భీమా-కోరేగావ్ కేసు : నవ్‌లఖా నిర్బంధాన్ని కొట్టేసిన హైకోర్టు


భీమా-కోరేగావ్ కేసు : నవ్‌లఖా నిర్బంధాన్ని కొట్టేసిన హైకోర్టు

భీమా-కోరేగావ్

ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారు, భీమా-కోరేగావ్ అల్లర్లతో సంబంధాలున్నాయనే అభియోగాలతో గత నెలలో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి ఐదుగురు హక్కుల కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వారిని గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. అయితే ఈ అక్రమ నిర్బంధాన్ని సవాలు చేస్తూ గౌతమ్ నవ్‌లఖా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జస్టీస్ ఎస్ మురళీధర్, జస్టీస్ వినోద్ గోయల్‌లతో కూడిన ధర్మసనం సోమవారం ఆయనను విడుదల చేయమంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు సందర్భంగా ధర్మాసనం..ʹఈ కేసులో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ రిమాండ్‌ ఆర్డర్‌ ఇవ్వలేదు. అలాగే పిటిషనర్‌ 24 గంటలకు మించి ఎక్కువ కాలం పాటు గృహ నిర్బంధం ఎదుర్కొన్నారు. ఇది చట్ట వ్యతిరేకం. అలాగే ఈ కేసులో రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలు కూడా విస్మరించబడ్డాయి. కాబట్టి ఈ అంశానికి స్వస్తి పలకాల్సి ఉంది. కాబట్టి ఈరోజుతో ఆయన గృహ నిర్బంధం నుంచి విముక్తులయ్యారుʹ అని కీలక వ్యాఖ్యలు చేసింది.

గత నెల గౌతమ్‌తో పాటు రచయిత వరవరరావు, పౌర హక్కుల నేతలు వెర్నన్ గొన్జాల్వేస్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరాలు కూడా గృహనిర్బంధాన్ని ఎదుర్కుంటున్నారు. గౌతమ్ నవ్‌లఖా తీర్పు నేపథ్యంలో మిగిలిన వారు కూడా కోర్టులో అప్పీలు చేసుకొని నిర్బంధం నుంచి విముక్తులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ విషయంలో కింది కోర్టును ఆశ్రయించవచ్చనే తీర్పు కూడా ఇచ్చింది.

Keywords : భీమా కోరేగావ్, హక్కుల కార్యకర్తలు, వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా, ఢిల్లీ హైకోర్టు, విడుదల, గృహ నిర్బంధం, bhima koregaon, rights activists, gowtham navlakha, delhi high court
(2019-03-16 05:19:59)No. of visitors : 571

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


భీమా-కోరేగావ్