నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
కవులు ఎందరో ఉంటారు. కానీ కవిత్వ సారం తెలిసి రాసే వాళ్లు కొందరే ఉంటారు. వివి వ్యక్తిత్వం ఆయన కవిత్వమే. ఆయన చైతన్యం నక్సల్బరీయే. ఈ రెంటి అభేద సారమే ఆయన ఆకర్షణ. కవిగా ఆకర్షణీయ వ్యక్తిత్వంగల గౌరవనీయ కవులు మనకు ఎందరో ఉన్నారు. కవిత్వమంటే జీవితమే అని చెప్పిన కవులు కూడా ఉన్నారు. వివికి కవిత్వం అంతకంటే ఇంకా ఎక్కువ. ఆయనకు కవిత్వమంటే ఆచరణే. అత్యున్నత తాత్వికార్థంలో మార్క్స్ చెప్పిన మానవ ఆచరణలో కవిత్వం భాగమని వివి నమ్మకం. అందుకే ఆయన వ్యక్తిత్వం ఆర్షణీయమైనదే కాదు, ప్రభావశీలమైనది.
ఎంతగానంటే వచన కవిగా ఆయనకు ఉన్నంత మంది పాఠకులు మరెవరికీ ఉండరు. ఏ పత్రికలోనో ఆయన కవిత్వాక్షరాలు కనిపించినా, అనేక పుస్తకాల దొంతరల్లో ఆయన కవితా సంపుటం కనిపించినా ప్రేమగా వివిసారు అని ముట్టుకొనే వాళ్లు అసంఖ్యాకంగా ఉంటారు. వాళ్లు ప్రాథమికంగా కవితా పాఠకులు కూడా కాకపోవచ్చు. కొండొకచో అసలు పాఠకులే కాకపోవచ్చు. కానీ అలా చూసి ముందు ఆయనతో కనెక్టవుతారు. లేదా తమ అభిమానాన్ని ఆ అక్షర స్పర్శతో పునర్మించుకుంటారు. వాళ్లలో అనేకమంది తర్వాత్తర్వాత నిజంగానే ఆయన కవితా పాఠకులుతారు. సాహిత్య ప్రపంచంలో సంచారులవుతారు. విప్లవోద్యమ వ్యాఖ్యాతగా ఆయన శ్రోతల్లో ఉండే డైవర్సీటీ మరే వక్తకూ ఉండనట్లే ఆయన కవితా పాఠకుల్లో కూడా అపారమైన వైవిధ్యం ఉంటుంది.
అంటే అనేక వైపుల నుంచి తన పాఠకులను తానే తయారు చేసుకొనే కవిత్వం ఆయనది. కవిత్వమంటే ఆచరణ అయినందువల్లే ఆయన కవిత్వానికి అంత శక్తి వచ్చింది. కవిత్వమంటే విప్లవం కావడం వల్లే ఆయనకు మూడు తరాలుగా అంత భిన్నమైన పాఠకులు సమకూరారు.
వివి కవిత్వ నిర్మాణాల గురించి, ప్రయోగాల గురించి ఎంతయినా చెప్పవచ్చు. బహుశా తెలుగు విప్లవ వచన కవిత్వంలోని ప్రయోగాల్లో ఆయన ముద్ర అసాధారణం. తన అరవై ఏళ్ల కవిత్వ జీవితంలో కనీసం ఏడెనిమి దశలను దాటుకుంటూ ఎక్స్టెండ్ అవుతున్న కవి ఆయన.
ఈ దేశ ప్రధానిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ʹప్రమాదకర వ్యక్తిʹగా ఆయన జెయిలుకు వెళ్లిన సందర్భం ఇది. ఇప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని ఆయన కవిత్వ రహస్యంలో చూడటం వరకే పరిమితం కావడం బాగుంటుంది. పైగా వివి కవిత్వ విశ్లేషణకు అంతిమసారంలో ఇదొక్కటే మౌలిక ప్రాతిపదిక. ముపై ఏళ్ల కింద ʹముక్తకంఠంʹలో ʹనా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమేʹ అన్నారు. నక్సల్బరీతోపాటు కలిసి నడిచిన యాభై ఏళ్ల ప్రజా జీవిత సారానికి ఈ ఒక్క మాటే మకుటం.
కవులు మామూలుగా తమ కవిత్వం ఎలాంటిదో తామే చెప్పుకున్న సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. అందులోని కవిత్వంతో మనం అనుభూతి చెందవచ్చు. కానీ వివి తన వ్యక్తిత్వసారమంతా కవితా రహస్యంలో ఉందని చెప్పారు. చాలా పారదర్శకమైన ప్రజా ఆచరణ రహస్యం అది. అత్యున్నత మానవ జీవిత తలంలో నిలబడి తనను, తన కవిత్వాన్ని పునర్దర్శించకుంటూ చేసిన వ్యాఖ్య ఇది. విచిత్రమేమంటే ఆయన అభిమానులకూ, రాజ్యానికి తెలిసిన ఈ విషయం దాదాపుగా సాహిత్య విమర్శకులెవరూ పట్టుకోలేకపోయారు.
