ఖైర్లాంజి నెత్తుటి గాయం


ఖైర్లాంజి నెత్తుటి గాయం

ఖైర్లాంజి

ఇది ఆధునిక కాలం. సందేహమేమి లేదు. "ఈ దేశంలో ఇంకా కులం వుందా.?" అని కొందరు నోరెళ్ళబెడతారు. ఇంకొందరు ముందుపడి కులం పోయింది కదా అని దబాయిస్తుంటారు. ఆ దబాయింపు వింటున్నప్పుడల్ల జాడిచ్చి నాలుగు తన్నాలనిపిస్తుంటుంది. కానీ, ప్రజాస్వామ్యానికి విరుద్దమని గుర్తొస్తుంది. వినమ్రతతో రెండు కాళ్ళు ఒకే చోట ఉంచుతామనుకోండి. వాళ్ళ మాటలో ఇది కంప్యూటర్ కాలం. మానవ మేధస్సు ఇంద్రధనస్సు రంగుల్లోకి అడుగులేస్తున్న కాలం. ఇది భారతదేశం. ఇంగ్లీష్&గూగుల్ పరిభాషలో ఇండియా. దేశాన్ని చదివితే ఇంతకంటే ఇంకేం తెలుస్తుంది. ఇదేశం ఒక అబద్ధం. దాని చరిత్ర అబద్ధం. వాస్తవం ప్రజలు. ప్రజలను చదివితే తప్ప వాస్తవం వెలుగులోకి రాదు. ఇది ఆకలితో గుక్కపట్టిన దేశం. కులం వేటలో నెత్తురొడ్డిన దేశం. జి.కె మాటల్లోనైతే "ఈ దేశ వాస్తవ జీవితంలో ʹఅఆʹలు ఉన్నాయి. అవే అంటరానితనం, ఆకలి." అట్లా ఆకలికి, అంటరానితనానికి హత్యలు చేయబడ్డ దేశమిది. నదులు నెత్తురును పోంగిన దేశమిది. ఈ కరుకు వాస్తవాన్ని సిగ్గుతో తలొంచుకుని చెప్పకుండా ఇంకెన్నాళ్లు మౌనంగా ఉండగలం.?

‌అది మహారాష్ట్ర. పూలే, అంబేద్కర్ లు పుట్టిన నేల. మనిషి విముక్తికి జీవితాంతం పోరాడిన నేల. ఆ నేలపైనే భండారా జిల్లా. వరి పంటకు తిరుగులేనిది. వైన్ గంగతో భూమంత పచ్చరంగేసుకున్న నేల. ఎంతోకొంతగా 90 శాతం మందికి భూములున్నాయి. ఆరుగాళం చెమట చుక్కలతో పంట చేతికొస్తుంది. ఆకలి తీరింది. కానీ, అంటరానితనం వేటాడుతూనే వుంది. అట్టా వేటకు గురైన కుగ్రామం ఖైర్లాంజి. ఇప్పుడొక మానని నెత్తుటి గాయం ఖైర్లాంజి. ఈ దేశ చిత్రపటంపై ఖైర్లాంజి ఓ నెత్తుటి చారిక.

ఖైర్లాంజిలో 181 కుటుంబాలు. 789 మంది జనాభా. నాలుగు దళిత కుటుంబాలు. అందులో ఒక్కటి భయ్యాలాల్ భోట్ మాంగే కుటుంబం. ఆర్ధికంగా సగటు గ్రామం కంటే మెరుగైంది. గ్రామం బీజేపి చేతిలో కూనరిల్లుతుంటుంది. వైన్ గంగ నది తాలుకు పెంచ్ కాలువ ప్రవాహం పొంగి పొర్లుతుంది. భోట్ మాంగే కుటుంబానికి ఐదె కరాల భూమి వుంది. సాగు నీళ్ళ దగ్గర కుల వివక్ష చూపారు. ఈసడించారు. పొలానికి ఆనుకున్న పంచాయితీ భూమిలో చిన్న గుడిసే. ఆర్థికంగా మెరుగవ్వడంతో ఇళ్ళు కట్టాలనుకున్ళారు. ఊరు అడ్డంపడ్డది. ఇళ్ళు కట్టుకోవద్దని హెచ్చరించింది. విద్యుత్ సౌకర్యం లేదు. కిరోసిన్ బుడ్డి దీపం వెలుగులోనే ముగ్గురు పిల్లల బాల్యం, చదువు కొనసాగాయి.

