భారతీయ శిక్షాస్మృతిలో గృహ నిర్బంధం గురించి విధి నిషేధాలు రచింపబడి ఉన్నట్లు లేదు. నాకు తెలిసి ఎమర్జెన్సీలో జయప్రకాశ్ నారాయణ్, మురార్జీదేశాయ్, పీలూ మోడీ వంటి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారని విన్నాను. అది కూడా కోర్టు కాదు, కేంద్ర ప్రభుత్వం గృహనిర్బంధం పేరుతో వారిని ప్రభుత్వ అతిథి గృహాల్లో నిర్బంధించింది. అయినా ప్రాథమిక హక్కులు కూడ రద్దయిన అత్యయిక పరిస్థితిలో, శిక్షాస్మృతిలో లేని ఆంతరంగిక భద్రతా చట్టం (మీసా) అమలయిన పరిస్థితి సాధారణ స్థితిని (!) పోల్చలేం.
చాలా కాలంగా కశ్మీర్లో మాత్రం భారత ప్రభుత్వ హింసా నిర్బంధాలకు వ్యతిరేకంగా హురియత్ నాయకులు ప్రజా ప్రదర్శనకో, బంద్కో పిలుపు ఇచ్చినప్పుడుగానీ, భారత ప్రభుత్వ అధినాయకులు కశ్మీర్ పర్యటనకు వెళ్లినపుడో, ఏదయినా ఎన్కౌంటర్గానీ, సైనిక చర్యగానీ జరిగినపుడో హురియత్ నాయకులు ఎస్.ఎ. గిలానీ, ఫర్వేజ్ ఉమర్, యాసిన్ మలిక్ వంటి వాళ్లను రోజులు, నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు వింటున్నాం. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో రాజా సింగ్ వంటి వారి విషయంలో వింటున్నాం.
కాని ఇవన్నీ ప్రభుత్వం ముందస్తుగా అమలుచేస్తున్న నిర్బంధాలుగా కనిపిస్తున్నాయిగానీ అత్యున్నత న్యాయస్థానం ఒక పోలీస్ స్టేషన్లో (అస్రాంబాగ్ పోలీస్ స్టేషన్, పూణె) నమోదయిన భీమా కోరేగాం కేసులో పోలీసులకు కావలసిన వారిని గృహ నిర్బంధంలో ఉంచమని ఉత్తర్వులివ్వడం కొత్త అనుభవంగా ఉన్నది.
ఆ సందర్భంగా అరెస్టయిన ఇద్దరు తమ స్వస్థలాల (ఢిల్లీ, ఫరీదాబాద్) నుంచి ట్రాన్సిట్ వారంట్ ఇవ్వవద్దని హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురిని పూణె కోర్టుకు తీసుకవెళ్లి హాజరుపరిచారు. ఈ ఐదుగురి అరెస్టును సవాల్ చేస్తూ రొమిలా థాపర్ మొదలయిన వాళ్లు సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 5న ఈ ఐదుగురు కూడా అదే విజ్ఞప్తి చేశారు.
అప్పటికే ఆగస్ట్ 29 నుంచి ఈ ఐదుగురి విషయంలో గృహ నిర్బంధం అమలవుతున్నది. సుప్రీం కోర్టు గృహ నిర్బంధంలో ఉంచమని ఆదేశించి సెప్టెంబర్ 21 వరకు వాదనలు విని తీర్పును రిజర్వులో పెట్టింది గాని గృహ నిర్బంధం ఎట్లా అమలుచేయాలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ సూచనలు ఇవ్వలేదు.
