ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు


ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు

ఆంటీ!

ఎన్నో కలలు.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. ప్రేమించి పెళ్లాడిన వ్యక్తితో రాబోయే కాలంలో ఎంతో సంతోషంగా ఉండాలని ఆశించారు. త్వరలోనే తమ ప్రేమకు గుర్తుగా భూమ్మీదకి రాబోతున్న చిన్నారి గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నారు. కాని ఇంతలోనే ఒక కుల దురహంకారి.. ఉన్మాది.. తండ్రి రూపంలోనే పొంచి ఉన్న హంతకుడు వీరి జీవితాలను తారుమారు చేశాడు. ఒకేఒక్క వేటుతో వీరి కలల భవిష్యత్తును కుప్పకూల్చాడు. జీవితాంతం కలిసి ఉందామనుకున్న జంటలో ఒకరిని లోకం నుంచి పంపేశాడు. ఇప్పుడా ఒంటరి అమృత ఏం చేయాలి..? ప్రణయ్‌తోనే జీవిత ప్రయాణం అనుకున్న ఆమె వేదన ఎవరికి చెప్పుకోవాలి..? తన మనసులోని మాట మహిళా సంఘాలకు చెప్పుకుంటుంటే అందరి కండ్లలో కన్నీరే. ఆమె మాటలకు అక్షర రూపం ఇచ్చారు విజయ బండారు. ఆమె ఫేస్‌బుక్ పోస్టు యధాతథంగా..

-----------------------------------------------------------------------------------------------------

ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు..మేం ఎన్ని కలలు కన్నామో... వాటినన్నింటిని తుంచేసారాంటీ.. నన్ను పెండ్లి చేసుకోక పోయినా ప్రణయ్ బతికేవాడాంటీ. నన్ను చంపుకొనే హక్కు వాళ్ళకుండవచ్చు... కానీ వేరే తల్లిదండ్రులు కన్న బిడ్డను చంపే హక్కు వాళ్లకెలా వచ్చింది? ప్రణయ్‌తో నాస్నేహం ఇప్పటిది కాదాంటీ.. తను లేకుండా నేను జీవించడమేంటి?

నా భర్తను, నా అత్తమామలను ఎన్నోసార్లు రాజకీయ నాయకులతోనే కాదు.. నా కళ్లెదుటే ప్రత్యక్షంగా వాళ్ళు బెదిరించారు. అయినా నన్ను బలవంతంగా తీసుకొని వెళ్లలేకపోయారు. నా తండ్రికి, నా బాబాయికి కూడా పడదు. అయినా మా నాన్నకున్న కోట్ల ఆస్తిని కాజేసే విధంగా, నా జీవితాన్ని సమాధి చేసే స్కెచ్ వేసి కులాన్ని ముందుకు తెచ్చి.. నా భర్తను పొట్టన పెట్టుకున్నారు. వాళ్లిద్దరూ అక్రమంగా, దౌర్జన్యంగా.. మోసాలు చేసి సంపాదించిన ఆస్తులు నాకెందుకు? మొదటి నుంచి వాళ్ళు కులపిచ్చితో, డబ్బు మదంతో గొప్పవాళ్లుగా చెలామణి అవుతున్నారు. కులం కోసం నా జీవితాన్ని ఇప్పుడు నాశనం చేశారు. అసలు మన దేశంలో కులమనేదే లేకుండా పోవాలని, పేదవాళ్లకు మాత్రమే రిజర్వేషన్లు, అవకాశాలు వచ్చే విధంగా మనం పోరాడుదామని ప్రణయ్ నాతో చెప్పేవాడు. ఇప్పుడేమైంది ఏ కులమైతే వద్దనుకున్నామో అదే కులం ప్రణయ్‌ను చంపేసింది. ప్రణయ్‌ను నాకు కాకుండా చేసింది. పుట్టబోయే బిడ్డకోసం ఇద్దరం అనేక కలలను దాచుకొని... బిడ్డపుట్టాక తనను తీసుకొని విదేశాలకు వెళ్లాలని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం.. అవన్నీ ఇప్పుడు ఎలా మారిపోయాయో చూడండి?

నా ప్రణయ్ ప్రతిరూపం నాలో ఇప్పుడు లేకుంటే.. నేనూ నా భర్తతో పాటే.. చచ్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పని చేయను. నా ప్రణయ్ ప్రతిరూపం కోసం నేను బ్రతుకుతాను. నా అత్తారింటిలొనే జీవిస్తాను. నా బిడ్డను వాళ్ళ చేతుల మీదనే పెంచుతాను. నా భవిష్యత్తు వాళ్ళతోనే నిర్మించుకొని నా భర్త ఆశయం నెరవేరుస్తాను. నా భర్తను చంపిన నాతండ్రి, బాబాయిలను చంపాలి.

రాజకీయ నాయకుల అండ, ధనబలం, కుల దూరహంకారంతో ప్రణయ్‌ను చంపటానికి సుపారీలు ఇచ్చి.. వారికి ఇన్నోవాలు కొనిపెట్టి దారుణంగా నా కళ్ళ ముందే హత్య చేసారు. నా భర్తను నా కళ్ళ ముందే నరికేసాడు. రక్తం మడుగులో నా భర్తను చూసి తట్టుకోలేక పోయాను. నా భర్తను చంపటంలో సహకరించిన వాళ్ళందరిని వదిలిపెట్టవద్దు. వాళ్ళందరికీ శిక్ష పడినప్పుడే నా ప్రణయ్‌కు న్యాయం జరుగుతుంది.

ఇంత జరిగినా.. తమ బిడ్డను కోల్పోయినా నా అత్తామామలు నన్ను ప్రణయ్‌లా చూసుకుంటామని.. నా బిడ్డను పెంచి పోషిస్తామని అంటున్నారు. నన్ను నా బిడ్డను ఆదరిస్తామని అంటున్న నా అత్తామామలు గొప్పవాళ్ళా? కులం కోసం.. ధనమదంతో నా ప్రణయ్ ను చంపిన నా తండ్రి,బాబాయిలు గొప్పవాళ్లా?. ఎవరిది గొప్పకులం? ఎవరు గొప్ప వాళ్ళు? ఎవరు ఈ సమాజానికి కావాల్సిన వారు?

(పొరలి వచ్చే దుఃఖంలో అమృత వేసే ప్రతి ప్రశ్నలో పరిణితి చెందిన ఆమె వ్యక్తిత్వం దాగి ఉంది..ఆమెకు జీవితం యెడల ఉన్న ఒక క్లారిటీని తెలియచేస్తుంది)

Keywords : amruta, pranay, miryalaguda, caste discrimination, అమృత, ప్రణయ్, మిర్యాలగూడ, కుల వివక్ష
(2019-06-24 11:41:12)No. of visitors : 2746

Suggested Posts


0 results

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


ఆంటీ!