భయ్యాలాల్ 4, సురేఖ 9వ తరగతి దాక చదువూకున్నవాళ్ళు. తమలా కాకుండా పిల్లలను చదివించాలనుకున్నారు. పెద్దవాడు సుధీర్. బిఎ పూర్తి చేసి పొలం పనులలో సాయంగా వున్నాడు. రెండోవాడు రోషన్. డిగ్రీలో కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రియాంక. ఇంటర్ చదువుతుంది. ప్రియాంక ఊరందరిలోను ఎస్సెస్సి పరిక్షలలో టాపర్. రోజు సైకిల్ పై ఆందోగావ్ కాలేజీకి వెళ్ళొస్తుంది. ప్రియాంకను ప్రోత్సహించాల్సిన ఉరు కాస్త పగబట్టింది. అందుకు కారణం. కులం-మతం. భయ్యాలాల్ కుటుంబంఅంబేద్కర్ స్పూర్తి పొందినవాళ్ళు. బానిస మనసత్వంలోంచి బౌద్దంలోకి అడుగేసిన వాళ్ళు. భయ్యాలాల్ భూమిని ఉమ్మడి దారి కోసమని స్వాధీనం చేసుకోవలనుకున్నారు. అందుకు కొన్నిసార్లు పంటను నాశనం చేశారు. గొడవలు పడ్డారు. దాడులు చేశారు. దీంతో, భయ్యాలాల్ కుటుంబం ఠాణ మెట్లెక్కింది. కంప్లైట్ ఇచ్చారు. దాడి వాస్తవమని అందరూ నిర్ధారించారు. కానీ, ఎవరు అరెస్ట్ చేయబడలేదు. ఈ క్రమంలో భయ్యాలాల్ కుటుంబం తమ బంధువైనా సిద్దార్థ జెబియోని సాహయం తీసుకుంది. సిద్ధార్ధ సామరస్యంతో 10అడుగుల భూమిని దారి కోసం భయ్యాలాల్ చేత ఇప్పించాడు. గొడవ అంతటితో సద్దుమణిగింది. కానీ, ఊరు చల్లబడలేదు. భయ్యాలాల్ కుంటుంబంపై కన్నెర్ర చేయాలనుకుంది. అందుకు మొదట సెప్టెంబర్ 03నాడు సిద్ధార్థపై దాడి చేశారు. చేరువలోనున్న సురేఖ, ప్రియాంకలు రక్షించారు. వెంటనే రక్షణ కోసం, దాడి గురించి పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేశారు. పోలీసులు దాడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్ట పరిదిలో రాకుండా అమ్ముడుపోయారు. కానీ, తరువాతి పోరాటంతో ఒత్తిడి ఫలితంగా 12మంది అరెస్టు చేయబడ్డారు. ఆ తరువాత వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటికే భయ్యాలాల్ కుటుంబాన్ని బెదిరించి వున్నారు. పోలీసుల ఎదుటనే హతమారుస్తామనన్నారు. తమకు ప్రమాదముందని ఫిర్యాదులు చేసి వున్నారు. కానీ, పోలీసులు ఏమి స్పందించలేదు.

అది సెప్టెంబర్ 29. విడుదలైన మూక ర్యాలీగా ఖైర్లాంజికి చెరింది. భయ్యాలాల్ కుటుంబంపై దాడి చేస్తారనేది ప్రచారమైంది. పసిగట్టిన సురేఖ పక్కురులో వుండే బంధువులకు సమాచారాన్నిచ్చింది. అప్పటికే తప్పతాగిన మూక సాయంత్రం ఆరుగంటలకు ఇంటి మీద పడ్డది. ఈ దాడిలో మహిళలు ఎక్కువ భాగంలో వుండెట్లు చూసుకున్నారు. ఇంట్లోనున్న సురేఖ, ప్రియాంకలను విపరీతంగా కొడుతు బయటకు లాక్కచ్చారు. సుధీర్, రోషన్ లను కర్రలతో కొడుతు పరిగెత్తించారు. మహిళలంత తమ మనుషుత్వాన్ని వదిలి సురేఖ, ప్రియాంకలను వివస్త్రలుగా చేసి కొట్టారు. ఊరంతటి ముందు నగ్నగా తిప్పించారు. ప్రియాంకను పశువుల కొట్టంలోకి లాకెల్లారు. ఒక్కోడు పశువులు సైతం తలదించుకునేలా అత్యాచారం చేస్తు హింసించారు. హంతకులు తామొక తల్లికి పుట్టామన్నది మరచిపోయారు. సుధీర్, రోషన్ లను చిత్రహింసలకు గురిచేశారు తమ తల్లిని, చెల్లిని అత్యాచారం చేయమని దారుణంగా హింసించారు. అందరిచేత హింసించారు. అందుకు ప్రతిఘటించిన ఆ ఇద్దరు బిడ్డల మర్మంగాలను నుజ్జు నుజ్జు చేశారు. అంగాలను కోసేసి చచ్చేదాక గాల్లో తిప్పారు. నలుగురిని వురేగిస్తూ, హింసిస్తూ చంపేశారు. చనిపోయిన శవాలను ఎడ్లబండిలో వేసుకుని పెంచ్ కాలువలో పడేశారు. ఈ మారణ హోమమంతా రెండు గంటలపాటు సాగింది. దాడి జరిగేటప్పుడు ఉర్లో నుండి కేకలు వినపడగా భయ్యాలాల్ పొలంనుండి వచ్చాడు. 80మంది దాక తమ కుటుంబాన్ని హింసిస్తుంటే చూడలేకపోయాడు. అప్పటికే మూక భయ్యాలాల్ కోసం కూడా వెతుకుతుంది. దాంతో పారిపోయి పక్కూరులోని సిద్దార్థ దగ్గరికెల్లాడు. అక్కడి నుండి పోలీసులకు సమాచారం అందించారు. కానీ, ఎవరు ఓ ముందడుగు వెయ్యలేదు. దాని ఫలితంగా నలుగురు మనుషులు హత్యచేయబడ్డారు. ఈ దేశ నిఘంటవులో నాలుగురు దళితులు దారుణంగా చంపబడ్డారు.

