పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర


పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర

పోరాడి

పోరాడితే పోయేదేముంది.? బానిస సంకెళ్ళు తప్ప.! అనే నినాదం ఎన్నికైనా రాజ్యం మెడలు వంచేదే. తమ హక్కులు కాపాడుకోవడానికి పోరాటానికి మించిన ఆయుధం లేదని ఈ మహారాష్ట్ర గిరిజన రైతులు మరో సారి నిరూపించారు. పోడు భూములపై హక్కు, రైతు రుణమాఫి, కరువుసాయం కోరుతూ వేలాది మంది రైతులు మంగళవారం మధ్యాహ్నం థానేలో ప్రారంభించిన ర్యాలీ ఇవాళ మహారాష్ట్ర విధాన సభ వరకు చేరుకుంది.

మా నేల మాకు కావాలి.. రుణాలతో బక్కచిక్కిన రైతులకు రుణమాఫీ చేయాలి.. కరువుసాయం అందించి అన్నదాతను ఆదుకోవాలంటూ మరాఠ్వాడ, థానే, భుసావల్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైతులు ఈ మహాపాదయాత్రలో నడిచారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగాసెసె అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ ఈ రైతుల వెంట నడిచారు.

ఇవాళ ముంబై రోడ్ల వెంట వేలాదిగా రైతులు తమ నిరనను తెలియజేస్తూ.. డిమాండ్ల సాధనకై నడిచి వస్తుంటే స్థానిక ముంబైవాసులు వారిని సాదరంగా ఆహ్వానించారు. వారికి తమ సానుభూతి తెలియజేస్తూ మంచినీళ్లు, ఆహారం అందించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భారీ ర్యాలీ ఆజాద్ మైదానానికి చేరుకుంది. 20 వేలకు పైగా రైతులు ఆజాద్ మైదానంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించారు. రైతు ప్రతినిధులు కొంత మంది విధాన సభలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కలిశారు.

రైతుల డిమాండ్లలో చాలా వాటిని తీరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారికి మేలు కలిగేలా రాబోయే మూడు నెలల్లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్‌లో మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన వారికి పరిహారంతో పాటు పంట సాయం కూడా చేస్తామన్నారు. తమ పేరిట భూములు లేకపోవడం వల్ల పంటను అమ్ముకోలేక నష్టపోతున్న రైతులకు వెంటనే భూములు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. అలాగే పేద రైతులకు ధాన్యం, నిత్యావసరాలు నామమాత్రపు ధరకు అందేలా చూస్తామని సీఎం ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.

మహాపాదయాత్ర సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా రైతులు ప్రశాంతంగా ర్యాలీని నిర్వహించారు. మూడు నెలల్లో హామీలు నెరవేర్చకుంటే ఈ సారి మరింత మందితో రాజధానిని చుట్టుముడతామని హెచ్చరించారు.

Keywords : maharashtra, farmers, march, mumbai, forest rights act, మహారాష్ట్ర, గిరిజన,రైతులు, పాదయాత్ర,
(2018-12-14 23:11:17)No. of visitors : 161

Suggested Posts


0 results

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


పోరాడి