హిందుత్వ హింసను, రాజ్య హింసను సమర్థిస్తారా - ‍ స్వామి అగ్నివేశ్, సందీప్ పాండే


హిందుత్వ హింసను, రాజ్య హింసను సమర్థిస్తారా - ‍ స్వామి అగ్నివేశ్, సందీప్ పాండే

హిందుత్వ

(సామాజిక కార్యకర్తలు స్వామి అగ్నివేశ్, సందీప్ పాండేలు రాయగా కే.సురేష్ అనువాదం చేసిన‌ ఈ వ్యాసం అక్టోబర్ వీక్షణం సంచికలో ప్రచురించబడినది)

2018 ఆగస్టు 28న సుధ భరద్వాజ్‌, గౌతమ్‌ నవ్లాఖా, వరవరరావు, వెర్నన్‌ గోంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాలపై పెద్ద ఎత్తున పోలీసు చర్య చేపట్టారు. దీనికంటే ముందు ఆచార్య షోమా సేన్‌, న్యాయవాది సుధీర్‌ గాడ్లింగ్‌, సుధీర్‌ ధావ్లే, మహేష్‌ రౌత్‌, రోనా విల్సన్‌లను జూన్‌ 6న పోలీసులు అరెస్టు చేశారు. దీనికంటే కూడా ముందు డా. బినాయక్‌ సేన్‌, సోనీ సోరీ, అజయ్‌ టి.జి., ఆచార్య జి.ఎన్‌. సాయిబాబా, ప్రశాంత్‌ రాహీలను అరెస్టు చేశారు. ఈ కార్యకర్తలందరికీ మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి పన్నాగం పన్నుతున్నారు కాబట్టి మావోయిస్టులను ప్రమాదకరమైన వాళ్లుగా భావిస్తారు. ఇటీవల అరెస్టు చేసిన అయిదుగురు కూడా ప్రధాన మంత్రి మోడీని చంపడానికి ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు. సమాజంలో అంచులకు నెట్టివేయబడ్డ వర్గాల హక్కుల కోసం నిబద్ధతతో పనిచేసే ఈ కార్యకర్తలపై ఇటువంటి అభియోగం చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఒక హత్యకు ప్రణాళిక తయారు చేసేటంత సమయం వీళ్లకి లేదు. పోలీసు చర్యను సమర్థించుకోవడానికి ఈ కల్పిత ఆరోపరణ చేశారు.

హింసను సమర్థిస్తారు కాబట్టి మావోయిస్టులను చట్టవిరుద్ధమైన వాళ్లుగా పరిగణిస్తారు. ప్రజాస్వామ్యంలో ఏ రకమైన హింసనూ సమర్థించలేం. అయితే, ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది - హింస చెడ్డదైతే మావోయిస్టుల హింసకు లేని చట్టబద్ధత ఇతర హింసలకు ఎలా వస్తుంది?

మితవాద పక్ష చరిత్ర అంతా హింసాత్మక ఘటనలతో నిండి ఉంది. అహింసా సూత్రాన్ని జీవించిన వ్యక్తిని, ప్రపంచవ్యాప్తంగా భారతదేశమంటే గుర్తొచ్చే వ్యక్తిని హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి హత్య చేశాడన్న విషయాన్ని ఎలా మరిచిపోతాం? హిందుత్వ సిద్ధాంత మూల పురుషులైన హెగ్డెవార్‌, గోల్వాల్కర్‌, సావార్కర్‌లకు బదులు నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ల పేర్లు వాడుకోడానికి ఎంతగా ప్రయత్నించినా ఈ పాపం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ విముక్తం కాలేదు.

