ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి


ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి

ఓటమిని

మళ్లీ మళ్లీ అదే పరాజయం.. ఎంత బెదిరించినా విద్యార్థులు లొంగట్లేదు.. ఎన్ని మాయమాటలు చెప్పినా ఎదుటి పక్షానికే మద్దతు పలుకుతున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలని బీజేపీకి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులతో ప్రచారం చేసినా లేకపోయింది. ఎప్పటిలాగే పరాజయం వెంటాడింది. లెఫ్ట్ విద్యార్థుల విజయంతో ఏబీవీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సహనం కోల్పోయారు. ఫలితాలు వచ్చి గంటలు కూడా గడవక ముందే జేఎన్‌యూలో బీభత్సం సృష్టించారు. లెఫ్ట్ యూనిటీ తరపున ప్రెసిడెంట్‌గా గెలిచిన సాయి బాలాజీని కూడా వదలకుండా దాడి చేశారు. అసలేం జరిగిందంటే..

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల కౌంటింగ్ శనివారం ప్రారంభమైంది. అయితే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు, మద్దతుదారులు కౌంటింగ్ హాల్‌కు వెళ్లి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకొని వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో కౌంటింగ్ నిలిపివేసి తిరిగి ఆదివారం కౌంటింగ్ ప్రారంభించారు. అయితే ఈ ఎన్నికల్లో టాప్ 4 స్థానాలను లెఫ్ట్ యూనిటీ తరపున నిలిచిన అభ్యుర్థులే గెలిచారు. ఏబీవీపీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడమే కాకుండా.. కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

ఈ విజయం లెఫ్ట్ కూటమి విద్యార్థి నాయకులకు, జేఎన్‌యూ విద్యార్థులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్నికల్లో విజయంతో ర్యాలీ నిర్వహించారు. అయితే ఇది చూసి తట్టుకోలేకపోయిన ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే విద్యార్థులపైన దాడికి దిగారు. ఒక జేఎన్‌యూ మాజీ విద్యార్థిని తీవ్రంగా చితకబాదారు. కొత్తగా విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన సాయి బాలాజీపై కూడా దాడికి దిగారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ నాయకులు బయట నుంచి గూండాలను రప్పించి తమ ఓటమికి ప్రతీకారంగా యూనివర్సిటీలో అరాచకం సృష్టించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ మతోన్మాద గూండాల అరాచకం యూనివర్సిటీలో కొనసాగింది.

అయితే సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేయాలని ప్రయత్నించినా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్టేషన్ బయట కూడా విద్యార్థి నాయకులను, విద్యార్థులను భయపెట్టారు. దీంతో జేఎన్‌యూలో రోజంతా ఆందోళనలు కొనసాగాయి. ఏబీవీపీ దాడులకు నిరసనగా క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అయితే ఇంత జరిగినా ఏబీవీపీ కార్యకర్తలపై మాత్రం ఇంత వరకు ఎలాంటి చర్యా తీసుకోకపోవడం శోచనీయం.

Keywords : జేఎన్‌యూ, ర్యాలీ, విజయం, ఏబీవీపీ, దాడి, లెఫ్ట్ విద్యార్థులు, jnu, abvp, attack, left unity, elections
(2019-06-24 05:06:44)No. of visitors : 496

Suggested Posts


0 results

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


ఓటమిని