ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?


ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?

ప్రొఫెసర్

రాజ్యం ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి రోజూ బూటకపు ఉత్తరాలను సృష్టించి రాజ్యహింసకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సందర్భంలో ప్రజా ఉద్యమాలకు, సాయిబాబకు మద్దతుగా సుదూరం నుండి పదేండ్ల సాహస్ పంపిన ఉత్తరం.

డియర్ సాయిబాబ,

నా పేరు సాహస్. నాకు పదేండ్లు. ఐదవ తరగతి చదువుతున్నాను. కొంత కాలంగ భారత ప్రభుత్వం నీ మీద ఎంతటి హింస కొనసాగిస్తుందో మా నాన్న ద్వార వింటున్నాను. చాలా రోజుల నుండి నీకు ఒక ఉత్తరం రాయాలని అనుకుంటున్నాను. కాని నాకు ఉన్న హోం వర్క్స్ వల్ల వీలుకాలేదు. ఇప్పుడు నాకు కొన్ని రోజులు బడి లేదు. ఇదే గొప్ప అవకాశమంగా తీసుకొని ఈ ఉత్తరం రాస్తున్నాను.

నీవు నా దృష్టిలో అత్యంత బలశాలివి. ఎందుకంటే ప్రభుత్వం అంత దారుణంగా నిన్ను ట్రీట్ చేసినా కూడా నీవు ఇంకా బతికేవున్నావు. అయినా కూడ నీ గురుంచి నేను ఆందోళన పడుతున్నాను. అందుకే ఏది ఎమైనా నీకు మద్దతుగా నిలబడుతాను. ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుందని తెలుస్తూనే వుంది. ఇదే విషయాన్ని చాలా మంది అనుకుంటున్నారు. అసలు నిన్ను ఎందుకు జైళ్ళో పెట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? కేవలం నీ భావాలను పంచుకోవడమేనా నీ నేరం?

"ఓ... అతను తన భావాలను నలుగురికి పంచుతున్నాడు. అతన్ని నిర్బంధించండి. మా తప్పులు చూపిస్తు, మాకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడ వద్దు" ఇదే కదా వాళ్ళ నీతి..! అయినా పోలీసులు జైళ్ళలో పెట్టాల్సింది చెడ్డ పనులు చేసేవాళ్ళని, తమ భావాలను ప్రకటించేవాళ్ళను కాదు. ఈ విషయంలో ప్రజలకు నాతో అంగీకారం ఉందనే అనుకుంటున్న. కాకపోతే మోడీకి భయపడి వాళ్ళు గట్టిగ గొంతెత్తి చెప్పలేక పోతున్నారు. ఎందుకంటె వాళ్ళను కూడ జైళ్ళలో నిర్బంధిస్తాడని భయం.

నిజమే కదా.. నీకు మద్దతుగా ఎవ్వరు నిలబడినా కోరి సమస్యలను తెచ్చుకోవడమె. నీకు మద్దతుగా నిలబడిన వరవరరావును అదే చేయాలని చూస్తున్నారు. అరెస్ట్ చేసి జైళ్ళో పెట్టాలనుకున్నారు. కోర్ట్ కలగజేసుకోవడం మూలంగ గృహ నిర్బంధంలో వుంచారు. అయినా, ఆయన పిల్లల ఇండ్ల మీద దాడులేంటి? అది పూర్తి అన్యాయం. దీనిని ప్రజలందరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇలాంటి ప్రజావ్యతిరేక చర్యల మూలంగ మోడి ముందు ట్రంప్ కూడ మంచోడిలా కనబడుతున్నాడు!

నిన్ను జైళ్ళో పెట్టింది గుర్తు కొచ్చినప్పుడల్లా నాకు ఎంతో కోపం వస్తుంది. నాలో తెలియని చిరాకు కలుగుతుంది. ప్రభుత్వం ఎంత దుర్మార్గమైంది అనిపిస్తుంది. నీకు మద్దతుగా ఇంకా ఎక్కువ మంది నిలబడితే బాగుండు అనిపిస్తుంది. నా ఆరేళ్ళ చెల్లి కూడా అలాగే అనుకుంటుంది. ప్రభుత్వం తాను చేసిన తప్పును తెలుసుకునే రోజు వచ్చే వరకు, నువ్వు నీ ఆరోగ్య సమస్యలతో ఇంకొంత కాలం పోరాటం చేస్తూనే వుంటావనుకుంటున్న.

హృదయపూర్వకంగ,
సాహస్
సెప్టెంబర్ 09, 2018

Keywords : saibaba, jail, modi, varavararao, sahas, leter, సాయిబాబా, జైలు, మోడీ, వరవరరావు, సాహస్, లెటర్
(2018-12-12 07:27:26)



No. of visitors : 634

Suggested Posts


0 results

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


ప్రొఫెసర్