కనుక ఢిల్లీ (గౌతమ్ నవ్లాఖా), హర్యానా (సుధా భరద్వాజ్), మహారాష్ట్ర (వర్నన్ గోంజాల్వెజ్, అరుణ్ ఫరేరా)ల విషయంలో, నా విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు తీసుకునే వైఖరియే చట్టం-శాసనం. ఢిల్లీ పోలీసులను నియంత్రించేది కేంద్ర ప్రభుత్వమేగనుక, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో, కశ్మీర్ ప్రజల విషయంలో ఏ వైఖరి తీసుకుంటుందో గౌతమ్ నవ్లాఖా విషయంలోనే కాదు, ఆయన కుటుంబం విషయంలో కూడా అదే కఠిన వైఖరి తీసుకున్నారు. ఆయన ఉన్న ఇంటికి ఎర్ర బట్టకట్టి, రాత్రి పడకగది తలుపులు కూడా తీసుకొని పడుకోవాలన్నారు.
నిందితులు గృహ నిర్బంధంలో ఉంటే కోల్పోయే చలన స్వేచ్ఛ వారి సహచరులకు, కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందా? సాధారణ శిక్షా స్మృతి ప్రకారం జుడిషియల్ కస్టడీ, జైలు అయితే అక్కడ ఇంటి నుంచి వేరుచేయబడి జైలు అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ముద్దాయిలు ఉంటారు.
అక్కడ అండర్ ట్రయల్స్‌కు వర్తించే నియమాలు వర్తిస్తాయి. మరి వాళ్ల వాళ్ల ఇళ్లల్లో వాళ్లతోపాటు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా నియంత్రణకు గురవుతారా? వాళ్లంతా స్వతంత్ర పౌరులు కదా. అంతేకాదు గౌతం నవ్లాఖా తప్ప మిగతా అందరూ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌లో ఉంటారు. ముద్దాయిల ఫ్లాట్స్ ముందే కాకుండా అపార్ట్మెంట్స్ ముందుకూడా పోలీసు బందోబస్తు పెడితే వాళ్లు మిగతా ఫ్లాట్స్‌లో ఉండేవారిపై కూడా నిఘా కాపలా పెట్టినట్లే కదా.
సుప్రీం కోర్టులో ఇటీవల చర్చకు వస్తున్న ఫిర్యాదులన్నీ కూడా అది ఆధార్ కార్డు విషయంలో కావచ్చు, ట్రాన్స్‌జెండర్ విషయంలో కావచ్చు, శబరిమలైకి 10-50 సంవత్సరాల మధ్య వయసు స్త్రీలను అనుమతించే విషయంకావచ్చు-బాబ్రీ మసీదు విషయంలో గానీ, వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవసీ హక్కు, స్త్రీపురుష సమానత్వం, పిల్లలకుండే స్వేచ్ఛ, హక్కుల గురించి, మత విశ్వాస స్వేచ్ఛ గురించి.
ఒకరి స్వేచ్ఛను నియంత్రించే ప్రభుత్వ అధికార హస్తం మరొకరి ముక్కుదాకా సాచడానికి, జోక్యం చేసుకోవడానికి వీలులేదు కదా.
ఒక ఫ్లాట్ ముందర- ఆ ఇంట్లో నిందిత/నిందితుడు మాత్రమే ఉండకపోవచ్చు. సుధా భరద్వాజ్‌ది రెండు గదుల ఫ్లాట్ అట. అందులో ఆమె ఒక గది తనకు కాపలా ఉండే మహిళా పోలీసులకిచ్చి మరొక గదిని తన కూతురుతో పంచుకుంటున్నది. ఆమె చాల మెత్తని మనిషి, మర్యాదస్తురాలు గనుక ఉదయమే ఆ మహిళా పోలీసులకు టీ కూడ చేసి ఇస్తున్నది గానీ, ఆమెనే కాకుండా, ఆమె ఎదిగిన కూతురు ప్రైవసీ విషయంలో కూడా పోలీసుల జోక్యం ఉంటున్నట్లే కదా.
