కిడారి, సోమ హత్యలపై మావోయిస్టు పార్టీ 14 పేజీల లేఖ విడుదల


కిడారి, సోమ హత్యలపై మావోయిస్టు పార్టీ 14 పేజీల లేఖ విడుదల

కిడారి,

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టు పార్టీ ప్రజాకోర్టు నిర్వహించి శిక్షించిందని మావోయిస్టు పార్టీ ఏవోబీ అధికార ప్రతినిధి జగబంధు స్పష్టం చేశారు. ఉనికి కోసమే వారి హత్యలు చేశారనే దాంట్లో నిజం లేదని.. మావోయిస్టు పార్టీకి స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో కూడిన 14 పేజీల ఇంటర్వ్యూను పార్టీ విడుదల చేసింది. వారిద్దరిని ఎందుకు టార్గెట్ చేసి చంపాల్సి వచ్చిందో ప్రజా కోర్టులోనే మా పీఎల్‌జీఏ యూనిట్ ఘటనా స్థలంలోనే ప్రజా కోర్టు నిర్వహించి ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకు వివరించామని.. కాని ఆ విషయాలు బయటకు పొక్కకుండా ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కైయ్యారని జగబంధు చెప్పారు. కిడారి పార్టీ మారడానికి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న మాట వాస్తవం.. అంతే కాకుండా ఆ నియోజకవర్గంలో జరిగే కాంట్రాక్టులు, పనులపై 10 నుంచి 15 శాతం కమిషన్ వారిద్దరికీ ముడుతుందని అన్నారు.

డుంబ్రిగూడ మండలంలో పోలీస్ స్టేషన్ లేకపోవడం వల్లే అక్కడ ప్రదేశాన్ని ఎంచుకున్నామన్నది కూడా వాస్తవ దూరమేనని జగబంధు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లు ఉన్నా.. మా చర్యలకు అవి ఏమాత్రం ఆటంకం కలగదన్న విషయం గతంలో జరిగిన సంఘటనలే నిరూపిస్తున్నాయని చెప్పారు. చత్తీస్‌ఘడ్‌లో అడుగడుగునా పోలీస్ బలగాలు ఉన్నా కూడా మా పీఎల్‌జీఏ పథకం ప్రకారం మాటు వేసి దెబ్బతీసింది.. తీస్తోందని గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలను చేపట్టబోమన్న ప్రభుత్వ మాటలు సత్యదూరమన్నారు. ఇవన్నీ ఎన్నికల స్టంట్లని అన్నారు.

మా దగ్గర ఎలాంటి హిట్ లిస్టులు లేవని.. హిట్ లిస్ట్‌ల సృష్టి, సాంప్రదాయం అంతా పోలీసు అధికారులదే అని స్పష్టం చేశారు. గిరిజనుల కోసం పోరాటం మా నినాదమని అంటూనే గిరుజనులను అన్యాయంగా చంపేశారన్న మందకృష్ణ వ్యాఖ్యలపై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదివాసీ నేతలను చంపటంపై ఆదివాసీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది వాస్తవం కాదు.. మన్యం ఆదివాసీ, పీడిత ప్రజానికం వీరి పీడ విరగడయ్యిందని పండుగ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

పూర్తి ఇంటర్వ్యూ..


Keywords : కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ, హత్యలు, మావోయిస్టు పార్టీ, లేఖ, జగబంధు, ఇంటర్వ్యూ, kidari someshwar rao, siveri soma, maoist party, jagabandhu, interview
(2019-03-23 02:05:13)No. of visitors : 914

Suggested Posts


0 results

Search Engine

The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
more..


కిడారి,