1992 డిసెంబరు 6న బాబ్రీ మసీద్‌ని కూల్చివేయడం ద్వారా ఆర్‌.ఎస్‌.ఎస్‌., భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌లు 1947 దేశ విభజన తరువాత దేశంలో మళ్లీ మతకల్లోలాల జ్వాలలను రాజేశాయి. తమ రాజకీయ లబ్ధికోసం హిందూ ముస్లింల మధ్య అఘాతాన్ని సృష్టించాయి. దేశ రాజకీయాలకు, సామాజికతకు ఈ ఘటన తీరని నష్టం చేసింది. బాబ్రీ మసీద్‌ కూల్చివేత సమయంలో 17 మంది ముస్లింలను సజీవంగా దహనం చేశారు, ఆ తరువాత చోటు చేసుకున్న మతకలహాలలో చాలా మంది చనిపోయారు.

భారతదేశంలో ఉగ్రవాదం ప్రవేశించడానికి బాబ్రీ మసీద్‌ కూల్చివేతే కారణం. భారతదేశంలో మొదటి ఉగ్రవాద దాడి, అప్పట్లో వాటిని సీరియల్‌ బాంబు దాడులు అనేవాళ్లు, బాబ్రీ మసీద్‌ కూల్చివేతకి ప్రతీకారంగా 1993లో ముంబైలో జరిగింది. హిందుత్వ సిద్ధాంతాన్ని అనుసరించేవాళ్లు కూడా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌., హిందుత్వ సిద్ధాంతాల ప్రేరణతో పనిచేస్తున్న అభినవ భారత్‌తో సంబంధం ఉన్న పదవీ విరమణ చేసిన మేజర్‌ రమేష్‌ ఉపాధ్యాయ, సైన్యంలో పనిచేస్తున్న లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌లు తమ దేశంలోనే బాంబు పేలుళ్ల కుట్రలో భాగస్వాములయ్యారంటే ఇంతకంటే పిరికిపందల చర్య మరొకటి ఏముంటుంది? 2006 సెప్టెంబర్‌ 8న మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన పేలుళ్లలో 38 మంది చనిపోయారు, 2008 సెప్టెంబర్‌ 29న గుజరాత్‌లోని మాలేగావ్‌, మొదాసాలో జరిగిన పేలుళ్లలో 10 మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలలో అభినవ్‌ భారత్‌ సంస్థలో పనిచేస్తున్న వాళ్లని నిందితులుగా చేర్చారు. 2007 ఫిబ్రవరి 18న జరిగిన బాంబు పేలుడులో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 68 మంది చనిపోయారు. అదే సంవత్సరం మే 18న హైదరాబాదులోని మక్కా మసీద్‌ బయట జరిగిన బాంబు పేలుడులో 9 మంది చనిపోయారు, పోలీసుల కాల్పుల్లో మరో 5 మంది చనిపోయారు. ఈ పేలుళ్లలో కూడా అభినవ్‌ భారత్‌ పాత్ర ఉందని భావిస్తున్నారు. 2017 అక్టోబర్‌ 11న అజ్మేర్‌లోని క్వాజా మొయినుద్దీన్‌ చిష్టీ దర్గావద్ద జరిగిన బాంబు పేలుడులో 19 మంది చనిపోయారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.తో సంబంధాలు ఉన్న భవేష్‌ పటేల్‌, దేవేంద్ర గుప్తాలకు ఈ ఘటనలో నేరస్తులుగా జీవిత ఖైదు పడింది.

2002లో గోద్రా రైల్వే స్టేషను బయట సబర్‌మతీ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీలో మంటలకు ప్రతీకారంగా చెలరేగిన మతకల్లోలాలలో దాదాపు రెండు వేల మంది చనిపోయారు, వీళ్లల్లో అధిక సంఖ్యాకులు ముస్లింలు. బిజెపి, విహెచ్‌పి, భజరంగ్‌ దళ్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇందులో బహిరంగంగా పాల్గొని హింసను ప్రేరేపించారు. గుజరాత్‌లో అప్పుడు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇందులో ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర ఉందని నమ్మారు. హింసను ఆపడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది నిజం. పాలనలో ధర్మ సూత్రాలను పాటించాలని అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి నరేంద్ర మోదీని అభిశంసించారు. ఈ హింసలో నరేంద్ర మోదీ అనుమానాస్పాద పాత్ర కారణంగా అతడు ప్రధాన మంత్రి అయ్యేవరకు అమెరికా అతడికి వీసా ఇవ్వలేదు.