వర్నన్ది చిన్నఫ్లాటు - ఆయన సహచరి సుప్రసిద్ధ న్యాయవాది సుసాన్ అబ్రహం. కొడుకు సాగర్ మేజర్. ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ల స్వేచ్ఛ? అరుణ్ ఫరేరా స్వయంగా న్యాయవాది. సుసాన్ అబ్రహాంతోపాటు ఆయన ఇదే భీమా కోరేగాం కేసులో నిందితులు కొందరి తరఫున వాదిస్తున్నాడు. ఆయన తన సహచరి, మైనర్ కొడుకుతోపాటు ఒక పెద్ద కుటుంబంతో థానేలో ఉంటాడని విన్నాను వాళ్లందరి స్వేచ్ఛా? వాళ్లందరూ పొందవలసిన న్యాయం, స్వేచ్ఛ?
మహారాష్ట్రలో బిజెపి శివసేనల ప్రభుత్వం అయితే-మోడీ ఫడ్నవీస్‌ల ప్రభుత్వమైతే-తెలంగాణలో ప్రచ్ఛన్న నయా పీష్వాయీ ప్రభుత్వం, తెరాస ప్రభుత్వం.
సెప్టెంబర్ 30న నా ఫ్లాట్‌లో ప్రవేశపెట్టిన రోజే సిఐ భీంరెడ్డి మీడియాతో మాట్లాడవద్దని, రక్త బంధువులను, న్యాయవాదులను తప్ప అనుమతించనని ఫర్మానా వేసి పోయాడు. న్యాయవాదుల పేరుతో ఒకరికన్న ఎక్కువగా, బంధువుల పేరుతో నా ముగ్గురు కూతుళ్లకన్న ఎక్కువగా వస్తున్నారని, రెండు రోజులు గడవక ముందే కోర్టులో వేసి గృహ నిర్బంధం క్యాన్సిల్ చేసుకొని జైలుకు వెళ్లవలసిందని ఉచిత సలహా కూడ ఇచ్చాడు.
ʹఅత్యున్నత న్యాయస్థానం నేను కోరకుండానే కల్పించిన సాపేక్ష స్వేచ్ఛనయినా నేనెట్లా వదులుకుంటాను, అంతగా మీకు శాంతి భద్రతల సమస్య అయితే మీరే కోర్టుకు వెళ్లి గృహ నిర్బంధాన్ని క్యాన్సిల్ చేయించండిʹ అని చెప్పాను.
ఆయన నాకు మళ్లీ కనిపించలేదు గానీ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ నుంచే రిమోట్ కంట్రోల్ చేస్తున్నట్లున్నాడు.
రక్తబంధువైనా సరే దేవులపల్లి అమర్‌ను జర్నలిస్టు అని అనుమతించ లేదు. ఆయన డిజిపితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది.
నాకు బాల్యం నుంచి తెలిసిన చుక్క రామయ్య, ఎంఎలో నాకు సీనియర్ డా. విజయభారతి, డెబ్బైల నుండే తెలిసిన చెరుకు సుధాకర్, కోదండరామ్, ఇన్నయ్య, గురిజాల రవీందరరావు, చాడ వెంకటరెడ్డి మొదలైన, ఇంకా నా దృష్టికి రాని వాళ్లెందరినో అనుమతించలేదు. డాక్టర్ విజయ భారతిగారు వయసు, అనారోగ్యం వల్ల గీతారామస్వామిని తోడు తెచ్చుకున్నది. చుక్కరామయ్యగారు అయితే తొంబైలో పడుతున్నారు. వీళ్లంతా కేవలం నా ఆరోగ్యాన్ని పరామర్శించడానికి వచ్చారు.
ʹకేంద్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రిగా ఉన్నపుడు ఆయన వెంటవెళ్లి చంచల్‌గూడ జైల్లో వివిని కలిసాను. ఇపుడాయన ప్రభుత్వంలో నాకా అవకాశం లేదాʹ అని అడిగాడు చెరుకు సుధాకర్. ఆయన, ఆయన సహచరి లక్ష్మి విరసంలో సభ్యులు, ఉద్యమ మిత్రులం. బాగ్లింగంపెల్లిలో కొద్దిరోజులు దగ్గరలో ఉన్నాం.
