర లక్షల్లో డబ్బులు అప్పుగా తీసుకోవడం.. ఆ తర్వాత అడిగినా ఇవ్వకుండా రివర్స్‌లో బెదిరించడం మారుతీరావుకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఇతడు ప్రతీ రాజకీయ పార్టీకి, కుల సంఘాలకు ఠంచనుగా చందాలు ఇస్తుంటాడు. అన్ని పార్టీల నాయకులు ఇతనికి మిత్రులే. దీంతో మారుతీరావు ఆగడాలకు అంతే ఉండదు.

ప్రణయ్ ప్రతీ కదలిక మారుతీరావుకు క్షణక్షణం అప్‌డేట్ అవుతుందంటే.. మారుతీరావు నెట్‌వర్క్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ దందాలతో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని అతడికి పరిచయం ఉన్నవారు చెబుతున్నారు.

ఇన్ని అక్రమాలు చేసిన మారుతీరావు.. ప్రేమను కూడా డబ్బుతో కొనేయాలని చూశాడు. మూడు కోట్లు ఇస్తా నా కూతురిని వదిలెయ్ అని ప్రణయ్‌కు ఆఫర్ ఇచ్చాడు. కాని తన ప్రేమ ముందు మూడు కోట్లు ఏపాటి అని ప్రణయ్ అసలు పట్టించుకోలేదు. దీంతో మారుతీరావుకు ఏం చేయాలో పాలుపోలేదు. ప్రణయ్‌ని చంపేయాలని ఆరోజే నిర్ధారించుకున్నాడు. సుపారీ గ్యాంగ్‌కు 10 లక్షలు ఇచ్చి అతి దారుణంగా చంపించాడు.

కేవలం కులం అనే అహంకారమే ఈ హత్యకు దారితీసింది. డబ్బులో మునిగితేలుతూ కులపిచ్చి పట్టిన ఒక ఉన్మాది.. కూతురి భర్త అని కూడా చూడలేదు. గర్భంతో ఉన్న కూతురు బాగోగులు ఏనాడూ చూడలేదు కానీ.. ఆ గర్భం తీయించేసుకో అంటూ వందల సార్లు ఫోన్లు చేశాడు. మా నాన్న కనిపిస్తే చంపేస్తా అని అమృత అందంటే.. అతడి కౄరత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగినా మారుతీరావు కొంచెమైనా పశ్ఛాత్తాప పడట్లేదు. పోలీసులకు ఏమని చెప్పాడంటే.. 9వ తరగతిలోనే ప్రణయ్‌కు వార్నింగ్ ఇచ్చా. నా కూతురు జోలికి రావొద్దని చెప్పా.. అయినా అతడు ఆగలేదు. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత నాలో కోపం మరింత పెరిగిపోయింది. అందుకే ప్రణయ్‌ని చంపేయాలనుకున్నా. నా కూతురు కంటే సొసైటీలో నా పరువు నాకు ముఖ్యం. నా పరువు పోవద్దనే.. వాళ్ల ప్రేమను విడదీయాలనుకున్నా. సుపారీ గ్యాంగ్‌కు... నా కూతురును ఏమీ చెయ్యొద్దు.. వాడు మాత్రం ప్రాణాలతో ఉండొద్దని ముందే చెప్పానని మారుతీరావు చెబుతున్నాడు.

మిర్యాలగూడలో జరిగిన ఈ కులదురహంకార హత్య మొదటిది కాదు.. ఇదే ఆఖరుది అవుతుందనే నమ్మకమూ లేదు. ఎందుకంటే ఈ మధ్య దేశవ్యాప్తంగా దళిత, బహుజనులపై జరుగుతున్న కుల, మతోన్మాదులు చేస్తున్న దాడులు అత్యంత భయంకరంగా ఉంటున్నాయి. మంథనిలో మధుకర్‌ను ఎంత దారుణంగా చంపారో మనం చూశాం. అంతే కాకుండా ఇటీవల ఒక దళితుడు తలపాగా ధరించాడని ఏకంగా తలపై చర్మాన్ని ఒలిచేశారు. ఇలా దేశంలో ఏదో ఒక చోట భీకరమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. ఇంకా చాలా మంది అజ్ఞానులు దేశంలో కుల వివక్ష ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి పక్కనే అగ్రకుల అహంకారులు దాడులు చేస్తున్నా.. వీళ్లకు మాత్రం ఏ వివక్షా కనపడదు. ఇలాంటి దురాగతాలు, అగ్రకుల ఆగడాలు ఆగిపోవాలంటే కేవలం కుల సంఘాలు, ప్రజా సంఘాల వల్లనే కాదు. ప్రజలందరూ జరుగుతున్న అక్రమాన్ని, అన్యాయాన్ని ఏకమై నిలదీయాలి. అందరూ ఒక్క తాటిపై నిలబడి ఇలాంటి దుర్మార్గులకు కఠిన శిక్ష పడేలా చేస్తే కాని వీరి ఆగడాలు ఆగవు.

Keywords : మారుతీరావు, మిర్యాలగూడ, అమృత, ప్రణయ్, హత్య, కుల అహంకారం, దళితుడు, marutirao, amruta, pranay, miryalaguda, murder
(2018-12-13 07:58:32)No. of visitors : 4281

Suggested Posts


0 results

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


అమృత