అరుణ్ ఫెరీరాను కస్టడీలో విచారణ పేరుతో చిత్రహింసలు పెడుతున్న పూణే పోలీసులు


అరుణ్ ఫెరీరాను కస్టడీలో విచారణ పేరుతో చిత్రహింసలు పెడుతున్న పూణే పోలీసులు

అరుణ్

భీమా కోరేగావ్‌లో జరిగిన అల్లర్లకు కారకులంటూ ఆరోపిస్తూ పూణే పోలీసులు అరెస్టు చేసిన హక్కుల కార్యకర్త అరుణ్ ఫెరీరాను కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయం స్వయంగా అరుణ్ ఇవాళ పూణే సెషన్స్ కోర్టులో తెలిపాడు. అరుణ్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు ఇంటరాగేషన్ సమయంలో ముఖంపై పిడిగుద్దులు గుద్దడమే కాకుండా, చెంపలపై తీవ్రంగా కొట్టారు. దీంతో అరుణ్ కంటికి గాయం కూడా అయ్యింది. నవంబర్ 4వ తేదీన ఈ ఘటన జరిగిందని.. తనను 5వ తేదీన ఆసుపత్రికి తీసుకెళ్లారని కోర్టులో అరుణ్ చెప్పారు. ఒక విచారణ అధికారి ఐఏపీఎల్(ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్) సంస్థ గురించి వివరాలు చెప్పమంటూ కంటిపై కొట్టాడని జడ్జికి చెప్పారు. అరుణ్‌తో పాటు హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, వెర్నాన్ గొన్జాల్వేస్ కూడా ఇదే కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఇలా అరుణ్‌పై విచారణ పేరుతో దాడి చేయడం పోలీసుల కర్కశత్వాతన్ని తెలియజేస్తోంది.. అసలు కోర్టులు ఉన్నాయా..? విచారణ ఖైదీల హక్కుల సంగతేంటి..? విచారణ పేరుతో పోలీసుల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా ఫట్టించుకునేవాళ్లే లేరా..? కస్టడీలో అరుణ్‌ను చిత్రహింసలు పెట్టిన పోలీసులపై అసలు చర్యలు తీసుకుంటారా..?

Keywords : భీమా కోరేగావ్, అరుణ్ ఫెరీరా, పూణే పోలీసులు, కస్టడీ, చిత్రహింసలు, bhima koregaon, anun ferira, pune police,
(2019-03-13 09:20:06)No. of visitors : 415

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


అరుణ్