కోదండరామ్ విద్యార్థిగా, ఎపిసిఎల్సి, ఎచ్ఆర్ఎఫ్ సభ్యుడుగా, ఉపాధ్యాయుడుగా తెలిసినవాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక మీద నేనెన్నోసార్లు ప్రసంగించాను. కలిసి పనిచేసిన వాళ్లం. కుటుంబ మిత్రులం.
ʹజైల్లోనయినా ములాఖత్ ఉంటుంది ఇంట్లో కలవడానికి లేదా - ఆయనతో టీచర్‌గా, రచయితగా పరిచయం ఉంది. కుటుంబంతో అనుబంధం ఉందిʹ అన్నాడు. ʹకేవలం ఆయన ఆరోగ్యం గురించి పరామర్శించడానికి వచ్చాంʹ అని కూడా అన్నాడు.
చాడ వెంకట్‌రెడ్డి, గుర్రం విజయ్‌కుమార్ మొదలయిన వారితో, వాళ్ల వెంటవచ్చిన వాళ్లతో, డా. చెరుకు సుధాకర్‌తో, ఆయన వెంట వచ్చిన వాళ్లతో, ప్రొ. కోదండరామ్‌తో, ఆయన వెంట వచ్చిన వాళ్లతో, చుక్క రామయ్య గారితో, ఆయన వెంట వచ్చిన వారితో నా సహచరి హేమలత కిందికి వెళ్లి మాట్లాడి రాగలిగిందిగానీ దేవులపల్లి అమర్ విషయంలో ఆ అవకాశం కూడా రాలేదు.
డాక్టర్ విజయభారతి గారయితే వచ్చిపోయాక తెలిసింది. ఎంఎలో క్యాంపస్ నుంచి బొజ్జా తారకం గారితో ఆయన సాహచర్యం నుంచి, అటు బోయి భీమన్నగారి కూతురిగా, ఇటు తారకంగారి సహచరిగా మాత్రమే కాకుండా-ఈ ఇద్దరికన్నా ముందు నుంచి 58 ఏళ్ల నుంచి తెలిసిన సాహిత్య పరిచయం మాది. ఆమె అనారోగ్యంతో వ్యగ్రతతో నా ఆరోగ్యాన్ని పరామర్శించడానికి వచ్చింది.
వీళ్లందరూ-నాకు ముప్పై, ఏబై ఏళ్లకు పైగా తెలిసిన వాళ్లు. కేవలం పరిచయం కాదు స్నేహం, అనుబంధం ఉన్నది.
వీళ్లెవరూ ఇప్పుడు నా రాజకీయాలతో ఉన్నవాళ్లు కాదు. ప్రజాస్వామ్యవాదులు. కాకపోతే వీళ్లెవరూ తెరాస రాజకీయాలలో కూడా ఉన్నవాళ్లు కాదు.
కొద్ది కాలంగా నేను చిన్న చిన్న అనారోగ్యాలకు గురవుతున్నానని, వయసు వల్ల కూడా పరామర్శించాలని వచ్చినవాళ్లు - వీళ్లలో కొందరు చెరుకు సుధాకర్, గాదె ఇన్నయ్య, గురిజాల రవీందర్, కోదండరామ్‌లు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెరాసకన్నా ముందు నుంచి, అంటే కెసిఆర్ కన్నా ముందు నుంచి పనిచేస్తున్నవాళ్లు.
నేను ఏభై ఏళ్లుగా నక్సల్బరీ, ప్రజాస్వామిక తెలంగాణ రెండు కళ్లుగా ఉద్యమంలో, ఉద్యమంతో ఉన్నవాణ్ణి.
విరసం నిషేధానికి గురయి, మా అధ్యక్షుడు జి. కళ్యాణరావు, నేను ప్రజా భద్రత చట్టం కింద చంచల్‌గూడ జైయిల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి కె. చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వచ్చాడు. వెంట ప్రొఫెసర్ జయశంకర్, మరో ఎనిమిది మంది తెరాస ఎంఎల్ఎలు లేదా స్థాని నాయకులు ఉన్నారు. అప్పటికి మా మీద ఎనిమిది కేసులు కూడా పెట్టారు.
