ఆంధ్రజ్యోతి.. అబద్దాల ఎడిటోరియల్..!


ఆంధ్రజ్యోతి.. అబద్దాల ఎడిటోరియల్..!

ఆంధ్రజ్యోతి..

ఒక పత్రిక ఉద్దేశం.. అది ఎవరి వైపు ఉందో తెలియజేసేది పత్రిక మొదటి పేజీ కాదు. ఆ పత్రిక ఎడిటోరియల్ మాత్రమే. ఫ్రంట్ పేజీలో ఏమి వేసుకున్నా, రాసుకున్నా అది పెద్ద విషయమేమీ కాదు కానీ.. ఎడిటోరియల్ పేజీలో రాసుకునే విషయాన్ని మాత్రం ఆ పత్రిక ధోరణి అని అందరూ నిర్థారించుకుంటారు. గత మూడు రోజులుగా మన్యంలో జరుగుతున్న పరిణామాలపై, ఘటనలపై ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు ప్రచురించిన ఎడిటోరియల్ ఏకపక్షంగానూ.. ఒక పక్షాన్ని బలంగా సమర్థించేదిగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎస్ఏ డేవిడ్ తన సోషల్ మీడియా వాల్‌పై కూలంకషంగా వివరించారు. అది యధాతథంగా...
--------------------------------------------------------------------------------------

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును, మాజీ ఎమ్మెల్యే సోమును మావోయిస్టుల హత్య చేశారని వార్తలు చూస్తున్నాం..సహజంగానే రాజకీయ పార్టీల నుండి ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీనుండి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఖండనలు. బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటనలు వస్తున్నాయి.

పనిలో పనిగా వార్త పత్రికలు, టీవీలు తమ వార్తలను వండీ వారుస్తున్నాయి.. అధికార తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాయడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్రజ్యోతి పత్రిక ఒకడుగు ముందుకు వేసి ʹమన్యంలో ఘాతకంʹ అంటూ ఎడిటోరియల్ రాసి తన గురుభక్తిని చాటుకుంది.

తమ అభిప్రాయాలను, భావాలను వ్యక్తికరించే స్వేచ్ఛ వ్యక్తికైనా, సంస్థ కైనా ఒకే రకంగా ఉంటుంది. దాన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.. కానీ దాని పేర నిజాలను దాచిపెట్టి ఏది పడితే అది రాయడం భావ్యం కాదు. అలాంటి పని ప్రజల వైపు ఉండాల్సిన పత్రికలు అసలే చేయకుడదు..కానీ ఆపనిని ఆంధ్రజ్యోతి విజయవంతంగా చేస్తుంది..

ʹమన్యంలో ఘాతకంʹ అంటూ రాసిన ఈ ఎడిటోరియల్ లో ఘటనను ఖండిస్తూనే.."గత కొంతకాలంగా స్థానికంగా ఆందోళన కార్యక్రమాలు సాగుతూ, విచారణ కమిటీ కూడ క్వారీ నిర్వహణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ హత్యజరిగింది అంటూ రాసుకొచ్చారు"..వాస్తవానికి ఇది అబద్దం..అక్కడ ఈ ఘటన జరగడానికి ముందు రోజు వరకు కూడ అక్కడి ప్రజలు ఈ క్వారీలు, బాక్సైట్ నిక్షేపాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు.. ఆందోళన చేస్తున్న ప్రజలపై అక్కడి పోలీసులను ఉసిగొల్పి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు..హుకుంపేట మండలంలోని గూడ గ్రామస్తులు ఈ పోలీసు బెదిరింపులను లెక్కచేయకుండా నేటికి తన ఆందోళన చేస్తుంటే ఆంధ్రజ్యోతి మాత్రం విచారణ కమిటీ దీనికి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని తప్పుడు వార్తను రాయడం భావ్యం కాదు.

ప్రభుత్వాలకు, పోలీసు వ్యవస్థను భయపడి నివేదిక వాళ్లకు అనుకూలంగా ఇచ్చినా కూడ ప్రజా ఆందోళన ఎటువైపు ఉంది అనేది ఆంధ్రజ్యోతి పరిగణలోనికి తీసుకోవాలి కానీ ఇలా ఏకపక్షంగా తప్పుడు వార్తలను సృష్టించడం భావ్యం కాదు.

ఇవాళ హత్య గావించబడ్డ ఎమ్మెల్యే కిడారి సర్వేేశ్వర రావు కాంగ్రెస్, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకిి, వారి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిండు. అరకు నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో అనేక గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ బాక్సైట్ కు వ్యతిరేకంగా పోరాడుతానని హామీ ఇచ్చాడు.. బాక్సైట్ తవ్వకాలు కొనసాగితే ఇక్కడ కురిసే ప్రతి నీటిబొట్టు విషతుల్య మౌతుందని, 21 నదులు కులుషితమవుతాయని ʹఅరకుʹ మాత్రమే కాకుండా విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు సహితం ప్రమాదంలో చిక్కుకుంటాయని జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను నమ్మించాడు..వారి ఓట్లతో గెలిచిన వ్యక్తి రెండేండ్లు తిరక్కుండానే అధికార పక్షం వంచన చేరి ఇచ్చిన హామీలనే తూట్లు పొడుస్తుంటే వీటి గురించి ఏమి రాయదు ఈ పత్రిక..!

నిన్నటికి నిన్న మన్యంలో విష జ్వరాలతో పదుల సంఖ్యలో ఆదివాసులు మృత్యువాత పడితే ఈ ఎమ్యెల్యే గారు అన్నమాట ఏంటో తెలుసా ʹ లక్షలాదిమంది ఉండే దగ్గర 40, 50 మంది చనిపోవడం చాలా సహజం. అయినా విశాఖపట్నం లో ఎవరూ చనిపోవడం లేదా ఏంటి అని...! అంతమంది మరణాల పట్ల అంత చులకన భావంతో ఉన్న వ్యక్తి చనిపోతే పత్రికలన్ని పోటీలు పడి మరీ ఫ్రంట్ పేజీ కథనాలు ప్రచురిస్తున్నాయి..ఓహో ఎవరీ చావులన్నా ఒకటే అంటారా...? మరీ ఆ ఆదివాసీ మరణాల గురించి చూపించండి ఒక్కటంటే ఒక్క కథనం..బ్యానర్ ఐటం మీ మీ పత్రికల్లో..?

మీ మీ ప్రాంతంలోని సంగతేమో కానీ, తెలంగాణ లో కాళోజీ అనే కవి ఒక మంచి మాట చెప్పాడు ప్రాంతేతరుడు దోపిడి చేస్తే ప్రాంతందాకా తరిమికొడదాం, ప్రాంతంవాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేద్దాం...ʹ అని..బహుశా ఈ మాటలు అమలులో పెట్టారేమో అక్కడి వాళ్ళు.. ఎవరికి తెలుసూ...!?

Keywords : araku, mla, murder, maoists, andhrajyothy, editorial, అరకు, ఎమ్మెల్యే, మావోయిస్టులు, ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్, అబద్దాలు
(2019-05-18 11:22:11)No. of visitors : 1379

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


ఆంధ్రజ్యోతి..