2013-17 మధ్య సనాతన్‌ సంస్థతో సంబంధాలు ఉన్నవాళ్లు చేసిన దాడులలో డా. నరేంద్ర దభోల్కర్‌, గోవింద్‌ పన్సారే, ఆచార్య ఎం. ఎం. కల్బుర్గి, పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌లు చనిపోయారు. హిందుత్వ సిద్ధాంతాలను విమర్శించినందుకు వీళ్లందరు హత్యలకు గురయ్యారు.

నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీలో అధికారానికి వచ్చిన తరువాత హింసలో ఒక కొత్త ధోరణి చోటు చేసుకుంది. ఆవులను చంపారన్న అనుమానంతో, లేదా ఆవులను రవాణా చేస్తున్నందుకో ముస్లింలను మూకదాడిలో చంపడం మొదలయ్యింది. దాద్రి దగ్గర బిసద అన్న గ్రామంలో ఆవుని దొంగిలించి, చంపాడన్న అనుమానంతో మొహమ్మద్‌ అఖ్‌లాఖ్‌ని 2015 సెప్టెంబర్‌ 28న చంపేశారు. ఈ దాడికి ముందు ఒక గుడిలోని మైకు ద్వారా ప్రజలను సమావేశపరిచారు. జార్ఖండ్‌లోని లతేహర్‌లో 2016 మార్చి 18న 32 ఏళ్ల మజ్లుం అన్సారి, 15 ఏళ్ల ఇంతియాజ్‌ ఖాన్‌ 8 ఎడ్లను తోలుకుని వెళుతుండగా గోసంరక్షక దళానికి చెందినవాళ్లు దాడిచేసి, చంపేసి వాళ్ల శవాలను చెట్టుకి వేలాడదీశారు.

2017 ఏప్రిల్‌ 1న హర్యానాలోని మేవత్‌కి చెందిన 55 ఏళ్ల పెహ్లు ఖాన్‌ మరో ఐదుగురితో కలిసి రాజస్తాన్‌లో ఆవులు, దూడలు కొనుక్కుని వస్తుండగా ఆల్వార్‌ దగ్గర హిందుత్వ వాదులు అతడిని వాహనంలోంచి బయటకు లాగి అతడి కొడుకు కళ్లముందే కొట్టి చంపేశారు. ఆవులను కొన్న రశీదు, పాడి కోసం వాటిని తీసుకెళుతున్నట్లు పెహ్లు ఖాన్‌ వద్ద పత్రాలు ఉన్నాయి.

2018 జూలై 20న హర్యానాకే చెందిన రక్బర్‌ ఖాన్‌ రెండు ఆవులను తీసుకెళుతుండగా అల్వార్‌ దగ్గర ఒక గుంపు అతడిపై దాడి చేసింది, ఆసుపత్రికి వచ్చేసరికే అతడు చనిపోయాడని ప్రకటించారు. రక్బర్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికంటే ముందు ఆ ఆవులను గోశాలకు చేర్చడం ముఖ్యమని పోలీసులు అనుకున్నారు.

నరేంద్ర మోదీ ఢిల్లీలో అధికారం చేపట్టిన తరువాత కొత్త తరహా ఘటనలు మొదలయ్యాయి. హిందుత్వ వాదులైన యువత మోటరుసైకిళ్లకు కాషాయ, జాతీయ జెండాలు పెట్టుకుని ముస్లిం, దళిత ప్రాంతాల గుండా ఊరేగింపుగా వెళ్లడానికి పట్టుపట్టి, హింసను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. 2017 మే 5న దళిత ప్రాంతంలో ఉన్న మహరాణా ప్రతాప్‌ విగ్రహానికి దండ వేసే మిషతో మోటారుసైకిల్‌ ఊరేగింపు తీశారు, ఆ తరువాత జరిగిన హింసలో ఒక రాజ్‌పుత్‌, ఒక దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో సంబంధం ఉందనే జాతీయ భద్రతా చట్టం కింద దళిత యువ నాయకుడైన చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావణ్‌ని ఒక సంవత్సరానికి పైగా జైలులో ఉంచారు. ప్రతి సంవత్సరం ముస్లిం యువత గణతంత్ర దినోత్సవం జరుపుకునే కాస్‌గంజ్‌లోని అబ్దుల్‌ హమీద్‌ చౌక్‌ గుండా 2018 జనవరి 26న హిందుత్వవాదులైన యువత మోటరుసైకిల్‌ ఊరేగింపు తీయడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంగా జరిగిన హింసలో చందన్‌ గుప్తా అనే యువకుడు చనిపోయాడు. బరేలీ జిల్లా మ్యాజిస్ట్రేటు అయిన రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ట్విట్టర్‌లో ఇలా పెర్కొన్నారు, ʹఒక వింత సాంప్రదాయం చోటు చేసుకుంటోంది. ముస్లింలు నివసిస్తున్న ప్రాంతం గుండా బలవంతంగా ఊరేగింపు తీసి పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అన్న నినాదాలు చేస్తున్నారు. వాళ్లు పాకిస్తాన్‌ వాసులా?ʹ

ఇవన్నీ ముందుస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన సంఘటనలే అన్నదాంట్లో అనుమానం లేకుండా ఉండడానికి కేంద్ర మంత్రి అయిన జయంత్‌ సిన్హా 2018 జులై 7న మూక హత్యలో నిందితులై, బెయిలు మీద బయటకు వచ్చిన గోసంరక్షక దళంలోని 8 మందికి దండలు వేసి సత్కరించారు. పెహ్లు ఖాన్‌ హత్యలో నిందితుడైన విపిన్‌ యాదవ్‌ని 2017 ఏప్రిల్‌ 19న సాధ్వి కమల్‌ దీది సన్మానించి అతడిని భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సుఖదేవ్‌లతో పోల్చింది. తమ సభ్యుల హింసను సంఘ్‌ పరివారం సమర్థించడమే కాకుండా దానిని ఘనకార్యంగా పొగుడుతోందని అర్థమౌతోంది.

ఈ ఘటనలకి తోడు రాజ్యహింస ఉండనే ఉంది. 2004 జులై 11న మణిపూర్‌లో 34 సంవత్సరాల తంగజం మనోరమని అస్సాం రైఫిల్స్‌కి చెందిన పారామిలటరీ దళసభ్యులు అత్యాచారం చేసి, చంపేశారు. మణిపూర్‌లో భద్రతా దళాలు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్లపై విచారణ చేపట్టాలని సిబిఐని 2017 జులై 15న సప్రీం కోర్టు ఆదేశించింది. 2018 మే 22న తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీ అయిన స్టెర్‌లైట్‌ వల్ల కలుగుతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న 20,000 మంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపగా 13 మంది చనిపోయారు. హింస చట్టవిరుద్ధమని పౌర సమాజం భావిస్తుంటే అన్ని రకాల హింసలను ఖండించాలి, ఈ అన్ని రకాల హింసను అరికట్టడానికి ప్రభుత్వం పూనుకోవాలి.

Keywords : swamy agnivesh, sandeep panday, varavararao, sudha bharadvaj,
(2020-06-05 01:52:16)No. of visitors : 2008

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

వరవరరావు బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్ళీ వాయిదా
రాజస్తాన్ లో అమెరికా లాంటి ఘటన....వ్యక్తిని కిందపడేసి మోకాలితో తొక్కిన పోలీసులు
రాబోయేవి మరింత దుర్భర దినాలు
అమెరికాలో వివక్ష గురించి మాట్లాడేవారు భారత్ లో వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు ?
తెలంగాణ మంత్రులకు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ‌ !
వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
more..


హిందుత్వ