కేసు విచారణలో కానిస్టెబుల్ కథనం ప్రకారంగా మాట్లాడుకుంటే.. "సురేఖ, ప్రియాంకల జననంగాల్లో కర్రలు చొప్పించి చీల్చేశారు. చనిపోయిన వాళ్ళపై మరోసారి అత్యాచారం చేసి పైసాచికానందాన్ని పొందరు. సుధీర్, రోషన్ ల మధ్య భాగాలను కోసేసి బండరాళ్ళతో చితకొట్టి చంపేశారు" ఇంత హింస ఆధునిక కాలంలోనే చోటు చేసుకుంది. కులం పేర ఈ దేశంలో జరిగే హింసకు ఖైర్లాంజి ప్రతిబింబం. కుల వివక్ష ఎక్కడుంది కొట్టిపడేసే దేశభక్తులకు ఖైర్లాంజి ఒ చెంపపెట్టు. ఖైర్లాంజి ఓ మరణ గీతం. నెత్తుటి గాయం. ఓ చేదు పాట. ఖైర్లాంజి గుండెల్ని పెండేసే ఘటన. ఓ సలుపుతున్న గాయం. వెంటాడుతున్న గాయమది. హంతకులకు కొమ్మ కాసిన పోలీసులు. భయ్యాలాల్ ను నేరస్తుడిలా అవమానించారు. ఖాకీలు తమ లాఠి భాషతోనే ప్రవర్తించారు. మొదట ఫిర్యాదు తీసుకోలేదు. ఎందుకంటే గతంలో ఇవ్వాల్సిన లంచం ఇవ్వలేదు. కనుక, పోలీసుల దృష్టిలో కొత్త పిర్యాధులకు భయ్యాలాల్ అవకాశం లేనివాడు. కానీ, ఘటన తీవ్రత దృష్ట చివరికి పిర్యాదు తీసుకున్నారు.శవాలను ధఫలాలుగా బయటికి తీసారు. హంతకులు డాక్టర్ పై ఒత్తిడి తెచ్చారు. అగ్రకులానికి చెందిన మహిళా డాక్టర్ మానిష్ బందేనూ తప్పించారు. కాంట్రక్ట్ బేస్ లో వున్న దళిత్ షిండేతో పోస్టుమార్టం చేయించారు. తప్పుల తడకగా చేయించారు. చిధ్రంచేయబడ్డ అవయవాలను ఫొరెన్సిక్ పంపకుండా తూతుమంత్రంగా ముగించారు. పోస్ట్ మార్టంలోను అత్యాచారం అని రాయలేదు. ఎఫ్.ఐ.ఆర్ లోను అత్యాచారం, దళితులపై దాడి అని రాయకుండా పోలీసులు అమ్ముడుపోయారు. అక్కడి పత్రికలు హంతకూల భాషనే మాట్లాడాయి. ఎందుకంటే అవి అగ్రకులాలే చేతుల్లోవే కనుక. ఈ ఘటన అక్రమ సంభందం వల్లనేనని సిగ్గులేకుండా రాశాయి.

ఈ దేశంలో ప్రధాన పత్రికలు హంతకుల పక్షమే కాని, హతుల పక్షం కాదని తేల్చిచెప్పాయి. ఆ నలుగురి హత్యలపై అనేక అబద్ధాలు సృష్టించబడ్డాయి. ప్రజా ఉద్యమం ఒక్కో అబ్బద్దాన్ని చెరిపేస్తు వచ్చింది. విశాల ప్రజాస్వామిక సంస్థలు చాల మిలిటెన్సిగా పోరాడాయి.ఆందోళనకారులపై నక్సలైట్లంటు పోలీసులు కాల్పులు జరిపారు. ఒక మనిషి చంపబడ్డాడు. రాజ్యం ఉద్యమాన్ని అణచాలనుకుంది. ప్రజలు కదిలారు. రాజ్యం మూసుకు కూర్చుండిపోయింది. హతుల పక్షం దేశమంత నిలబడింది. సెప్టెంబరు 2008 లో, ఆరుగురు దోషులకు మరణ శిక్ష విధించారు. అయితే, కొద్ది రోజుల్లోనే జులై 14, 2010 న, హైకోర్టు కఠిన కారాగార శిక్షగా మార్పు చేసింది. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో భయ్యలాల్ కూడా మరణించాడు.
- అరవింద్

Keywords : ఖైర్లాంజి, నెత్తుటి గాయం, అగ్రకుల మూకలు, దళితుల దారుణ హత్య, khairlanji,
(2019-02-17 02:34:06)No. of visitors : 603

Suggested Posts


0 results

Search Engine

రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
more..


ఖైర్లాంజి