దళితుల్ని, ఆదివాసీలనే చంపుతారా?


దళితుల్ని, ఆదివాసీలనే చంపుతారా?

దళితుల్ని,

అరకు ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపగానే ఎక్కడలేని ʹఅస్తిత్వంʹ తన్నుకుని వచ్చి పై ప్రశ్న వేసింది. మొన్నటి దాకా ఇవే గొంతులు అధికారంలోకి వచ్చాక దళితులకు ద్రోహం చేసే ʹదళితʹ ప్రజా ప్రతినిధులను తన్నాలి, సంపాలి, నరకాలి అని అన్న మాటలూ విన్నాను. మరి మావోయిస్టులు ఇప్పుడు చేసింది అదే కదా!

ఇంతకీ ఈ ఆదివాసీ (తెగకు) ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటి? ఆదివాసీలు అరకు ప్రాంతంలో గ్రానైట్ క్వారీలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈ ఎమ్మెల్యే ఎవరి పక్షం ఉన్నాడు? కాస్త బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ ఆదివాసీ ఎమ్మెల్యే కథలు అన్నీ. అతడు రెండు క్వారీలకు సొంతదారుడు. ʹపాడేరు చౌరస్తాలో నాలుగు బిల్డింగ్ లు కట్టుకున్న వ్యక్తి. లీజు ఒప్పందం అయిపోయినా క్వారీలు నడుపగలిగిన వాడుʹ (ఈ మాటలు డేవిడ్ వి), తన సమూహం చేతనే వెట్టి చేయించుకోగల సమర్ధుడు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయించిన వాడు. అయినా కొందరి దృష్టిలో అతడిప్పుడు పేద ఆదివాసీ. సొంత జాతిని ధ్వంసం చేస్తున్న అభివృద్ధి నమూనాను మోసుకు తిరుగుతూ, ఆ విధ్వంసంలో భాగమైనవాన్ని ఇంకా అమాయక ఆదివాసీ అనే అంటున్నారు అస్తిత్వం పొడుచుకు వచ్చినవారు. ఈ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నుండి గెలిచి టీడీపీ ని తిట్టాడు. బాక్సైట్ ను ఎట్టి పరిస్థితుల్లో తవ్వనిచ్చేది లేదని శపథం పునాడు. మధ్యలో టీడీపీ లోకి జంప్ అయ్యాకా శపధాలు మర్చిపోయి యథేచ్ఛగా బాక్సైట్ తవ్వకాలకు మద్దతుదారుడయ్యాడు. స్వయంగా అనంతగిరి, హుకుంపేట మండలాల్లో రెండు క్వారీలకు యజమాని అయ్యాడు. అందులో లాటరైట్, బాక్సైట్, బ్లాక్ మెటల్ తవ్వకాలు చేస్తున్నాడు. అయినా అతడ్నీ నిరుపేద అమాయక ఆదివాసీ అనాలి అంటే అనలేనూ క్షమించండి. అతడిని ఆదివాసీ అని ʹపౌర సమాజంʹ అంటున్నా అక్కడి ఆదివాసీ సమూహనికి మాత్రం అతడో ద్రోహి.

చంపడం సరైనదా! కాదా! అని చర్చ విప్లవోద్యమం మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నది. "మేం చంపడం కోసమే పోరాటం చేయటం లేదు. మేం వ్యవసాయం చేస్తున్నాం. అందులో కలుపుమొక్కల్ని ఏరివేస్తాం. మాది వ్యవసాయక విప్లవం." అన్నాడు కొండపల్లి సీతారామయ్య. మరీ ఎందుకని దళిత, ఆదివాసీ నాయకులనే టార్గెట్ చేస్తారు అనే చర్చా ఉన్నది. నిన్న ఒక మిత్రుడు ʹలోకేశంʹ కోసగోటిని తాకే దమ్మున్నదా అన్నాడు. (ఈ ప్రశ్నలకు సమాధానం మావోయిస్టు పార్టీ మాత్రమే చెప్పగలదు)

