జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు

జేఎన్‌యూపై

మతోన్మాదుల రెక్కలు విరిగిపోయాయి.. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీలో కిడ్నాపులు చేసి.. తుపాకీ గుండ్లతో అల్లర్లు సృష్టించి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసిన ఆ మత ఉగ్ర మూకకు ఎర్రజెండా పట్టిన విద్యార్థులు సరైన సమాధానం చెప్పారు. ఎదురు దాడులు లేవు.. కిడ్నాపులు లేవు.. హత్యారాజకీయాలు లేవు. కేవలం అంతా సంఘటితమై నిలిస్తే ప్రత్యర్థిని ఎలా భయపెట్టగలమో ఒకే ఒక ఎన్నికతో నిరూపించారు. అది జరిగింది దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీలో.

జేఎన్‌యూలో ఎర్రజెండా రెపరెపలాడింది. లెఫ్ట్ విద్యార్థుల ఐక్య కూటమి ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ ఏబీవీపీని చిత్తుచిత్తుగా ఓడించింది. జేఎన్‌యూ విద్యార్థి సంఘ ప్రెసిడెంట్‌గా సాయి బాలాజీ, వైస్‌ ప్రెసిడెంట్‌గా సారికా చౌదరీ విజయం సాధించారు. అజీజ్‌ అహ్మద్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వగా, అమృత జయదీప్‌ జాయింట్‌ సెక్రటరీగా విజయభేరి మోగించారు. దీంతో యూనివర్సిటీలోని నాలుగు కీలక పదవులు లెఫ్ట్ కూటమి సొంతం చేసుకుంది.

లెఫ్ట్‌ కూటమి నుంచి పోటీ చేసిన సాయి బాలాజీకి 2151 ఓట్లు పోలవ్వగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి పోటీచేసిన లలిత్‌ పాండేకి కేవలం 972 ఓట్లు మాత్రమే సాధించారు. కాగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో శనివారం ప్రకటించాల్సిన ఫలితాలు ఆదివారంకి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా గత ఆరేళ్లల్లో అత్యధికంగా 68 శాతం పోలింగ్‌ నమోదైంది. యునిటైడ్‌ లెఫ్ట్‌ను బలపరిచిన కూటమిలో ఆల్‌ఇండియా స్టూడెంట్‌​ అసోషియేషన్‌ (ఎఎఐఎస్‌ఎ), స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌, ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ఎఫ్‌) ఉన్నాయి.

Keywords : jnu, left unity, jnusu, abvp, left, dsu, జేఎన్‌యూ, లెఫ్ట్ కూటమి, ఏబీవీపీ, లెఫ్ట్ యూనిటీ, ఎర్రజెండా
(2024-03-18 14:41:01)



No. of visitors : 2007

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జేఎన్‌యూపై