కవిత్వం ఎలా ఉండాలో విమర్శకులు చాలా ఎక్స్ర్సైజ్ చేసి ఉండవచ్చుగాని, ఎవరి కవిత్వానికైనా ప్రభావశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎలా అంచనా కట్టగలం? అనే అతి ముఖ్యమైన ప్రశ్నల వైపు విమర్శకులు దృష్టి సారించలేకపోయారు. వివి కవిత్వాన్ని ఇలా చూడకపోవడం వల్ల ఆయనకు ఏమోగాని తెలుగు కవిత్వానికి, విమర్శకు చాలా నష్టం జరిగింది. ఆయన వ్యక్తిత్వ, కవిత్వ ప్రభావం ఎలాంటిదంటే ఊహించని వైపుల్లో అభిమానులు ఉన్నట్లే వ్యతిరేకులు ఉంటారు. వాళ్ల దృష్టి నుంచి చూస్తే .. బహుశా సాహిత్యరంగంలో సహేతుకంగానే అంతమంది వ్యతిరేకులు ఉన్న కవి కూడా మరొకరు ఉండకపోవచ్చు. కవిత్వమంటే ఆచరణ అనే తిరుగులేని ప్రాతిపదిక మీద ఆయన దృఢంగా నిలబడటమే దీనికి కారణం. సహేతుక వ్యతిరేకులని అన్నది ఈ అర్థంలోనే. అదే ఆయన ఆకర్షణ.
కవితా రచన ఆయనకు కంఫర్ట్ జోన్ కాదు. నిత్యం పులి నోట్లో తలపెట్టి బైటికి వస్తూ వస్తూ ఒక కవితను నిర్మిస్తారు. ఈ యాభై ఏళ్లలో అనేక సార్లు ప్రాణ హాని పొలిమేరల్లోకి వెళ్లి వస్తూ సృజనాత్మకతను సారభూతం చేసుకుంటారు. ఇల్లు, వీధి, జెయిలు.. అన్నీ వివికి మానవ ఆచరణ తలాలే. ఇంట్లోంచి వీధిలోకి వెళ్లి తిరిగి వచ్చినంత అలవోకగా జెయిలుకు పొయి రావడం ఆయనకు అలవాటైంది. అక్కడా, ఇక్కడా కవిత్వం రాస్తూనే ఉంటారు. ఈ సాహసంలోంచి ఆయన సృజనాత్మకత ఈ వయసులో కూడా వెల్లివిరుస్తోంది. ఆయన ఆకర్షణలోని అట్టడుగు తలం ఇక్కడ ఉంది.
ఆయన మావోయిస్టు ఉద్యమ వ్యాఖ్యాతగా రాటుదేలడం వెనుక చరిత్ర ఇచ్చిన స్థల కాలాల ప్రమేయం ఉన్నమాట నిజమే. కాని ఆ స్థలకాలాల అర్థాలు, అవసరాలు గుర్తెరగడంలో ఆయనలోని మేధావి కంటే కవే ఆయనను నడిపిస్తూ వచ్చాడు. ఆ కవికి కవిత్వపు గీటురాయి మానవ ఆచరణే . అందువల్ల హోరెత్తే కల్లోల ఉద్యమాల వెంట ఉద్వేగ వ్యక్తీకరణగా, చారిత్రక కవితా ధారగా యాభై ఏళ్ల నుంచి సాగిపోతున్నారు. ఇదంతా కఠినమైన ఆచరణ. దీన్ని ఆయన చైతన్యవంతంగా ఎంచుకున్నారు. ఎంతగానంటే మావోయిస్టు ఉద్యమంతో ఆయన అభేదమే ఆయనలోని కవికి నిత్య ప్రేరణ. ఈ యాభై ఏళ్లలో విప్లవోద్యమానికి వేర్వేరు సందర్భాల్లో ఎందరో ప్రతిభావంతమైన వ్యాఖ్యాతలుగా ముందుకు వచ్చారు. వాళ్లందరిలోనూ వివి ప్రత్యేకత ఈ అభేదానుబంధంలోనే ఉంది. పదే పదే ప్రమాదకర వ్యక్తిగా రాజ్యం వెంటాడటానికి ఇదే కారణం. ఆ రకంగా ఆయనలాంటి వ్యాఖ్యాత ప్రపంచ విప్లవోద్యమాలకు, నిర్మాణాలకు, ప్రజా పోరాటాలకు మరొకరు ఉండకపోవచ్చు.
కవిగా ప్రజా జీవితం, జెయిలు జీవితం రెండూ వివికి అవిభాజ్యం. అందుకే విశ్వాసాల కోసం ఇప్పటికే సుదీర్ఘకాలం జెయిలు జీవితం గడిపి, ఈ వృద్ధాప్యంలో కూడా మళ్లీ జెయిలుకు వెళ్లారు. ఆయన చిరునవ్వు రహస్యం కూడా ఆయన కవిత్వమే.
Keywords : varavararao, virasam, maoists
(2024-02-28 23:09:46)
No. of visitors : 1497
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |