నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..


నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..

నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్క సారి లే ప్రణయ్.. కులోన్మాదికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు ఒక్క సారి చూడు ప్రణయ్. మనువాదులకు వ్యతిరేకంగా వేల పిడికిళ్లు బిగిస్తున్నాయ్.. ఆ పిడికిళ్లలో నాకు నువ్వే కనపడుతున్నావ్.. కుల వ్యవస్థను నిరసిస్తూ నువ్వు నాకు చెప్పిన మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయ్ ప్రణయ్. నువ్వు మనువాద కత్తులకు బలయ్యావు కానీ.. నీ కలను నిజం చేసేందుకు వేలాదిగా జనం వచ్చారు చూడు ప్రణయ్... అంటూ రోదిస్తూ.. కళ్లలో కసితో కూడిన కన్నీళ్లను నింపుకొని తన జీవిత సహచరుడికి కడసారి వీడ్కోలు పల్కింది అమృత. అంతిమయాత్రలో ప్రణయ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలతో సహా వేలాది మంది ప్రజలు నడిచి వచ్చారు.

అమృత, ప్రణయ్ తమ్ముడు, తల్లిదండ్రుల రోదనలు చూసి ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టారు. కుల దురహంకారంతో పొట్టనపెట్టుకున్న ఆ కౄరుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఇక ఎంతో ఇష్టపడి పెండ్లి చేసుకున్న ఆ జంట ఆశలు అడియాసలయ్యాయని పలువురు రోదించారు. అమృత ఏడుస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మిర్యాలగూడ పట్టణం గుండా సాగిన ఈ అంతిమయాత్రలో ఉద్రిక్తలు నెలకొంటాయేమో అనే భయంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాని ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా.. ప్రజల అశ్రునయనాల మధ్య ప్రణయ్ అంత్యక్రియలు ముగిశాయి. అక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరు కూడా ఆ హంతకుడిని ఉరి తీయాల్సిందే అని నినాదాలు చేశారు.

Keywords : ప్రణయ్, కులదురహంకార హత్య, మిర్యాలగూడ, అంత్యక్రియలు, pranay, funeral, miryalaguda
(2018-12-09 13:55:29)No. of visitors : 593

Suggested Posts


0 results

Search Engine

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


నీ