తిత్లీ బాధితులకు బియ్యం పంచుతుంటే అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలి : విరసం

తిత్లీ

తిత్లీ తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతున్న ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని విరసం తీవ్రంగా ఖండించింది. మన దేశంలో బియ్యం పంచడం ఎప్పటి నుండి తీవ్రవాద కార్యకలాపం అయ్యింది? తుఫాను బాధితులకు బియ్యం పంచి రెచ్చగొడుతున్నారని ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ సెక్షన్ కింద కేసులు పెట్టడం కన్నా సిగ్గుమాలినతనం ఇంకొకటుందా? ప్రజలకు బియ్యం పంచితే, పరామర్శలు చేస్తే చంద్రబాబుకు భయం ఎందుకు? పరామర్శతో పాటు ప్రకృతి వైపరీత్యాల వెనకున్న దోపిడీ, దివాలాకోరు రాజకీయాలను విమర్శిస్తారనా? వరుస తుఫాన్లతో అల్లాడుతున్న ఉత్తరాంధ్రను చంద్రబాబు ప్రభుత్వం వెలివేసిందా? సహాయానికి ఎవరూ వెళ్లకూడదా? నిర్లక్ష్యాన్ని గురించి అడక్కూడదా? అని విరసం ప్రశ్నించింది.

శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు పంచుతున్న వివిధ ప్రజాసంఘాల నాయకుల అరెస్టు చేసి వారిపై మోపిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. అరెస్టు చేసిన PDM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ABMS రాష్ట్ర అధ్యక్షులు అంజమ్మ , PKM నాయకులు నీలకంఠు , కోదండం, అరుణ తదితరులను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని విరసం డిమాండ్ చేసింది.

Keywords : విరసం, తిత్లీ బాధితులు, నిత్యావసర సరుకులు, అక్రమ కేసులు, ప్రజా సంఘాలు, యూఏపీఏ, UAPA, Titli, Activists, Arrest
(2024-04-24 18:57:27)



No. of visitors : 2172

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తిత్లీ