70వేల మంది రైతులపై పోలీసుల అరాచకం.. బాష్పవాయు గోళాలు.. వాటర్ క్యానన్‌ల ప్రయోగం.. వందలాది మందికి గాయాలు


70వేల మంది రైతులపై పోలీసుల అరాచకం.. బాష్పవాయు గోళాలు.. వాటర్ క్యానన్‌ల ప్రయోగం.. వందలాది మందికి గాయాలు

70వేల

దాదాపు 70 వేల మంది రైతులు ఎంతో శాంతియుతంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుంచి పది రోజుల క్రితం ప్రారంభించి మహాపాదయాత్రగా తరలి వస్తున్నారు. రుణమాఫీ చేయాలని, ఉచిత విద్యుత్ అందించాలని కోరుతూ ʹకిసాన్ క్రాంతి ర్యాలీʹ పేరుతో ఢిల్లీలోని కిసాన్ ఘా‌ట్‌కు ట్రాక్టర్లు, ట్రాలీలు, బండ్లు, నడుస్తూ వస్తున్న వీరు ఈ రోజు ఢిల్లీలో ప్రవేశించాల్సి ఉంది. అయితే వీరి రాకను ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి రైతులు రాజధానిలోకి రాకుండా ఢిల్లీ-యూపీ సరిహద్దులో నిలిపేశారు. మేం శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తున్నాం.. గత పది రోజులుగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగులేదు కదా మమ్మల్ని వెళ్లనీయండీ అంటూ భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు పోలీసులను కోరారు. అయినా సరే పోలీసులు వారిని అనుమతించలేదు. కొంత మంది రైతులు ట్రాక్టర్లతో బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ మొదలు పెట్టారు. అక్కడి నుంచి వెంటనే వెనుదిరగమంటూ వాటర్ కానాన్‌లతో వారిని చెదరగొట్టారు. ఇష్టానుసారంగా భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లే గన్లు పట్టుకొని బెదిరించడం గమనార్హం.

పోలీసుల దౌర్జన్యానికి వందలాది మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు విరిగిపోయి.. ఒళ్లంతా గాయాలతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇంత జరుగుతున్న పోలీసులు లాఠీచార్జి ఆపలేదు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కూడా వారిని అడ్డుకోవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేసినా రైతులను మాత్రం అనుమతించలేదు. ఈ ఘటన తర్వాత బీకేయూ నేత నరేష్ మాట్లాడుతూ..ʹమమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆపారు? మేము క్రమశిక్షణతో శాంతయుతంగా నిరసన ర్యాలీ చేస్తున్నాం. మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి? పాకిస్థాన్‌కో లేదా బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలా?ʹ అని ఆవేశంగా అన్నారు. కనీస మద్దతు ధర, డీజిల్ ధరల తగ్గింపు, ట్రాక్టర్లను కమర్షియల్ జాబితా నుంచి తొలగింపు, రుణమాఫీల గురించి అడిగినందుకే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని గత పది రోజులుగా ర్యాలీలో పాల్గొన్న ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

శాంతియుతంగా తమ హక్కులు, డిమాండ్ల కోసం పాదయాత్ర చేసి ఢిల్లీ వరకు తమ ఆవేదన తెలియజేయాలనుకున్న రైతులపై పోలీసులు, ప్రభుత్వం చేసిన దౌర్జన్యం, దాడిని ʹఅవని న్యూస్ʹ తీవ్రంగా ఖండిస్తోంది.


Keywords : కిసాన్ క్రాంతి ర్యాలీ, రైతులు, ఢిల్లీ, లాఠీ చార్జి, ఢిల్లీ పోలీసులు, kisan kranti rally, farmers, delhi, police, lathi charge,
(2018-11-14 20:00:53)No. of visitors : 645

Suggested Posts


0 results

Search Engine

తెలంగాణ వ‌స్తే ఏమొచ్చింది? - చింత‌కింది కాశీం
తిత్లీ బాధితులకు బియ్యం పంచుతుంటే అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలి : విరసం
పదమూడేండ్లుగా ఓటెయ్యని గ్రామం.. ఈ సారి కూడా ఓటెయ్యొద్దని తీర్మానించుకున్నారు..!
ఆర్టికల్497, శబరిమల తీర్పులు.. ప్రగతిశీలమైనవేనా ?
అరుణ్ ఫెరీరాను కస్టడీలో విచారణ పేరుతో చిత్రహింసలు పెడుతున్న పూణే పోలీసులు
కిడారి, సోమ హత్యలపై మావోయిస్టు పార్టీ 14 పేజీల లేఖ విడుదల
ʹమేదావులు, హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలిʹ
కొమురం భీం వర్ధంతి ఎన్నడు ? అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ?
Maoists call for boycott of Telangana polls
అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులు
గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల‌ మృతదేహం కోసం పోరాటం
హిందుత్వ హింసను, రాజ్య హింసను సమర్థిస్తారా - ‍ స్వామి అగ్నివేశ్, సందీప్ పాండే
అక్రమాల యుద్ధ విమానాల రెక్కల చప్పుడు - ఎన్. వేణుగోపాల్
CBI carried out ʹbiasedʹ investigation, says JNU student Najeeb Ahmedʹs mother; claims probeʹs purpose was to shield assaulters
CPI Maoist Announces ʹOperation Ghamasanʹ To Counter Governmentʹs ʹOperation Samadhanʹ
నజీబ్ లేడా.. సీబీఐకి కూడా దొరకలేదు
దండకారణ్యంలో నుల్కతోంగ్ నిజాలు
ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభ‌
ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి
భీమా-కోరేగావ్ కేసు : నవ్‌లఖా నిర్బంధాన్ని కొట్టేసిన హైకోర్టు
ʹʹహక్కుల కార్యకర్తల అరెస్టుల‌ను ఖండించిన మావోయిస్టు పార్టీ - దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపుʹʹ
హిట్లర్ నిజంగానే తిరిగొచ్చాడు!!
The Maoist party condemned the arrests of rights activists and called for a national agitation to fight against the arrests
Bima Koregaon Case : Delhi High Court frees activist Gautam Navlakha from house arrest
Maharashtra Government withdraws rioting cases against Sambhji Bhide, BJP and Shiv Sena workers
more..


70వేల