ఏబీవీపీ తిక్క కుదిర్చిన కాలేజీ ప్రొఫెసర్.. కాళ్లు మొక్కి మరీ బుద్ది చెప్పాడు


ఏబీవీపీ తిక్క కుదిర్చిన కాలేజీ ప్రొఫెసర్.. కాళ్లు మొక్కి మరీ బుద్ది చెప్పాడు

ఏబీవీపీ

ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. జేఎన్‌యూ ఓటమితో అలజడి సృష్టించిన ఆ సంఘ కార్యకర్తలు.. ఇప్పుడు ఏకంగా అధ్యాపకులనే టార్గెట్ చేసుకున్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ గురువులను అవమానాలపాలు చేస్తున్నారు. వీరి వేధింపులు తాళలేక ఒక అధ్యాపకుడు ఇచ్చిన ఝలక్‌కు ఏం చేయాలో తెలియక సంఘటన ప్రాంతం నుంచి పారిపోయారు. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని మాందసోర్‌లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో దినేష్ గుప్త అనే వ్యక్తి అధ్యాపకునిగా పని చేస్తున్నాడు. గురువారం నాడు కళాశాలలో పాఠాలు చెబుతుండగా ఏబీవీపీకి జిల్లా అధ్యక్షుడు పవన్ శర్మ నాయకత్వంలో కార్యకర్తలు కొందరు తరగతి గది వద్దకు వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని.. ఆలస్యం ఎందుకు అవుతున్నాయంటూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం క్లాస్ పూర్తయిన తర్వాత మాట్లాడుకుందా.. ఇప్పుడు తరగతిని డిస్ట్రబ్ చేయవద్దని ఆయన కోరారు. దీంతో భారత్‌ మాతాకీ జై, వందేమాతరం స్లోగన్‌లనే అడ్డుకుంటారా.. దినేశ్‌ గుప్తా దేశ ద్రోహి అంటూ స్లోగన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. పరిస్థితి గమనించి ప్రిన్సిపల్ రవీంద్ర సోహానీ అక్కడకు వచ్చి వారికి సర్థిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దేశ ద్రోహీ.. దేశద్రోహీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూనే.. తమకు దినేష్ గుప్త క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగారు.

అయితే తాను ఏ తప్పూ చేయక పోయినా దేశద్రోహి అనడమేంటని దినేష్ గుప్త క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. అయినా ఏబీవీపీ కార్యకర్తలు క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో కోపోద్రిక్తుడైన దినేష్ గుప్తా.. కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారు. వెంటపడి మరీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటన తర్వాత దినేష్ గుప్త మాట్లాడుతూ ʹనిరసన పేరుతో నా తరగతికి ఏబీవీపీ విద్యార్థులు అడ్డుతగిలారు. వాళ్లు నన్ను దేశ ద్రోహి అంటూ స్లోగన్‌లు ఇచ్చారు. నన్ను క్షమాణ చెప్పాలని కోరారు. నా తప్పు లేకపోయినా వాళ్లు నన్ను టార్గెట్ చేసుకున్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలనే నేను వాళ్ల కాళ్ల మొక్కా. ఈ క్యాంపస్‌లో గత 32 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. వారికన్నా నాకే దేశభక్తి ఎక్కువ. దేశభక్తిని ఒకరికి చూపించాల్సిన అవసరం నాకు లేదు. విద్యార్థులు బాగా చదువుకోవాలనే నేను కోరుతున్నా. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని నేను అనుకోవడం లేదుʹ అని అన్నారు.

Keywords : దినేష్ గుప్తా, మధ్యప్రదేశ్, మాందసోర్, రాజీవ్ గాంధీ కళాశాల, ఏబీవీపీ కార్యకర్తలు, dinesh gupta, madhya pradesh, mandasore, abvp
(2019-05-16 02:00:20)No. of visitors : 824

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


ఏబీవీపీ