అది 2005 గ్రామ పంచాయితీ ఎన్నికల కాలం. 3 సెప్టెంబర్ 2005. అప్పటికయితే మావోయిస్టు పార్టీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచినపుడు పీస్ ఇనిషియేటివ్ కమిటీ తరఫున కన్వీనర్ సూరిశెట్టి సుధాకర్ పిలిచిన సభలో సుందరయ్య విజ్ఞాన భవన్లో ఒకే వేదిక మీద ఆయనను చూసిన, ఆయన నాతో చూపులు కలిపిన సందర్భం తప్ప మేమిద్దరం ఎప్పుడూ కలుసుకున్నదీ లేదు, మాట్లాడుకున్నదీ లేదు.
మా ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి అభిప్రాయాలు ఏర్పడడానికి ప్రకటిత అభిప్రాయాలు, ఆచరణ కాకుండా ఇంకేదయినా అదనంగా సమాచారం ఉంటే అది జయశంకర్, మంజీర రచయితల సంఘం నుంచి ఏర్పరుచుకున్నదే అయి ఉండాలి.
కనుక మా పరిచయాన్ని, స్నేహం అని చెప్పడానికి వీలు లేదు. దృక్పథాలు పరస్పర భిన్నమైనవి.
రాగానే ఆరోగ్యాన్ని పరామర్శించి-మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అని అడిగాడు. అరెస్టు చూపిన ప్రజా భద్రతాచట్టం కాకుండా నాపె,ౖ కళ్యాణరావుపై చెరి ఎనిమిది కేసుల్లో ప్రొడక్షన్ వారంట్లు జైలుకు వచ్చాక వచ్చాయి అని చెప్పాను. ʹఆ కేసులన్నీ ఎత్తివేస్తారు. అదేమంత పెద్ద విషయం కాదు. మనం శాశ్వత శాంతి గురించి మాట్లాడుకుందాం. అందుకని వచ్చానుʹ అన్నాడు. ʹమనమంతా, వచ్చిన మీరు, లోపల ఉన్న నాతో సహా తెల్లబట్టల వాళ్లం. మనం కూడ నాగళ్లు పట్టుకొని దున్నిన నాడు శాశ్వత శాంతి వస్తుందిʹ అని చెప్పాను. ఆయన వెంట ఉన్నవారిలో ఎవరో మీడియాకు చెప్పినట్లున్నారు. పత్రికల్లో బాక్స్ ఐటమ్‌గా వచ్చింది. (అప్పుడు లిఖితపూర్వకంగా ఆయనకు ఒక విజ్ఞప్తి పత్రం కూడా ఇచ్చాను.)
2014 ఎన్నికలకు ముందు రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల విడుదల-తమ తమ రాజకీయ పార్టీల మానిఫెస్టోలో చేర్చవలసిందని ఆ కమిటీతోపాటు నేను, ఎపిసిఎల్సి అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కామ్రేడ్ హుస్సేన్, ఆజాద్ పద్మ వెళ్లినపుడు కూడా ఆయనకు చెప్పాను. రాజకీయ ఖైదీలు, జీవిత ఖైదీలదేముంది - మేము అధికారానికి రాగానే వదిలివేస్తాం, మనిషి కోరుకున్న అన్నిటికన్నా విలువైనది స్వేచ్ఛ అని మాకాయన పాపిలాన్ (తెలుగులో ʹపంజరంʹగా డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి అనువదించాడు) కథ చెప్పాడు.
మావోయిస్టు ఎజెండా - మైనస్ తుపాకీ ఎట్లా అమలు చేయాలో మాట్లాడుకుందాం అని నలభై అయిదు నిమిషాలు చర్చించాడు. ఎస్.సి., ఎస్.టి. వర్గాల కోసం చట్టపరంగా కేటాయించిన నిధుల నుంచి కొనయినా సరే ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్నాడు. ʹవాళ్ల భూమి వాళ్లకే కొని ఇవ్వడం ఏమిటి? అది వాళ్ల హక్కు భుక్తంʹ అన్నాను. ʹప్రభుత్వ భూములు చాలకపోతే ప్రైవేట్ భూములు కొనయినా పంచాలి కదా.