అయితే నాదో ప్రశ్న ఈ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని చంపినందుకు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యే ఉంటుంది. అందులో రామకృష్ణతో సహా మరికొందరి పేర్లు నిందితులుగా చేర్చే ఉంటారు. చంపడం ఇండియా శిక్షా స్మృతి ప్రకారం నేరం కనుక అట్లా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంలో వింత/కొత్తేమి లేదు. దేశ పౌరులందరూ సమానమే రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతున్నది. రాజ్యాంగం/చట్టాల పట్ల విశ్వాసం ఉన్నా లేకున్నా రాజ్యాంగ, చట్టపరమైన హక్కులు పౌరులందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. పోలీసులు కూడా ఇలాగే చుట్టుముట్టి మావోయిస్టుల పేరుమీదో/ తీవ్రవాదుల పేరుమీద చంపినపుడు ఒక ఎఫ్ ఐ ఆర్ ఇలానే ఎందుకు రిజిస్టర్ చెయ్యరు అనేది ప్రశ్న.

మావోయిస్టులు అయినంత మాత్రాన చంపే హక్కు పోలీసులకు లేదు, వాళ్ళని నేరస్తులని భావిస్తే అరెస్టు చేసి శిక్షించవచ్చు. గతంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ʹఎన్ కౌంటర్ ఘటనల్లో ఐపిసి 302 కింద కేసులు పెట్టాలని తీర్పు ఇచ్చిందిʹ దానిపై ʹపోలీసు అధికారుల సంఘంʹ సుప్రీంకోర్టు కి పోతే ʹఏకవాక్యంలో స్టే ఇచ్చిందిʹ. మావోయిస్టులపై ఎమ్మెల్యేను చంపినందుకు కేసులు పెట్టినట్లుగానే మావోయిస్టులను చంపిన పోలీసులపై కేసులు పెట్టమనడం ఏమి చట్ట వ్యతిరేకం కాదు. పైగా అది హక్కు.

మీడియాను పిలిచి పబ్లిక్ గా ఎన్ కౌంటర్ చేస్తున్న కాలంలో ఈ డిమాండ్ అవసరం. ఎవర్నైనా ఇంట్లోంచి తీసుకుపోయి ఎన్ కౌంటర్ కథలు అల్లడం రాజ్యానికి కొత్తకాదు. ఆస్తిత్వంలో లేని పౌర సమాజం ఎప్పుడూ మానిఫాక్చరింగ్ కాన్సెన్ట్ కు గురి అవుతూనే ఉంటుంది. ఇంటల్జెన్షియా గోర్కీ అన్నట్లు ʹపాలకుల ఉన్ని బట్టల మీద పడిన పీడితుల నెత్తుటి మరకల్ని మాయం చేసేందుకు తెల్లని రంగు వేయడంలో నిమగ్నం అయి ఉన్నదిʹ.

చివరి నుండి మళ్ళీ మొదటికే వచ్చి ముగిస్తాను. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ అట్టడుగున ఉన్నవారిని పార్టీ ప్రధాన నాయకత్వంలోకి తీసుకువచ్చే ప్రయత్నం ఒకటి చేసిందని విన్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా చెప్పులు కుట్టుకునే కుటుంబం నుండి స్టాలిన్ అనబడు జుగాష్ వీలీ సోవియట్ అధ్యక్షుడు అయ్యాడు. అట్లానే వచ్చినవాడు ఇంకొకడు ఉన్నాడు అతడు ʹగోర్భచెవ్ʹ. ఇద్దరు అదే నేపథ్యం కలవారు అని స్టాలిన్ చెంత గోర్భచెవ్ ని కూర్చోబెట్టలేను మన్నించండి.

- అరుణాంక్

సోర్స్ : జనంసాక్షి

Keywords : ఎమ్మెల్యే హత్య, మావోయిస్టులు, అరకు ఎమ్మెల్యే, చట్టం, పోలీసులు, ఎన్‌కౌంటర్, mla murder, maoists, araku, police, encounter
(2019-05-17 07:25:29)No. of visitors : 1851

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


దళితుల్ని,