ఉదాహరణకు మా తాతల కాలం నుంచి నాకు వచ్చిన పట్టా భూములున్నాయి. మీకూ ఉండొచ్చుʹ అన్నాడు. ʹనాకిప్పుడు లేవు. ఉన్నా అవి దురాక్రమణే. ఎందుకంటే మనం ఇద్దరమూ ఉత్పత్తి కులం నుంచి వచ్చిన వాళ్లం కాదʹన్నాను. ʹనీతో ఇదే పంచాయితీʹ అన్నాడు. బయటికి వచ్చి ఆరోజే మీడియా ముందు ఈ చర్చ అంతా ఇంకా వివరంగా కూడ చెప్పాను.
నేనీసారి ఆగస్టు 28న అరెస్టు కావడానికి ముందురోజు సుందరయ్య విజ్ఞాన భవన్లో కౌలురైతులకు, ఆదివాసులకు రైతు బంధు, పట్టాలు, రుణ మాఫీలు, రుణాలు ఇవ్వాలని రైతు సంఘాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన విశాల ఐక్యవేదిక సభలో క్లుప్తంగా ఈ రెండు సందర్భాలను గుర్తుచేసి (3 సెప్టెంబర్ 2005, 2014 ఎన్నికలకన్నా ముందు మార్చ్ 23) చర్చల సందర్భంగా మావోయిస్టు పార్టీ, సిసిఐ ఎంఎల్ జనశక్తి- భూసంస్కరణల చర్చలో ప్రతి దళిత కుటుంబ మహిళా యాజమాన్యాన్ని గుర్తించి మూడెకరాల భూమి ఇవ్వాలన్న ప్రతిపాదనతో పాటు భూమి, పశువులు, విత్తనాలు, ఎరువులు కూడా సమకూర్చడం నిజమైన భూసంస్కరణలు అని ప్రతిపాదన పెట్టారని - భూసంస్కరణల చర్చలో అప్పటికే కరీంనగర్ జిల్లాలో భూ సంబంధాల గురించే అధ్యయనం చేస్తూ పోరాడుతున్న రియాజ్‌ను ఎన్కౌంటర్లో చంపిన విషయం గుర్తుచేశాను.
ఒక్క కౌలురైతులు, ఇనాం భూములు, వక్ఫ్ భూములు చేస్తున్న రైతులే కాకుండా ముప్పై ఏడు రకాలుగా భూమి మీద కష్టం చేస్తున్న భూమి హీనులందరికీ, అవన్నీ ప్రభుత్వ భూములు కాబట్టి పంచాలని అప్పుడు రెండు పార్టీలు ప్రతిపాదించాయని చెప్పాను.
ముగింపుగా ఒక్క రియాజ్ సందర్భంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్-తెరాస పొత్తు ప్రభుత్వంలో ఉన్న తెరాస ఎనిమిది మంది మంత్రులు రాజీనామా చేసి ఆ ఎన్‌కౌంటర్‌కు నిరసనగానే కాకుండా కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తూ ఆ ఒక్కరోజు వాళ్లంతా మాట్లాడారని, ముఖ్యంగా వికారాబాద్ నుంచి ఎన్నికై మంత్రివర్గంలో చేరిన చంద్రశేఖర్ ప్రసంగాన్ని గుర్తుచేశాను.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇద్దరే ఇద్దరు తెరాస మంత్రులు కెసిఆర్, నరేంద్రలు మాత్రం రాజీనామా చేయలేదు. ఇవ్వాళ బిజెపి పాలనకు బేనామీగా పనిచేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం-నయీ పీష్వాయీ విధానాలనే అమలు చేయడం ఆశ్చర్యం కాదనడానికే ఇది గుర్తుచేస్తున్నాను.
ఇది కాంగ్రెస్‌లో అర్ధ సింహాసనం పంచుకోవడం కాదు (2004-5లో వలె), ఇప్పుడిది బిజెపి సామంతరాజ్యం. కనుక జైల్లో నా ఆరోగ్యం గురించి కేంద్ర మంత్రిగా పరామర్శించడానికి వచ్చిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత, గృహ నిర్బంధంలో ఉన్న నన్ను పరామర్శించడానికి వచ్చిన నాకు గౌరవనీయులు, స్నేహితులు అయిన వారిని కలవనివ్వకపోవడంలో ఆశ్చర్యం లేదు.
అయినా ఆయన ఈ నాలుగున్నరేళ్ల పాలన కాలంలో కూడ 2015 సెప్టెంబర్ 21 నుంచి చాల సందర్భాల్లో అరెస్టవుతూ, పోలీసులాకప్లోకి వెళ్తూ, కేసులు కూడా ఎదుర్కొంటున్న వేలాది మంది ఉద్యమకారుల్లో ఒకనిగా ఇంతకన్న భిన్నంగా ఆయన వ్యవహరిస్తాడని కూడా అనుకోలేదు. ఈ గృహ నిర్బంధాన్ని అమలు చేస్తున్నది ఆయన ప్రభుత్వం. ఆయన పోలీసులే కదా. చిక్కడపల్లి సి.ఐ. అయినా డి.జి.పి. అయినా.
ఆగస్టు 28న పూణె పోలీసులు నాకోసం సెర్చ్ వారంట్ తీసుకొని, నాతోపాటు మూడు ఇళ్లకు వచ్చారు. నా దగ్గరికి ఉదయం 6 గంటలకే వస్తే నా అల్లుళ్ల, కూతుళ్ల ఇంటికి 8:30 గంటలకు వెళ్లారు - అవి నా ఇళ్లే - నేను దొరికే స్థలాలేనని ఆరోపిస్తూ. ఆ సందర్భంలో తెలంగాణ పోలీసు అధికారులు పూణె పోలీసులకు సహకరిస్తూ వ్యవహరించిన తీరు వాళ్ల మాటల్లో వినేవున్నాం.
తెరాస ప్రభుత్వ పోలీసుల నిజ రూపాన్ని, నగ్న రూపాన్ని చూపింది మాత్రం టేకుల క్రాంతి ఇంటి మీద దాడి, సోదా. ఆ ఇంటికి సెర్చ్ వారంట్ లేకుండా పోయారు. అది కేవలం పూణె పోలీసులు తెలంగాణ పోలీసుల, ప్రభుత్వ సహకారం కోరిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు ఇచ్చిన ఆప్టర్ థాట్. అదనపు నిర్బంధకానుక.
అందుకే అక్కడ క్రాంతి విషయంలోనే కాదు, అతని వృద్ధురాలైన, గుండె వ్యాధిగల తల్లితో ప్రవర్తించిన తీరులో, ఇంట్లో అతని చెల్లెలు, తమ్మునితో వ్యవహరించినతీరులో కూడ ఈ కక్ష కనిపిస్తుంది.
ముఖ్యంగా ఇది సాకుగా ʹనమస్తే తెలంగాణʹ నుంచి వెంటనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడంలోనే తెరాస ప్రభుత్వ అత్యుత్సాహ సహకారం స్పష్టమవుతుంది.
తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావుమహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకులకు వరవరరావు సవాల్మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది. |
కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు... |
ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |
తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావురాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి. |
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..? |
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ |
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి || |
కలత నిద్దురలోనూ దండకారణ్యమే |
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ |
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల |
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వాలి |
వీవీ, గాడ్లింగ్ లపై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం |
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు |
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur |
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating |
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions |
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు |
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు |
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ |
నల్గొండలో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల |
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde! |
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు |
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh |
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్ తెల్తుంబ్డే |
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde |
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు |
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్ |
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet |
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని |